బ్లాక్ టాప్.. లూస్ ఫిట్ ట్రౌజర్ లో మీనాక్షి చౌదరి కిల్లింగ్ స్టిల్స్.. సౌత్ లో అదరగొడుతున్న ‘హిట్2’ బ్యూటీ

First Published | Oct 2, 2023, 7:02 PM IST

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస చిత్రాలతో సౌత్ లో  సందడి చేస్తోంది. అలా దక్షిణాదిన అడుగుపెట్టిందో లేదో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది.
 

నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) బాలీవుడ్ చిత్రం ‘అప్ స్టార్స్’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసిన మొదటి చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సుశాంత్ సరసన నటించి మెప్పించింది. తన నటనతో ఆకట్టుకుంది. 
 

అద్భుతమైన పెర్ఫామెన్స్, ఫిట్ నెస్, అందంలోనూ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఇన్ని క్వాలిటీస్ ఉండటంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందాయి. రవితేజ ‘ఖిలాడీ’, ‘హిట్2’ చిత్రాలతోనూ అలరించింది. Hit2 మీనాక్షి నటిగా మంచి గుర్తింపు అందించింది. 
 

Tap to resize

ఒక్క హిట్ పడటంతో  మీనాక్షిని వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. మరింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

ఈ సందర్భంగా మీనాక్షి స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. కిర్రాక్ లుక్ తో మైమరిపిస్తోంది. తాజాగా బ్లాక్ క్రాప్డ్ టాప్, లూస్ ఫిట్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

తాజాగా పంచుకున్న ఫొటోలను మీనాక్షి చౌదరి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు. ఆమె నయా లుక్ పై కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మీనాక్షిని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ఇక మీనాక్షి సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’లో హీరోయిన్ గా ఎంపికైందన్న విషయం తెలిసిందే. అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశ్వక్ సేన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ‘మట్కా’ సినిమాలోనూ మీనాక్షినే హీరోయిన్. అలాగే తమిళంలోనూ ఓ చిత్రం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దళపతి నెక్ట్స్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!