మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేసిన స్టార్ సింగర్, సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన బాహుబలి గాయని ఎవరు?

Published : Nov 14, 2025, 12:09 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు షాక్ ఇచ్చింది ఓ లేడీ సింగర్. సినిమాల విషయంలో కాదు.. సమాజ సేవలో స్టార్ హీరో రికార్డును బ్రేక్ చేసింది. తనకు వచ్చే తక్కువ ఆదాయంతో ఆమె చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు.

PREV
15
సమాజసేవలో మహేష్ బాబు..

సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు సినీ తారలు. అయితే వారిలో కొంత మంది మాత్రమే.. వారి ఆదాయంలో ఎంతో కొంత సమాజసేవకు ఉపయోగిస్తున్నారు. కోట్లు సంపాదించినప్పటికీ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న తపన అందరిలో ఉండదు. అయితే ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా.. సమాజానికి సేవ చేస్తోన్న కొద్దిమంది సెలబ్రిటీలలో.. తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ఇప్పటి వరకు 3 వేలకుపైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి.. వారి ప్రాణాలు కాపాడారు. ఎవరికీ తెలియకుండా, ప్రచారం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా తన గొప్పమనసును చాటుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్.. ఎంత బిజీగా ఉన్నా.. తన పని మాత్రం ఆపలేదు. 

25
మహేష్ బాబును మించి చేస్తోన్న స్టార్ సింగర్

మహేష్ బాబు మాత్రమే కాదు.. మరో స్టార్ స్టార్ సెలబ్రిటీల కూడా ఇదే పనిచేస్తూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సింగర్ పలక్ ముచ్చల్ (Palak Muchhal) ఇప్పటివరకు 3800 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. మహేష్ బాబు సంపాదనతో పోల్చుకుంటే పలక్ ముచ్చల్ ఆదాయం చాలా తక్కువ. కానీ ఆమె చేస్తున్న సేవ మాత్రం సూపర్ స్టార్ ను మించిపోయింది. అతి తక్కువ ఆదాయంతో ఇంత పెద్ద పని ఆమె ఎలా చేయగలుగుతుందని అందరు ఆశ్చర్యపోతున్నారు.

35
ఆదాయం తక్కువైనా.. తగ్గేదిలేదు..

సాధారణంగా సింగర్‌ల ఆదాయం సినిమా హీరోలతో పోలిస్తే చాలా తక్కువ. అందులో పలక్ ముచ్చల్ బాలీవుడ్‌లో టాప్ పెయిడ్ సింగర్ కూడా కాదు. ఒక పాటకు వచ్చే పారితోషికం పెద్దగా ఉండదు. అయినప్పటికీ ఆమె తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని చిన్నారుల హార్ట్ ఆపరేషన్ల కోసమే ఆమె వినియోగిస్తోంది. అంతే కాదు సినిమా సింగర్ గా కాకుండా.. బయట నుంచి ఆమె చేసే గా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ వాటి ద్వారా సేకరించిన విరాళాలను పూర్తిగా పిల్లల వైద్య చికిత్సలకు వినియోగిస్తోంది పలక్ ముచ్చల్.

45
3800 పైగా చిన్నారులను రక్షించిన పలక్

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కుటుంబం నుంచి పూర్తి సపోర్ట్ ఆమెకు లభిస్తోంది. అంతే కాదు పలక్ ముచ్చల్ కు పలువురు డాక్టర్ల సహాయం లభించినప్పటికీ, మొత్తం ప్రయత్నం ఆమె నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 3800 మంది పిల్లలకు ఆమె సహాయంతో ఆపరేషన్ చేయించుకున్నారు. పలక్ ముచ్చల్ బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో ఆమె బాహుబలి: ది బిగినింగ్, రుద్రమదేవి వంటి చిత్రాలకు పాటలు పాడింది. ఆమె లైవ్ కన్సర్ట్స్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా నిధులు సేకరించడానికి మంచి రూట్ దొరికింది.

55
పలక్ ముచ్చల్ మంచి మనసు

భారీ పారితోషికం తీసుకునే సినీనటులు కూడా కొన్నిసార్లు ఇలాంటి సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపకపోవచ్చు. అయితే పలక్ ముచ్చల్ వంటి కళాకారులు, తక్కువ ఆదాయమున్నప్పటికీ వేలాది చిన్నారుల ప్రాణాలను రక్షించడం ద్వారా సమాజానికి ఎంతో సేవచేస్తున్నారు. ఈ విషయంలో పలక్ .. సూపర్ స్టార్ మహేష్ బాబునే మించిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories