Brahmamudi
BrahmaMudi 22nd January Episode:కిచెన్ లో ధాన్యలక్ష్మి వంట చేస్తూ ఉంటుంది. అనామిక వెంటనే రుద్రాణిని అక్కడకు పంపుతుంది. రుద్రాణి వెళ్లి.. ధాన్యలక్ష్మిని ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. కనపడట్లేదా కిచెన్ లో పని చేసుకుంటన్నాను అని చెబుతుంది. కావ్య ఉంది కదా ఈ పనులు చేయడానికి అని రుద్రాణి అడిగితే.. ప్రతి విషయంలోనూ కావ్యపై ఆధారపడలేను అని చెబుతుంది. దానికి రుద్రాణి.. కళ్యాణ్ విషయంలో జాగ్రత్తపడకపోయినా.. కనీసం కావ్య విషయంలో అర్థం చేసుకున్నావ్ లే అంటుంది. కళ్యాణ్ విషయం ఏంటి అని ధాన్యలక్ష్మి అంటే.. కళ్యాణ్ ఆఫీసు పని చేయడం లేదని, ఇంట్లో కూర్చొని పిచ్చి కవితలు రాసుకుంటున్నాడని అంటుంది. అందులో తప్పేముందని ధాన్యం అడిగితే.. నీ కోడలు ఫీలౌతుందని రుద్రాణి అంటుంది. కానీ, నా కోడలు బంగారం..అలాంటి వాటికి ఫీలవ్వదు.. నువ్వు మా మాధ్య గొడవ పెట్టకు అని ధాన్యం అంటుంది. కానీ.. రుద్రాణి మాత్రం.. గొడవ కళ్యాణ్, అనామిక ల మధ్య జరగకుండా చూసుకోమని చెబుతున్నాను అని.. ధాన్యం బుర్రలో ఎక్కించాల్సినది ఎక్కించి వెళ్తుంది.
Brahmamudi
మళ్లీ వెళ్లి.. అనామికతో మాట్లాడుతుంది. ఏమంటోంది మా అత్త అని అనామిక అడుగుతుంది. ఇప్పుడు బుర్రలో నాటానని.. అది పెద్దగా మారుతుందని రుద్రాణి సంబరపడుతుంది. కానీ.. అనామిక అది పెరగదని.. మనమే పెంచాలని.. దాని కోసం మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని రుద్రాణి తో చెబుతుంది. దానికి నేను ఉన్నానని. కళ్యాణ్ కి రాజ్ తో సమానమైన హక్కువ వచ్చే వరకు నీకు నేను తోడుగా ఉంటాను అని అనామికను నమ్మిస్తుంది.
Brahmamudi
అది విని అనామిక.. మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారని ఆనందపడుతుంది. కానీ రుద్రాణి.. నేను నీకు హెల్ప్ చేయడం కాదని, నిన్ను అడ్డంపెట్టుకొని రాహుల్ కి ఆస్తి వచ్చేలా చేస్తాను అని అనుకుంటుంది.
Brahmamudi
ఇక..రాజ్ ఆఫీసుకు వెళ్తుంటే.. శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంది. దీంతో..రాజ్ హడావిడిగా బయలుదేరతాడు. కావ్య కాఫీ ఇచ్చినా తసుకోకుండా, ఆఫీసుకు వెళ్లాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కావ్య ఫీలౌతుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే... మూర్తికి ఏదో బొమ్మల కాంట్రాక్ట్ ఇస్తారు. కానీ.. అప్పూకి యాక్సిడెంట్ కావడంతో ఆ పనిని పక్కన పెట్టేస్తాడు. దీంతో.. ఆ పని ఇచ్చిన వాళ్లు వచ్చి.. దానిపై ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ.. తనకు జరిగిన దాని గురించి మూర్తి వాళ్లకు వివరిస్తాడు. వెంటనే మొదలుపెడతాను అని చెబుతాడు. సరే అని అతను వెళ్లిపోతాడు. అతను వెళ్లి తర్వాత.. కనకం.. వెంటనే పని మొదలుపెట్టొచ్చు కదా.. ఎందుకు ఆలస్యం చేస్తావ్ అని అడుగుతుంది.
తెలిసినా పని అయినా చేయలేకపోతున్నానని మూర్తి అంటాడు. వయసు మీద పడటం వల్ల కావచ్చేమో అని అఅంటాడు. గతంలో కావ్య తనకు ఒక భుజంలా ఉండి.. సహాయం చేసేదని.. కానీ, ఇప్పుడు కావ్య వెళ్లిపోవడంతో మరింత కష్టంగా ఉందని అంటాడు. అయితే.. ఇది.. వయసు వల్ల వచ్చిన సమస్య కాదని.. అవమానాలు, సమస్యల వల్ల వచ్చిన సమస్య అని.. అన్ని మర్చిపోయి పని మొదలుపెట్టమని రాజ్యలక్ష్మి సలహా ఇస్తుంది.
Brahmamudi
మరోవైపు కావ్య... రాజ్ తనను మోసం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. కళ్లు తిరిగి కిందపడబోతుంటే.. స్వప్న చూసి కూర్చోపెడుతుంది. కావ్య వద్దు అన్నా హాస్పిటల్ కి వెళ్లాల్సిందే అని స్వప్న పట్టుపడుతుంది. రాజ్ కి ఫోన్ చేయమని ఇందిరాదేవి కూడా అంటుంది. బలవంతం చేయడంతో రాజ్ కి కావ్య ఫోన్ చేస్తుంది. కానీ.. అప్పటికే రాజ్.. శ్వేతకు ఏమైందో అనే కంగారులో ఉంటాడు. కావ్య ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చిరాకుపడి ఫోన్ కట్ చేస్తాడు.
Brahmamudi
అయితే, రాజ్ బిజీగా ఉన్నాడని కావ్య అనడంతో.. స్వప్న తానే హాస్పిటల్ కి తీసుకొని వెళతాను అనిచెప్పి , తీసుకొని వెళ్తుంది. మరోవైపు రాజ్ వెళ్లేసరికి.. శ్వేత చేతికి గాయంతో పడి పోయి ఉంటుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళుతూ ఉంటాడు. దారిలో.. శ్వేతో రాజ్ మాట్లాడుతూ, స్పృహ పోకుండా చేస్తూ ఉంటాడు. ఇటు.. స్వప్న. కూడా..కావ్య కాపురం గురించి చాలా మంచిగా మాట్లాడుతుంది. మీ కాపురం బాగానే ఉందా.. రాజ్ లాంటి మంచి భర్త నీకు దొరికాడు అని కావ్య తో స్వప్న చాలా ప్రేమగా మాట్లాడుతుంది. కానీ..కావ్య.. తన బాధను పైకి చెప్పకుండా లోలోపల బాధపడుతోంది. రాజ్ తన నుంచి విడిపోవాలని అనుకుంటున్నాడని, ఏ గొడవలు లేకుండా విడిపోయే భార్యభర్తలం మేమే అని కావ్య మనసులో అనుకుంటుంది.
తర్వాత కావ్యను స్వప్న డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ లోబీపీ ఉందని.. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతుంది. కావ్య తనకు ఏ సమస్యలేదని చెబుతుంది. కానీ... స్వప్న మాత్రం.. అత్తారింట్లో చాకిరీ చేసి, వాళ్లను మేపి.. వాళ్లు అనే మాటలు పడి ఇలా అయిపోయిందని.. టైమ్ కి తిండి, నిద్ర ఉండవని డాక్టర్ కి చెబుతుంది. దీంతో.. డాక్టర్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడతానని.. కానీ.. మంచి ఆహారం, రెస్ట్ అవసరం అని చెబుతుంది.
Brahmamudi
వీళ్లు బ్లడ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలోనే రాజ్.. శ్వేతను మోసుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. అది కావ్య కంట పడుతుంది. అది చూసి కావ్య మరింత బాధపడుతుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. రాజ్.. శ్వేత పక్కనే ఉండి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. అతను మీకు ఏమౌతాడు అంటే.. తన ఫియాన్సీ అని శ్వేత చెబుతుంది. ఏదో యాక్సిడెంట్ వల్ల జరిగిందని చెబుతుంది. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత.. ఫియాన్సీ అని చెప్పకపోతే పోలీసు కేసు అవుతుందని అలా చెప్పాను అని అంటుంది. మరోవైపు కావ్య.. రాజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
Brahmamudi
ఈ లోగా.. స్వప్న రిపోర్ట్స్ కోసం పక్కకు వెళ్తుంది. ఇదే కరెక్ట్ సమయం అని. రాజ్ దగ్గరకు స్వప్న వెళ్తుంది. ఈ లోగా.. శ్వేత గురించి ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్.. శ్వేతకు కాబోయే మొగుడు అని వాళ్లు మాట్లాడుకోవడం విని కావ్య కుప్పకూలిపోతుంది. కమింగ్ అప్ లో కావ్యను ఒంట్లో బాలేదని రాజ్ కి తెలుస్తుంది. వెంటనే వెళ్లి.. పక్కన కూర్చుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.