దేవర, వార్2... ఎన్టీఆర్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్.. ఏంటంటే?

First Published | Oct 2, 2023, 8:23 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ‘దేవర’, ‘వార్2’పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ రెండు చిత్రాల నుంచి అభిమానులకు బిగ్ అప్డేట్స్ అందాయి. 
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కడంతో పాటు  దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. RRR క్రియేట్ చేసిన సెన్సేషన్ కు తారక్ రాబోయే చిత్రాలపై భారీఅంచనాలు నెలకొన్నాయి. అందుకు తగట్టుగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. 
 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ (Devara)లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ War2లోనూ నటిస్తున్నారు. మరోవైపు సెన్సేషన్ డైరెక్టర్ తో ప్రశాంత్ నీల్ తో NTR31  ఉన్న విషయం తెలిసిందే. 
 


అయితే తాజాగా ‘వార్2’, ‘దేవర’ చిత్రాల నుంచి అభిమానులకు బిగ్ అప్డేట్స్ అందాయి. ముందుకు తారక్ ఫ్యాన్స్ ‘దేవర’ నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రంలో ‘మాస్ ఐటెం సాంగ్’ రూపుదిద్దుకుంటోందని.. త్వరలోనే అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది. 
 

ఇప్పటికే ‘దేవర’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నీటి అడుగున సాగే భారీ యాక్షన్ సీన్ ను కూడా యూనిట్ పూర్తి చేసుకుంటోంది. ఇదివరకే భారీ షిప్ సెట్ లో, కీలక సన్నివేశాలు.. ఓ సాంగ్ ను షూట్ చేశారు.. ఈ క్రమంలో నెక్ట్స్ మాస్ ఐటెమ్ సాంగ్ పై అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
 

ఇక  ఎన్టీఆర్ లైనప్ లోని మరో భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్ War2.  ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) తలపడబోతున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకోనుంది. ఆయాన్ ముఖర్జి (Ayan Mukerji)  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

అయితే, అయాన్ ముఖర్జి ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది. ప్రీ ప్రిడక్షన్ పనులు ప్రారంభించేందు కోసం తారక్ ను మీట్ అయ్యారంట. అతి త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ‘వార్2’పై స్పందించారు. జూ.ఎన్టీఆర్ కు నేను బిగ్ ఫ్యాన్. తారక్, హృతిక్ కలిసి నటించబోతుండటం మోస్ట్ హైప్డ్ కాంబినేషన్ అన్నారు. అలాగే ఈరోజే ‘అదుర్స్’ రీరిలీజ్ డేట్ నూ అనౌన్స్ చేశారు. నవంబర్ 18న మళ్లీ థియేటర్లోకి రాబోతున్నట్టు తెలిపారు. 
 

Latest Videos

click me!