Naga panchami
Naga Panchami 22nd January Episode: పంచమి రూపంలో నాగలోకానికి వెళ్లిన కరాళి.. నాగమణిని సాధించలేకపోతుంది. కనీసం తాకలేకపోతుంది. దీంతో.. నాగ చంద్ర కాంత మొక్కతో తిరిగి వస్తుంది. అయితే.. కాళీ మాత ఆమెకు ప్రత్యక్షమై.. ఈ మొక్కతో మీ అన్నను బతికించలేవు అని చెబుతుంది. అంతే కాదు.. నాగలోకానికి వెళ్లి.. నీ శక్తులన్నీ పోగొట్టుకున్నావ్ అని కూడా చెబుతుంది. మళ్లీ శక్తులు రావాలంటే.. మోక్షలాంటి బ్రహ్మచారిని బలి ఇవ్వమని అడుగుతుంది. అలా బలి ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నాను అని అనుకుంటుంది. అలా బలి ఇవ్వాలి అనుకుంటే.. ముందు బతికించాలి అని అనుకుంటుంది. వెంటనే.. తనకు పాత రూపం ఇవ్వమని అడగగానే మాత ఇచ్చేస్తోంది. మేఘన గా మారిపోతుంది.
Naga panchami
వెంటనే.. తన దగ్గర ఉన్న నాగ చంద్ర కాంత మొక్కతో మోక్షను కాపాడుతుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. వెంటనే పంచమి పక్కకు వెళ్లిపోతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా మోక్షను కాపాడాడు అని చాలా సంబరపడుతుంది. అప్పుడే ఫణీంద్ర అక్కడకు వచ్చి.. అసలు.. మేఘన ఎలా కాపాడిందో తనకు అర్థం కావడం లేదు అని చెబుతాడు. అయితే.. పంచమి అవన్నీ పట్టించుకోదు. సుబ్రహ్మణ్య స్వామి కాపాడాడు అని అంటుంది. ఫణీంద్ర.. ఎంత చెప్పినా పంచమి వినిపించుకోదు.
Naga panchami
తర్వాత.. మోక్ష బతికాడు కదా.. ఇకం నువ్వు.. నాగలోకానికి రావాలి అని అడుగుతాడు. మోక్షను ఒప్పించి వస్తాను అని పంచమి అంటుంది. అయితే.. మోక్ష అంగీకరించడదని.. అది కుదరని పని అని ఫణీంద్ర అంటాడు. దీంతో.. మోక్ష బతికాడు కాబట్టి.. తనకు అది చాలని, నాగలోకానికి రావడానికి రెడీ అవుతుంది. నాగమాతకు నమస్కరించుకొని పాముగా మారమని ఫణీంద్ర చెబుతాడు. పంచమి చెయ్యబోతుండగా.. డైరెక్ట్ గా నాగమత ప్రత్యక్షమౌతుంది.
Naga panchami
వీరిద్దరూ నాగలోకానికి రావడానికి సిద్దమయ్యాము అనిచెప్పినా నాగమాత వినిపించుకోదు. కరాళి నాగలోకానికి రావడం నాగ కన్య చూసి.. అది నాగ దేవతకు చెబుతుంది. నిజంగానే పంచమి.. దొంగతనంగా వచ్చి.. నాగకాంత మొక్కను తీసుకువెళ్లిందని నాగ దేవత భ్రమపడుతుంది. ఫణీంద్ర, పంచమి ఎంత చెప్పినా వినిపించుకోదు. మోసం చేయడానికి ప్రయత్నించినందుకు.. మీకు మరణ శిక్ష వేయాలి. కానీ.. మీరు యువరాజు, యువరాణి కాబట్టి... శిక్ష తగ్గిస్తున్నాను అని చెబుతుంది. ఇష్టరూప శక్తులను మొత్తం లాగేసుకొని, పౌర్ణమి రోజు మాత్రం పాము గా మారతారని, మానవుల చేతిలో చనిపోతారు అని శిక్ష విధిస్తుంది.
Naga panchami
దీంతో.. ఫణీంద్ర, పంచమి బాగా బాధపడతారు. ఇదంతా ఎవరో చేసిన మోసం అని.. వీరిద్దరికీ అర్థమౌతుంది. అయితే.. ఆ మోసం చేసింది మేఘన అని ఫణీంద్ర అనుమానిస్తాడు. కానీ.. మోక్ష ప్రాణాలు కాపాడిందని పంచమి అనుమానించదు. ఫణీంద్ర మేఘనను నమ్మకుండా.. దూరంగా తీసుకువచ్చి.. తనను అడగాల్సిన విధంగా అడుగుతాడు. కానీ.. మేఘన కనపడుతున్న కరాళి మాత్రం.. ఏడుస్తూ.. తనకు ఏ పాపం తెలీదని నాటకం ఆడుతుంది. పంచమి నమ్మేస్తుంది.
వాళ్ల నుంచి దూరంగా వెళ్లి తర్వాత.. మేఘన.. ఎలాగైనా నీకు మోక్షను దూరం చేస్తాను అని పంతం పడుతుంది. మోక్షను బలి ఇచ్చి.. తన శక్తులు తాను సంపాదించుకోవాలి అనుకుంటుంది. పంచమి.. తన శక్తులు పోయినందుకు బాధపడకపోగా.. మోక్ష బతికినందుకు చాలా సంతోషిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం...