Yash: భార్య కోరిక నెరవేర్చిన రాకీ భాయ్..

Published : Aug 12, 2026, 04:37 PM IST

Yash: వరుస హిట్ లతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు... కేజీఎఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యశ్. ఇప్పుడు భార్య కోరికలు తీరుస్తూ మంచి భర్త అనిపించుకుంటున్నారు. అందుకు రాధిక పండిత్ ఇచ్చిన ఇంటర్వ్యూనే సాక్ష్యం. ఇంతకీ ఈ కోరికేంటో తెలుసా?

PREV
14
భార్య కోరిక నెరవేర్చిన రాకీ భాయ్

వరుస హిట్ లతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు... కేజీఎఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యశ్. ఇప్పుడు భార్య కోరికలు తీరుస్తూ మంచి భర్త అనిపించుకుంటున్నారు. అందుకు రాధిక పండిత్ ఇచ్చిన ఇంటర్వ్యూనే సాక్ష్యం. ఇంతకీ ఈ కోరికేంటో తెలుసా? 

యశ్, రాధికా పండిత్ కన్నడ ఇండస్ట్రీలో అందమైన జంట. ఈ మధ్య సోషల్ మీడియాలో రాధికా పండిత్ పాత ఇంటర్వ్యూ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె చెప్పిన కోరికలను యశ్ ఇప్పుడు నిజం చేస్తుండటమే దీనికి కారణం.

24
ఇంటర్వ్యూలో రాధిక ఏమన్నారంటే..?

యశ్, రాధికల పెళ్లి సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో, "యశ్‌ను ఎలాంటి పాత్రల్లో మీరు చూడాలనుకుంటున్నారు? అని రాధికను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగారు. దానికి ఆమె ఏం చెప్పారో తెలుసా? యశ్‌కు చారిత్రక (Historic) పాత్రలు చేసే సత్తా ఉంది. అలాంటి పెద్ద పాత్రల్లో, అలాగే డ్యూయెల్ రోల్ ఉన్న సినిమాల్లో ఆయన్ను చూడాలని కోరికగా ఉందన్నారు..రాధికా.

34
ఇప్పుడవే నిజమవుతున్నాయి

రాధిక అప్పుడు అన్న మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయి. యశ్ తన తర్వాతి సినిమా 'రామాయణ'లో 'రావణుడు' పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే 'టాక్సిక్' సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా భార్య రెండు పెద్ద కోరికలను యశ్ ఒకే ఏడాదిలో తీరుస్తుండటంతో…..ఎంత మంచి భర్త అని కామెంట్ చేస్తున్నారు.

44
రాధికా లక్కీ ఛార్మ్..

ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రాధికా పండిత్‌ను యశ్ పాలిట 'లక్కీ చార్మ్' అని పిలుస్తున్నారు. "భర్త, కుటుంబం కోసం రాధిక తన కెరీర్‌ను త్యాగం చేసింది. ఆమెకు మనం థ్యాంక్స్ చెప్పాలి", "భార్య మాట వినే మగాడు జీవితంలో ఎప్పుడూ పైకి వస్తాడు", "ఒకే ఏడాదిలో రాధిక రెండు కలలు నిజమవుతున్నాయి. యశ్ నిజంగా రాకింగ్ స్టార్!" అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories