రాము రాథోడ్ కు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ , 9 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందకు ఎంత వసూలు చేశాడంటే?

Published : Nov 09, 2025, 03:52 PM IST

బిగ్ బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చాడు ఫోక్ సింగర్ రాము రాథోడ్. బిగ్ బాస్ హౌస్ లో 9 వారాలు పూర్తిగా ఉన్నందకు, రాముకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా? 

PREV
15
బిగ్ బాస్ తెలుగు లో ఎమెషనల్ సిచ్యువేషన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి అనూహ్యమైన ట్విస్టులు, కంట్రావర్సీలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వారం జరిగిన సంఘటన మాత్రం ప్రేక్షకుల మనసులను కదిలించింది. ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఒత్తిడి కారణంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి.. హౌస్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ నిర్ణయంతో బిగ్ బాస్ హౌస్‌లోనూ, ప్రేక్షకుల మధ్య ఎమోషనల్ సిచ్యువేషన్ నెలకొంది.

25
రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్

తొమ్మిది వారాల పాటు హౌస్‌లో ఉన్న రాము రాథోడ్.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తలో చాలా చురుకుగా కనిపించాడు. టాస్కుల్లో కూడా బాగా ఆడాడు. ఇతర కంటెస్టెంట్స్‌తో మంచి బాండింగ్‌ను ఏర్పరచుకున్నాడు. కానీ సమయం గడిచే కొద్దీ ఆయన గేమ్‌పై ఆసక్తి తగ్గింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత రాములో నిరుత్సాహం మొదలయ్యింది. టాస్క్ లను కూడా పట్టించుకోకుండా. చాలా డల్ గా కనిపించడం మొదలుపెట్టాడు. మధ్యలో నాగార్జున కూడా రామలో ఉత్సాహం తెప్పించడానికి ఓ ఎడిటింగ్ కామెడీ వీడియోను ప్లే చేశాడు. అప్పుడు కాస్త హుషాుుగా కనిపించిన రాము.. ఆతరువాత మళ్లీ మొదటికొచ్చాడు.

35
మానసికంగా ఇబ్బంది పడ్డ రాము

రామురాథోడ్ లో నిరుత్సాహం పెరగడం.. టాస్క్‌లలో మధ్యలోనే గివ్ అప్ చెప్పడం, నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో నెగటివ్ ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. అయితే రాము ఇలా ఉండటానికి కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల , ఒంటరితనం, ఇంటి జ్ఞాపకాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ కారణాలతోనే ఆయన సెల్ఫ్ ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నాడు.

45
పాట రూపంలో బాధను వెల్లడించిన రాము

హోస్ట్ అక్కినేని నాగార్జున వారం ఎపిసోడ్‌లో రాముతో మాట్లాడి, “ఏమైంది రామూ? హోమ్‌సిక్ అయిపోయావా? ఇంటి బెంగగా ఉందా?” అని ప్రశ్నించారు. దానికి రాము పాట రూపంలో సమాధానం ఇస్తూ, “బాధౌతుందే నీ యాదిలో మనసంతా... మస్తు బరువౌతోందే అమ్మ యాదిలో మనసంతా” అని పాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం ఆపాట.. హౌస్ లో వాళ్లతో పాటు.. చూస్తున్న ఆడియన్స్ హృదయాలను కూడా తాకింది. అందరు ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. నాగార్జున, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు ఎంత చెప్పినా వినకుండా రాము.. కన్నీళ్లతో బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు. అయితే రాము బిగ్ బాస్ లో ఉన్న ఈ 9 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

55
9 వారాలకు ఎంత వసూలు చేశాడంటే?

రాము రాథోడ్ తొమ్మిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. ఆడియన్స్ లో అతనికి మంచి ఇమేజ్ కూడా ఉంది. ఇక తాను ఉన్నన్ని రోజులకు గాన ప్రతి వారం సుమారు 2 లక్షలు పారితోషికంగా పొందినట్లు సమాచారం. అంటే మొత్తం మీద ఆయనకు 18 లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. సెల్ఫ్ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో రాము రాథోడ్ ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. నీకు మేమున్నాం అన్న భరోసా ఇస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా ఆయనకు వచ్చిన గుర్తింపుతో నెక్ట్స్ రాము చేసే ఫోక్ మ్యూజిక్ ఆల్భమ్స్ కు భారీగా క్రేజ్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories