దళపతి విజయ్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వబోతున్నాడు. ఈక్రమంలో విజయ్ కు సబంధించిన ప్రతీ న్యూస్ వైరల్అవుతోంది. ఇక విజయ్ దళపతి గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ గురించి మీకు తెలుసా?
సినిమా నేపథ్యంతో ఇండస్ట్రీలోకి వచ్చినా, ఇప్పుడు రూ.200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌గా విజయ్ ఎదిగాడు. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'వెట్రి' చిత్రంతో బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చాడు.
210
బాలనటుడిగా మెప్పించిన విజయ్
కుటుంబం, నాన్ సిగప్పు మనిదన్, వసంత రాగం వంటి ఎన్నో చిత్రాల్లో విజయ్ బాలనటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత 'నాళైయ తీర్పు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి కూడా ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరే దర్శకుడు.
310
దళపతి విజయ్ కార్ కలెక్షన్
హెచ్. వినోద్ దర్శకత్వంలో తన చివరి సినిమా జననాయగన్ లో నటించాడు విజయ్. ఈసినిమా సెన్సార్ సమస్యల వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చాక విజయ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. దీన్ని తన రాజకీయ ప్రవేశానికి వాడుకుంటారని అంచనాలున్నాయి.
410
విజయ్ గ్యారేజ్ లో కోట్లు విలవ చేసే కార్లు
విజయ్ కోట్ల రూపాయిల ఆస్తి సంపాదించాడు. ఆయనకు కార్లంటే చాలా ఇష్టం. అంతే కాదు దళపతి గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే ఎన్నో కార్లు ఉన్నాయి. ఆయనకు ఇష్టమైన వింటేజ్, బీఎండబ్ల్యూ, మినీ కూపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఏ8 వంటి టాప్ మోడల్ కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.
510
విజయ్ దగ్గరున్న కొత్త కారు ఏది
విజయ్ సంపాదించడం మొదలుపెట్టాక 90వ దశకంలో ఇష్టపడి కొన్న మొదటి కారు టాటా ఎస్టేట్. అప్పట్లో దీని ధర రూ.2.52 లక్షలు. ఈ కారులోనే తన స్నేహితులతో కలిసి చెన్నైలో సరదాగా తిరిగేవాడు.
610
ప్రీమియర్ 118 ఎన్.ఈ.
ఆ తర్వాత విజయ్ ఇష్టపడి కొన్న మరో పాతకాలపు కారు ప్రీమియర్ 118 ఎన్.ఈ. ఈ మోడల్ లాంచ్ అయిన కొన్ని వారాల్లోనే దీన్ని కొన్నాడు. దీని విలువ అప్పట్లో రూ.6 లక్షలు. అలాగే 90లలో ఫేమస్ అయిన టయోటా సెరా కారును కూడా కొన్నాడు. దీని ధర సుమారు రూ.15 లక్షలు.
710
టయోటా ఇన్నోవా క్రిస్టల్
విజయ్ దగ్గరున్న టయోటా ఇన్నోవా క్రిస్టా చాలా ఫేమస్. దీని ధర రూ.20 లక్షల నుంచి రూ.26.05 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు కొన్నాక, కార్లు కొనడం ఆయనకు హాబీగా మారింది. ఇంట్లో కార్ల కోసం లిఫ్టింగ్ మోడల్ పార్కింగ్ కూడా ఉంది. ఆయన వద్ద రూ.8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కూడా ఉంది.
810
ఆడి A8 L మోడల్ కారు
చాలా మంది సెలబ్రిటీల ఫేవరెట్ ఆడి ఏ8 ఎల్ కారు కూడా విజయ్ దగ్గర ఉంది. ఇది ఇండియాలో లాంచ్ అవ్వగానే కొనేశాడు. దీని ధర రూ.1.58 కోట్లు. అలాగే, ఆయన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్ ధర రూ.8.99 కోట్లు.
910
ఎక్స్ 6 (BMW X6)
విజయ్ భార్య సంగీతకు కూడా కార్లంటే ఇష్టమట. ఈ మధ్యే ఆమె విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోట్లులో పిటీషన్ వేశారు. ఇక సంగీతకు బీఎండబ్ల్యూ కార్లంటే పిచ్చి. అందుకే భార్య కోసం బీఎండబ్ల్యూ ఎక్స్6 కారును కొన్నాడు. దీని ధర రూ.1.04 కోట్ల నుంచి రూ.1.11 కోట్ల మధ్య ఉంటుంది. అలాగే, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కారు కూడా ఆయన వద్ద ఉంది. దీని ధర రూ.26 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది.
1010
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు
భార్యకు ఇష్టమైన బ్రాండ్ కావడంతో బీఎండబ్ల్యూ 7-సిరీస్ కారును కూడా విజయ్ కొన్నాడు. చెన్నైలో ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్లినా ఈ కారునే తీసుకెళ్తాడు. వీటితో పాటు, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ కూడా ఆయన గ్యారేజీలో ఉంది. దీని ధర సుమారు రూ.89 లక్షలు.