కత్తి మహేష్ మృతిలో ట్విస్ట్... విచారణకు వైఎస్ జగన్ జగన్ ప్రభుత్వం ఆదేశం

First Published Jul 14, 2021, 2:13 PM IST

దర్శకుడు, నటుడు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మృతిపై కుటుంబ సభ్యులతో పాటు ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై దర్యాప్తు చేపట్టాలన్న వారి డిమాండ్ పై, ఏపీ ప్రభుత్వం స్పందించడం తో పాటు దర్యాప్తు చేపట్టారు.

జూన్ 26వ తేదీన నెల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు వెనక నుండి ఓ పార్సిల్ వాన్ ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కి తీవ్రగాయాలు కావడంతో నెల్లూరులోని మెడికేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు.
undefined
అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. కత్తి మహేష్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి ఏపీ ప్రభుత్వం రూ. 17లక్షలు విడుదల చేయడం జరిగింది. కత్తి మహేష్ కోలుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
undefined
అయితే జులై 10వ తేదీ ఉదయం కత్తి మహేష్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు తెలియజేశారు. జులై 10వ తేదీన చిత్తూరు జిల్లాలోని కత్తి మహేష్ స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించారు.
undefined
కాగా కత్తి మహేష్ మరణంపై అనుమానాలు ఉన్నట్లు మంద కృష్ణ మాదిగ వ్యక్తం చేశారు. కత్తి మహేష్ ప్రమాదం జరిగిన తీరు, మరణం అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ జడ్జెస్ తో కత్తి మహేష్ మరణంపై విచారణ జరిపించాలని కోరారు.
undefined
ప్రమాదానికి గురైన కారు కుడిభాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ కి ఏమీ కాలేదు. కానీ ఎడమవైపు కూర్చున్న మహేష్ అంత తీవ్ర స్థాయిలో గాయపడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ కి చాలా మంది శత్రువులు ఉన్న తరుణంలో విచారణ జరిపించాలని కోరారు.
undefined
కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ సైతం తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మరణించిన వార్త, తమకు చెప్పకుండా మీడియాకు లీక్ చేశారని అన్నారు. వయసు రీత్యా నేను న్యాయపోరాటం చేయలేని పరిస్థితులలో ఉన్నానని అన్నారు.
undefined
మందకృష్ణ మాదిగ డిమాండ్ మేరకు ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ మృతిపై విచారణకు ఆదేశించింది. కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్ ని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ పై అనేక మార్లు పబ్లిక్ ప్రదేశాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే.
undefined
click me!