కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యో కుట్రను తిప్పికొట్టిన దీప- అమ్మానాన్నలతో కలిసి హోమం పూర్తి

Published : Nov 21, 2025, 07:56 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 21వ తేదీ)లో జ్యోతో కావేరి కాళ్లకు పసుపు రాయిస్తుంది సుమిత్ర. శ్రీధర్ ని క్షమించలేవా అని కాంచనను అడుగుతాడు శివన్నారాయణ. ఈ ఇంటికి జరగాల్సిన నష్టం జరిగేలా చేస్తా అంటుంది జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో జ్యోత్స్నతో కావేరి కాళ్లకు పసుపు రాయిస్తుంది సుమిత్ర. మిగిలిన వాళ్లకు నేను రాస్తానులే అని పసుపు గిన్నె తీసుకుంటుంది దీప. మీకు రాస్తాను రా అమ్మ అని సుమిత్రను పిలుస్తుంది. సుమిత్ర కాళ్లకు పసుపు రాస్తూ ఎమోషనల్ అవుతుంది దీప. 

అన్నీ మర్చిపోయి ఇంట్లోకి రా చిన్నమ్మ. అందరం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్నవి జరుగుతూనే ఉంటాయి అంటాడు కార్తీక్. ఏదైనా అంటే అన్నయ్యతో చెప్పాలి కానీ.. అమ్మను తీసుకొని ఏడ్చుకుంటూ వెళ్లిపోకూడదు అని స్వప్నతో చెప్పి లోపలికి వెళ్తాడు కార్తీక్.

26
శ్రీధర్ ని క్షమించలేను అన్న కాంచన

అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని కూతురితో చెప్తాడు శివన్నారాయణ. చెప్పు నాన్న అంటుంది కాంచన. వీరిద్దరి మాటలను చాటుగా వింటుంటారు శ్రీధర్, కార్తీక్. శ్రీధర్ ని క్షమించలేవా అమ్మా అంటాడు శివన్నారాయణ. తను తప్పు చేశాడు. తప్పును తెలుసుకున్నాడు. మారాడు. మనం అందరం కావాలని, కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు తనని క్షమించలేవా అంటాడు శివన్నారాయణ. 

క్షమించలేను నాన్న అంటుంది కాంచన. తప్పు చేశాడని ఆ రోజు నేను తనని కొట్టాను. ఇప్పుడు మారాడని దగ్గరకు తీశాను. నువ్వు నాలా చేయలేవా అంటాడు శివన్నారాయణ. చేయలేను నాన్న. అల్లుడు మోసం చేసిన దానికి, భర్త మోసం చేసిన దానికి చాలా తేడా ఉంది అని ఏడుస్తుంది కాంచన.

నాకోసం తనని క్షమించలేవా అమ్మా అంటాడు శివన్నారాయణ. క్షమిస్తాను కానీ.. భర్తగా దగ్గరకు తీసుకోలేను అంటుంది కాంచన. నేను తనని భర్తగా ఎప్పుడు క్షమిస్తానో తెలుసా నాన్న అంటుంది కాంచన. ఇంతలో దాసు వచ్చి వారిని పలకరిస్తాడు. దాసు రావడం 2 నిమిషాలు ఆలస్యమైతే కాంచన మనసులో ఏముందో తెలిసిపోయేది అని మనసులో అనుకుంటారు శివన్నారాయణ, శ్రీధర్.

36
అవమానంతో రగిలిపోయిన జ్యోత్స్న

కిందికి వెళ్దాం రా అని జ్యోత్స్నను పిలుస్తుంది పారు. ఎందుకు పనికిరాని ఆ కావేరి కాళ్లకు నాతో పసుపు రాయిస్తారా అని అవమానంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఆ దీప, స్వప్నలను చూశావా.. గెలిచామనే గర్వంతో చూశారు అంటుంది. శత్రువులు బలం పెంచుకున్నప్పుడు మనం భయపడకూడదు. కిందికి వెళ్దాం రా అంటుంది పారు. ఏదో ఒకటి చేయాలి. ఈ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి అని పారుతో కలిసి కిందికి వెళ్తుంది జ్యోత్స్న.

