Movies in Ott Now : ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలు చూశారా? ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రభాస్ ‘సలార్’ తోపాటు ఆయా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రాలను ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసుకుందాం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas - ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ Salaar Cease Fire మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి చేరింది. జనవరి 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

టాలీవుడ్ హీరో నితిన్ Nithiin - యంగ్ సెన్సేషన్ శ్రీలీల Sreeleela జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 8న విడుదలైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
 


టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్,  సంయుక్త మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన సినిమా ‘డెవిల్’ Devil.  అభిషేక్ నామా డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ Atharva మూవీ గత డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ వేదికన జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 
 

తెలుగు డబ్బింగ్ మూవీ రొమాంటిక్ డ్రామా జో (Joe)  కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచి ప్రేమకథగా అలరిస్తోంది. ఈ చిత్రం జనవరి 15 నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

తెలుగు రొమాంటిక్ ఫిల్మ్ ‘మాయ లో’ Mayalo చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం జనవరి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. 

Latest Videos

click me!