చిరంజీవికి నో చెప్పిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

Published : Nov 15, 2022, 09:05 AM ISTUpdated : Nov 15, 2022, 08:51 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రెండు సినిమాలు మూడు సినిమాలొచ్చాయి. మరో రెండు సినిమాలు ఆగిపోయాయి. మరి అవి ఆగిపోవడానికి అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
16
చిరంజీవికి నో చెప్పిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్‌కి మూడో కన్నులాంటి వారు కృష్ణ. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. వారిద్దరు వెళ్లిపోయాక పెద్దదిక్కులా ఉన్నారు కృష్ణ. వివాదాలకు దూరంగా, అజాత శతృవుగా రాణించిన కృష్ణ.. మెగాస్టార్‌కి నో చెప్పడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మరి కృష్ణ నో చెప్పడానికి కారణమేంటి?ఆ సినిమా ఏంటి? అనేది చూస్తే. 

26

చిరంజీవిని తొలుత ప్రోత్సహించిన వారిలో కృష్ణ కూడా ఉన్నారు. ఆయన కొత్త టాలెంట్‌ని పరిచయం చేయడంలో ముందే ఉంటారు. అలా ఎంతో మంది దర్శకులను పరిచయంచేశారు. అయితే చిరంజీవిని సైతం ప్రోత్సహించేవారు. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో `కొత్తల్లుడు`, `కొత్త పేట రౌడీ`, `తోడు దొంగలు` చిత్రాలు వచ్చాయి. మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీటిలో కీలక పాత్రల్లోనే చిరు నటించారు. `కొత్తల్లుడు`లో చిరు నెగటివ్‌ రోల్‌ చేయడం విశేషం.
 

36

కానీ చిరంజీవి నటించిన `స్నేహం కోసం` సినిమాలో కృష్ణని నటింప చేయాలని భావించారు. ఆయన నో చెప్పడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి దిపాత్రాభినయం చేశారు. తండ్రి కొడుకులుగా అలరించారు చిరు. కానీ తండ్రి పాత్రకి స్నేహితుడి రోల్‌లో విజయ్‌ కుమార్‌ నటించిన విషయం తెలిసిందే. మొదట ఆ పాత్ర కోసం కృష్ణనే అడిగారట. కానీ అందుకు కృష్ణ తిరస్కరించారట. 
 

46

చిరంజీవి స్నేహితుడి పాత్ర అంటే కీలకంగానే ఉంటుంది తప్ప ఇమేజ్‌ వైజ్‌గా ఎలివేట్‌ అయ్యే పాత్ర కాదు. పైగా చిరంజీవి ద్విపాత్రాభినయం. దీంతో ఫ్రెండ్‌గా చేస్తే అభిమానులు నిరాశ చెందుతారని, తాను చేయలేనని చెప్పారట కృష్ణ. ఆయన నో చెప్పడంతో రాజశేఖర్‌ పేరుని కూడా పరిశీలించారట. కానీ చివరికి విజయ్‌ కుమార్‌తో చేయించారు. వీరిద్దరి స్నేహం సినిమాకి హైలైట్‌గా నిలవడంతోపాటు ఇది సూపర్‌ హిట్‌ కావడంలో కీలక భూమిక పోషించింది.

56

ఇదిలాఉంటే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సి ఉంది. `అగ్ని జ్వాల` అనే టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నారు. నిర్మాత బాబూరావు ఓ మలయాళ హిట్‌ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు. ఇందులో అన్నాదమ్ములుగా కృష్ణ, చిరు నటించాల్సి ఉంది. ప్రాజెక్ట్ డిలే కావడంతో చిరంజీవి డేట్స్ లాక్‌ అయిపోయాయి. దీంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మోహన్‌బాబు, నరేష్‌ల కాంబినేషన్లో `అగ్నిజ్వాల` తెరకెక్కింది.

66

ఇదిలా ఉంటే కృష్ణ, చిరంజీవి మధ్య మరో అనుబంధం ఉంది. వ్యక్తిగతంగా చిరుని కృష్ణ ఎంతో ఇష్టపడే వారట. ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు అరుణాచలం గార్డెన్స్ పక్కన ఐదు ఎకరాల స్థలం కృష్ణ కొనుగోలు చేసి దానికి కృష్ణ గార్డెన్స్ అనే పేరు కూడా పెట్టారు. షూటింగ్‌లకు అనుకూలంగా దాన్ని మార్చారు. ఆ స్థలాన్ని చిరు ఇష్టపడటంతో ఓ ఎకరం మెగాస్టార్‌కి అమ్మేశాడు కృష్ణ. అయితే ఇటీవల ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరుకి అప్పులు కావడంతో ఆ ఎకరం స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారని టాక్‌. ఆ తర్వాత కృష్ణ కూడా ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం ప్రభుత్వానికి ఇచ్చేశారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories