అర్థరాత్రి అమ్మాయిలకు సుడిగాలి సుధీర్ వీడియో కాల్స్, చూపించమంటూ వేధింపులు... ఛీ, ఇంత ప్లే బాయ్ నా!

Published : Jan 12, 2024, 10:57 AM IST

సుడిగాలి సుధీర్ రాత్రి అయితే చేసే పనులు కొందరు అమ్మాయిలు బయటపెట్టారు. పరిశ్రమలో ఉన్న అమ్మాయిలకు సుధీర్ వీడియో కాల్స్ చేయడమే కాకుండా అమ్మ వస్తుంది అంటే చూపించు అంటున్నాడట.   

PREV
17
అర్థరాత్రి అమ్మాయిలకు సుడిగాలి సుధీర్ వీడియో కాల్స్, చూపించమంటూ వేధింపులు... ఛీ, ఇంత ప్లే బాయ్ నా!
Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ కి ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. మనోడు శృంగార పురుషుడు అట. నచ్చిన అమ్మాయిని వశం చేసుకునేవరకు వదలడట. బుల్లితెర మన్మధుడిగా సుధీర్ పేరుగాంచాడు. 
 

27
Sudigali Sudheer

రాత్రి అయ్యాక మనోడు చేసే పనులు బుల్లితెర ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు బయటపెట్టాడు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 'అల్లుడా మజాకా' అనే స్పెషల్ షో రూపొందించారు. ఈ షోకి వెంకటేష్, మీనా, కుష్బూ అతిథులుగా హాజరయ్యారు. 
 

37
Sudigali Sudheer

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, నాగినీడు, రామ్ ప్రసాద్ తో పాటు బుల్లితెర నటులు, కమెడియన్స్, డాన్సర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మీ అబ్బాయి మనోడు కాదు, ఇప్పుడే నిరూపిస్తా అని... సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి నాగినీడుతో హైపర్ ఆది అన్నాడు. సరే నిరూపించు అని నాగినీడు అన్నారు.

47
Sudigali Sudheer

వేదిక మీదకు కొందరు అమ్మాయిలను పిలిచి సుడిగాలి సుధీర్ ఎలాంటి వాడో చెప్పాలని హైపర్ ఆది అడిగాడు. ఒక అమ్మాయి.. సుధీర్ నా పత్తి, అన్నది. ఆమె అర్థం పతి అనగా భర్త కాబోలు. తెలుగు అమ్మాయి కాకపోవడంతో పదాలు పలకడం రాలేదు. 
 

57
Sudigali Sudheer

మరో అమ్మాయి మాట్లాడుతూ... రాత్రి పూట సుధీర్ వీడియో కాల్ చేస్తాడు. అమ్మ వస్తుంది ఫోన్ పెట్టేయ్ అంటే, అమ్మని కూడా చూపించు, చూస్తాను అంటాడు, అన్నది. దాంతో అందరూ షాక్ అయ్యారు. నోటి మీద చేతులు వేసుకున్నారు. 
 

67
Sudigali Sudheer

అనంతరం రష్మీ గౌతమ్ ని సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకున్న ఫోటో చూపించాడు హైపర్ ఆది. అది మార్ఫింగ్ అని నాగినీడు అన్నాడు. అయితే ఈ వీడియో చూడమని ప్లే చేశాడు. ఆ వీడియోలో సుధీర్ 'నేను ఛస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా' అని సుధీర్ డైలాగ్ చెప్పాడు.

77
Sudigali Sudheer

అయితే సుడిగాలి సుధీర్ పై ఆరోపణలు, ప్లే బాయ్ వేషాలు అన్నీ స్కిట్ లో భాగమే. నిజ జీవితంలో సుడిగాలి సుధీర్ కి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇన్నేళ్ల కెరీర్లో అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవు. అల్లుడా మజాకా వేదికపై రాధికా సాంగ్ కి సుధీర్ ఇరగదీశాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories