Naga panchami 12th January Episode:మోక్షను కాటేసి నాగలోకానికి వెళ్లిపోయిన పంచమి.. మళ్లీ తిరిగొచ్చేనా?

First Published Jan 12, 2024, 10:52 AM IST

జ్వాల కూడా.. మోక్ష చావడం ఖాయం అంటుంది. అయితే.. ఆస్తి రెండు భాగాలే అవుతుంది చిత్ర సంతోషపడుతుంది. అయితే.. ఎక్కువ వాటా మాత్రం తనదే అని జ్వాల అంటే.. భయంతో చిత్ర సరే అని అంటుంది.

Naga panchami

Naga panchami 12th January Episode: ఏదైతే అది జరిగిందని, పంచమి, మోక్షలు ఫణీంద్ర చెప్పిన దానికి ఒకే చెబుతారు. ఫణీంద్ర చెప్పినట్లే.. మోక్షను కాటేసి పంచమి నాగలోకానికి వెళ్తుందా..? ఇక్కడ మోక్షను ఎవరు కాపాడతారు అనే విషయాలు తెలుసుకోవడానికి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

Naga panchami


మరోసారి జ్వాల, పంచమి ఇంట్లో రచ్చ చేస్తూ ఉంటారు. పంచమి పామేనని.. మోక్షను బతికనివ్వదు అని అంటారు.  మోక్ష నాగ గండానికీ, పంచమికి ఏదో సంబంధం ఉందని  జ్వాల అంటుంది. అయితే... అది మనిషో, పామో మనకు అనవసరం అని, పంచమి మాత్రం మళ్లీ ఇంట్లో అడుగుపెట్టకూడదని వైదేహి అంటుంది. ఎక్కడ ఉన్నా.. పంచమి, మోక్షలను పట్టుకొని.. మోక్షను ఇంటికి తెచ్చుకుందాం అంటుంది. రెండు రోజుల్లో వస్తాం అని మోక్ష చెప్పాడు కాబట్టి.. రేపటి వరకు ఎదురు చూద్దాం అని  మోక్ష తండ్రి అంటాడు.

Latest Videos


Naga panchami

చిత్ర మాత్రం.. మోక్ష తిరిగి రాడని.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు అర్థం కావడం లేదు అని అంటుంది.  జ్వాల కూడా.. మోక్ష చావడం ఖాయం అంటుంది. అయితే.. ఆస్తి రెండు భాగాలే అవుతుంది చిత్ర సంతోషపడుతుంది. అయితే.. ఎక్కువ వాటా మాత్రం తనదే అని జ్వాల అంటే.. భయంతో చిత్ర సరే అని అంటుంది.

Naga panchami

మరోవైపు పంచమి, మోక్షలు నాగులవరం చేరుకుంటూ ఉంటారు. మధ్యలో నాగ సాధువులు పూజలు చేస్తూ కనపడతారు. వాళ్లదగ్గరే పంచమి చెప్పిన స్వామి కూడా ఉంటారు. ఆయన వద్దకు వెళ్లి నమస్కారం చేస్తారు. ఆయన పక్కకు వచ్చి.. మోక్ష, పంచమిలతో మాట్లాడతారు. దంపతులు ఇద్దరూ కలిసి వచ్చారంటే.. ఏదో కార్యం మొదలుపెట్టే ఉంటారని.. మీ శ్రేయోభిలాషిలా మీకు మంచి చేసే సలహా ఇస్తానని, సమస్య ఏంటో చెప్పమంటాడు. ఇక.. పంచమి.. ఓ కఠినమైన విష పరీక్షకు సిద్ధపడ్డామని.. మీ సహాయం కావాలని అడుగుతుంది.

ఒక నాగకన్యకు సహాయం చేసి.. నాగ సాధువుగా నా జన్మను సార్థకం చేసుకుంటానని.. ఏంటో చెప్పమని ఆ స్వామిజీ అంటాడు. దానికి మోక్ష.. తన జాతకంలో ఉన్న  నాగ గండం సమయం దగ్గరకు వచ్చిందని, తాను తప్పించుకునే  అవకాశం కానీ, తనకు తన ప్రాణం మీద ఆసక్తి కానీ ఏమీ లేవు అని మోక్ష చెబుతాడు. అందుకే.. తాను చనిపోయినా, పంచమి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను  అని మోక్ష వివరిస్తాడు.

Naga panchami

‘మహా మృత్యుంజేయ యాగం ద్వారా.. పోయినసారి ప్రాణాల నుంచి  బయటపడ్డారు కాచుకున్న శ్రతువు నుంచి తప్పించుకోవడం అన్ని వేళలా కుదరదు’ అని స్వామిజీ అంటాడు. అయితే.. ఈ గండం నుంచి బయటపడే అవకాశం వచ్చిందని.. నాగలోక యువరాజు ఫణీంద్ర ఓ సలహా ఇచ్చాడని పంచమి చెబుతుంది. నాగదేవత ఆజ్నతో మోక్ష బాబును కాటేయాలని వచ్చిన ఫణీంద్ర.. నేను వేడుకోవడంతో నా భర్తకు ప్రాణం పోయడానికి సహాయం చేస్తానని  ఒప్పుకున్నాడని చెబుతుంది. తాను పాముగా మారి మోక్షబాబును కాటేస్తే.. అతనితో నాగలోకానికి వెళ్లి, నాగమణిని తెచ్చి నా భర్తను కాపాడుకోవచ్చు అని ఫణీంద్ర నమ్మకంగా చెబుతున్నాడు స్వామి అని.. తమ డీల్ మొత్తం స్వామిజీకి పంచమి వివరిస్తుంది.

కానీ.. నాగమణి తేవడం అంత సులభం కాదని స్వామిజీ షాకిస్తాడు. నాగమణితో చనిపోయిన వాళ్లను బతికించవచ్చని, ఆ నాణెం మీద తనకు ఎలాంటి అనుమానాలు లేవని.. కానీ, నాగలోకం నుంచి నాగమణి తీసుకురావడం అసంభవం అని స్వామిజీ చెబుతాడు. నాగమణి చాలా శక్తివంతమైనది, నాగలోకం మొత్తానికి శక్తిని అందిస్తుందని, కానీ దానిని అంత సులభంగా తీసుకురాలేం అని స్వామిజీ చెబుతాడు. ఫణీంద్ర చాలా నమ్మకంగా చెబుతున్నాడని పంచమి అంటుంది.

Naga panchami

అయితే.. నిజంగా ఫణీంద్ర మీకు సహాయం చేయాలి అనుకుంటే..నాగలోకంలో లభించే.. నాగ చంద్ర కాంత మొక్కను తీసుకువచ్చినా చాలు అని, ఇష్టరూప జాతి శాపానికి అది విరుగుడు అని స్వామిజీ చెబుతాడు. అది కూడా తాము చర్చించామని... ఆ మొక్కతో చనిపోయిన వాళ్లను బతికించలేం అని అన్నారు అని పంచమి చెబుతుంది. దానికి స్వామిజీ.. నిజమే కానీ.. విషం తలకు ఎక్కకుండా.. మూలికలతో కొంత వరకు కాపాడుకోవచ్చని, ఆలోగా ఆ మొక్కను తీసుకురాగలిగితే చాలు, నాగమణిని తేవడం కంటే.. నాగ కాంత మొక్కను తేవడం సులభం అని.. స్వామిజీ పంచమి కి సలహా ఇచ్చి.. యాగం చేయడానికి వెళ్లిపోతాడు.

Naga panchami

మరోవైపు ఫణీంద్రకు నాగదేవత ప్రత్యక్షమౌతుంది.  ఇచ్చిన మాట తప్పావని, కార్యం పూర్తి చేసుకొని యువరాణితో నిన్న రాత్రే నాగలోకానికి రాలేదని తిడుతుంది. కనీసం కారణం చెప్పడానికి కూడా నాగలోకానికి రాలేదని.. నిన్ను వెతిక్కుంటూ నాకు రావాల్సి వచ్చిందని నాగదేవత అంటుంది. అయితే.. చివరి వరకు..వచ్చాక కొన్ని అడ్డంకులు  రావడంతో ఆగిపోయిందని చెబుతాడు. కానీ.. ఫలితం రాలేదని నాగ దేవత సీరియస్ అవుతుంది

Naga panchami

యువరాణి రావడం ఆలస్యం అయితే.. తనకు ఇచ్చిన శక్తులు వెనక్కి తీసుకుంటాను అని నాగదేవత అంటుంది.. కానీ.. ఈ ఒక్కరోజు రాత్రి కి పని పూర్తి చేస్తానని ఫణీంద్ర అంటాడు. అది జరగకుంటే.. యువరాణి శక్తులు తీసేసుకుంటానని, నీకు కూడా శిక్ష తప్పదు అని నాగదేవత మరోసారి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది.  అయితే.. ఈ రోజు రాత్రికి తాను పని పూర్తి చేయకుంటే.. తనకు మరణ శిక్ష వేయమని ఫణీంద్ర  అంటాడు. సరేనని.. నాగదేవత వెళ్లిపోతుంది.

Naga panchami


మరోవైపు.. మోక్షను కాటువేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.  ఫనీంద్ర, పంచమి, స్వామిజీ, మెక్ష కూడా అక్కడే ఉంటారు.  మోక్ష కింద పడుకుంటే.. త్వరగా పనికానివ్వమని పంచమని ఫణీంద్ర ఒత్తిడి చేస్తాడు. మేఘన సైతం మోక్షను తాము కాపాడతామని ఆలస్యం చేయద్దని చెబుతుంది. వెంటనే.. పంచమి.. తన భర్తకు ఏమీ కాకుండా చూడు స్వామి అని వేడుకొని.. పాముగా మారిపోతుంది. వెంటనే.. మోక్షను కాటు వేస్తుంది. ఆ నొప్పితో మోక్ష విలవిలలాడుతూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి ఫణీంద్ర, మేఘన సంతోషిస్తారు. తర్వాత.. పంచమి మళ్లీ.. మనిషిగా మారి..  మోక్ష కోసం ఏడుస్తుంది.

ఆలస్యం చేయకుండా.. నాగలోకాణికి వెళ్లమని స్వామిజీ, మేఘన చెబుతారు.  ఫణీంద్ర పంచమిని పాముగా మారమని అడుగుతాడు.  పాముగా మారిన తర్వాత.. ఫణీంద్రతో కలిసి పంచమి నాగలోకం బయలు దేరుతుంది. మోక్ష నొప్పితో  ఏడుస్తూ ఉంటే.. స్వామిజీ.. పాము విషయం తలకు చేరకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు మేఘన.. పంచమి నాగమణి తేగానే.. దానిని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి.. పంచమి మళ్లీ భూలోకానికి రాగలదా..? మోక్షను కాపాడగలదా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

click me!