ఆయన పాటల్లో ఉత్తరాంధ్ర పల్లె సంస్కృతి, రైతు జీవితం, స్థానిక భాషా మాధుర్యం కనిపిస్తాయి. స్టేజ్ ప్రదర్శనలు, జాతరలు, ఫోక్ ఈవెంట్స్‌లో ఆయనకు మంచి ఆదరణ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆయన పాటలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా 15 ఏళ్లకు ముందు రాసిన ఓ పాట ఇప్పటికీ యూట్యూబ్‍లో వైరల్ అవుతూనే ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఫంక్షన్‍లో అయినా ఈ పాట ఉండాల్సిందే.. ఒకసారి ఆ పాట ఏంటో మీరు చూసేయండి.
ఓరి అల్లుడా ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు వచ్చావురా నాయనా ఏ ఊరురా మీది ఓల అత్త నా
ఊరి పేరు చెప్పమంటావా చత్రాపురం, బరంపరం, ఇచ్ఛాపురం సోంపే,ట కంచిలి, మందస, పలాస, కాశీబుగ్గ, శ్రీకాకుళం, వైజాగ్ వెళ్ళిపోను
అత్త పాలకొండ ఒడ్డు నుంచి పందిలా పరిగెట్టుకొని వచ్చేశానే..ఓరి అల్లుడా ఏన్నాళ్ళకి వచ్చావు గాని రాక రాక వచ్చినావు బాగున్నావటరా అల్లుడా ఆ ఏం బాగు
అత్త నీ కంటి చూపు నా కర్ర చూపు నాదొక బాగేనా..
ఓరే అల్లుడు మాటలు మాత్రం చాలా బాగా ఆడతావు కానీ లెక్కలు గిక్కలు అన్ని
బాగున్నాయటరా అత్త అత్త లెక్క అంటే గుర్తొచ్చిందే అత్త మరేమో చొక్క మీద ఒక చొక్క రూపాయి పావుల లెక్క ఇంటికి వెళ్తే
ఇంత బొక్క వెనకాల వస్తే కుక్క నీతోనే ఏమిటి చెప్పనే తొక్క ఓరి అల్లుడు సరే గాని ఇన్నాళ్ళకి వచ్చావు గాని ఏం వండమంటావురా
అల్లుడు ఓ అత్త నీ చేయితోని పురుగుల మందైనా ఇంటరింగ్ అయినా ఎలకల మందైనా ఏదైనా నాకు ఇష్టం ఇచ్చినా సరే నాకు అమృతం లాగేనే
సరే గాని అల్లుడు నాలకు వచ్చావు నేను చెప్తాను వినరా అల్లుడు అల్లుడా గారి లొండాలో అల్లుడా బూరిలొండాలా నీకు గారె లొండలో అల్లుడా బూరెలొండాలా అల్లుడా గారి లొండలో అల్లుడా బోరి లొండలాని గారిలో
అల్లుడా బూరెలొండాలా ...బూరి అయితే బుల బుల మంటాయి గారెలొండత్తా...నా మీద ఎంత ప్రేమత్తా...
మిగతా పాట ఈ కింద వినండి..