దాసును చూసి నీ కొడుకు వచ్చాడు గ్రానీ. వెళ్లి మాట్లాడు అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. దాసుకు దగ్గరికి వెళ్లిన పారు.. ఎక్కడ తిరుగుతున్నావురా రోజు అంటుంది. మళ్లీ వారసురాలిని వెతకడానికే వెళ్లావా? అని అడుగుతుంది. అవును అంటాడు దాసు. ఎక్కడో ఉన్న దానికోసం నీ కూతురి అదృష్టాన్ని దూరం చేయకురా అంటుంది పారు. విధిని ఎవరు తప్పించలేరు అంటాడు దాసు.

46
పూర్ణాహుతి కిందపడితే విపత్తు తప్పదు

ఇంతలో గురువు గారు వచ్చి.. సుమిత్ర, దశరథలతో హోమం జరిపిస్తారు. హోమం పూర్తయింది. పూర్ణాహుతిని తీసుకొని మీ దంపతులిద్దరూ, మీ కూతురితో కలిసి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరగా పూర్ణాహుతిని వారసురాలి చేతుల మీదుగా హోమంలో వేయాలి. పొరపాటున పూర్ణాహుతి కిందపడిందో వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి మీ శక్తి సరిపోదు అంటాడు గురువు. ఆ మాటవిన్న దాసు జ్యోత్స్న పూర్ణాహుతి హోమంలో వేస్తే ఈ ఇంటికి మంచిది కాదని ఆలోచించి.. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని ముందుకు వస్తాడు. గమనించిన జ్యోత్స్న. పారును పిలిచి దాసును బయటకు తీసుకెళ్లమని చెప్తుంది.

56
నిజం చెప్తేస్తాను అన్న దాసు

ఎక్కడికి రా వెళ్తున్నావు అంటుంది పారు. జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు. పూర్ణాహుతిని జ్యోత్న్స హోమంలో వేస్తే అన్నయ్య కుటుంబానికి మంచి జరగదు అంటాడు దాసు. ఎవరు ఎలా పోతే నీకెందుకురా.. నీ కూతురికి ఏం కాదు కదా అంటుంది పారు. దశరథ అన్నయ్య కూతురిని దూరం చేసి వాళ్లకు చేయాల్సిన అన్యాయం చేశావు. ఆ కుటుంబానికి మంచి జరగాలంటే నిజం చెప్పాలి అంటాడు దాసు. పిల్లలను నేనే మార్చానని తెలిస్తే వాళ్లు నన్ను చంపేస్తారు అంటుంది పారు. వాళ్ల కాళ్ల మీద పడి నేను నిన్ను కాపాడుకుంటాను అంటాడు దాసు. ఎలాగైనా నిజం చెప్పాలి అని లోపలికి వెళ్తాడు.

66
దీప చేతుల మీదుగా..

హోమం చుట్టూ తిరుగుతుండగా కళ్లు తిరిగి పడబోతుంది సుమిత్ర. పట్టుకుంటుంది దీప. నీకు సాయంగా ఉంటాను అని అమ్మానాన్నలతో కలిసి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. దీప హోమం చుట్టూ తిరగడాన్ని చూసిన దాసు.. సంతోషంతో సైలెంట్ గా ఉంటాడు.

దీప వాళ్ల సొంత కూతురు కాబట్టే.. దేవుడు ఇలా చేశాడేమో అని కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. పూర్ణాహుతిని ఎలాగైనా కింద పడేయాలి అనుకుంటుంది. సుమిత్ర, దశరథ, దీప చేతుల మీదుగా పూర్ణాహుతిని జ్యోత్స్నకు వదులుతారు. కానీ జ్యోత్స్న దాన్ని కిందపడేలా వదిలేస్తుంది. అప్పుడు దీప పూర్ణాహుతిని తన చేతులమీదుగా హోమంలో పడేలా చేస్తుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories