మానస్ సీజన్ 5 కంటెస్టెంట్ కాగా, ప్రియాంక జైన్ సీజన్ 7 కంటెస్టెంట్. అనంతరం పునర్నవి, వితిక షేరు వచ్చారు. వీరిద్దరూ సీజన్ 3 కంటెస్టెంట్స్. దశల వారీగా జరిగిన టాస్క్ లలో కొందరు గెలిచారు, కొందరు ఓడారు. చివరికి గౌతమ్, నిఖిల్, రోహిణి, అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్స్ గా నిలిచారట. గౌతమ్ కూడా ఛాన్స్ కోల్పోయాడట. కాగా టికెట్ టు ఫినాలే అవినాష్ గెలుచుకున్నాడు... అనేది లేటెస్ట్ న్యూస్.