విజయ్ ప్రయాణించే జెట్ విమానం స్పెషాలిటీ...
కాగా, తంజావూరు ప్రచారంలో పాల్గొనడానికి టీవీకే నాయకుడు విజయ్ చెన్నై నుండి తిరుచ్చికి ప్రైవేట్ విమానంలో వెళ్లారు. అతను ప్రయాణించిన ప్రైవేట్ విమానం పేరు 'VT-KJR - ఎంబ్రేర్ లెగసీ 650'. ఇది అత్యాధునిక లగ్జరీ ప్రైవేట్ విమానం. ఈ రకమైన విమానం టైటాన్ ఏవియేషన్ ఇండియా కంపెనీకి చెందినది.
సుదూర ప్రయాణాల కోసం రూపొందించిన ప్రత్యేక హెవీ జెట్ విమానం ఇది. ఈ విమానం గంటకు 845 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 41,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఈ ప్రత్యేక విమానం లో విశాల క్యాబిన్ ని స్పెషల్ గా డిజైన్ చేయడం విశేషం.
ఈ జెట్ విమానంలో 13 నుంచి 14 మంది ఒకేసారి ప్రయాణించగలరు. దీనికి 3 ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. భోజన సదుపాయాలు కూడా అందులోనే ఉంటాయి. ఈ విమానాన్ని ఎక్కువగా ముఖ్యమైన వ్యాపారవేత్తలు, వీఐపీలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.