
గ్రానీ మనిషికి రెండే దారులుంటాయి. ఒకటి గెలవడం, మరొకటి ఓడిపోవడం.. గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఓడిపోవాలంటే నీలాగే ఏం చేయాల్సిన అవసరం లేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఫామ్ లోకి వచ్చేవరకు నేను బాగానే ఉన్నాను. ఆ తర్వాతే ఏమైందో అంటుంది పారు. నీకు ఈ ఆస్తి, కార్తీక్ పై తప్పా ఎవ్వరిమీద ప్రేమ లేదు అంటుంది పారు. మీ తాతను మచ్చిక చేసుకోమన్నాను. మీ అమ్మనాన్నలను కలపమని చెప్పాను ఒక్కటైనా చేశావా? ఆ పని కార్తీక్, దీప చేస్తే వారు ఏ స్థాయికి ఎదుగుతారో తెలుసా అంటుంది పారు. తాతకు, బావకు మమ్మీ ఎక్కడుందో తెలుసని నాకు అనిపిస్తోంది అంటుంది జ్యో. నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఎలా కనిపెట్టాలి అంటుంది పారు. ఎలాగైనా కనిపెడతాను. నాపై ఉన్న చెడ్డపేరు పోవాలంటే అమ్మనాన్నలను నేనే కలపాలి అంటుంది జ్యోత్స్న. ఎలాగైనా మమ్మీని బయటకు రప్పిస్తాను అంటూ వెళ్లిపోతుంది.
టిఫిన్ చేయండి అంటూ శివన్నారాయణ దగ్గరకు వస్తుంది పారు. కార్తీక్ వచ్చాడ అని అడుగుతాడు శివన్నారాయణ. డ్రైవర్ రాకపోతే టిఫిన్ చేయరా? అంటుంది పారు. కాస్త మర్యాదగా మాట్లాడు అంటాడు శివన్నారాయణ. ఈ ఇంట్లో పనివాళ్లకు ఉన్న విలువ.. ఇంటి వాళ్లకు లేదులే గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ అక్కడకు వస్తాడు. మరోవైపు దశరథ కూడా రెడీ అయివస్తాడు. నాన్న నాకు బయట కొంచెం పనుంది.. నాకోసం వెయిట్ చేయకండి అని చెప్తాడు దశరథ. నువ్వు కూడా సుమిత్ర లాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావా అని అంటుంది పారు. పారిజాతం అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. దెబ్బకు నోరు ముస్తుంది పారు.
కార్తీక్ ని తీసుకొని వెళ్లమని దశరథతో చెప్తాడు శివన్నారాయణ. అవసరం లేదు నాన్న అంటాడు దశరథ. మనసులో ఇన్ని ఆలోచనలు పెట్టుకొని ఎలా డ్రైవ్ చేస్తావు? తీసుకెళ్లు అంటాడు. మరోవైపు కార్తీక్ కి సైగ చేస్తాడు శివన్నారాయణ.
కార్తీక్ కి మీరు ఎందుకు సైగ చేశారండి అని అడుగుతుంది పారు. మనం హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు శివన్నారాయణ. ఎందుకు అని అడుగుతుంది పారు. నీ కళ్లద్దాలు మార్చాలి అంటాడు. నాకు బాగానే కనిపిస్తోంది కదా అంటుంది పారు. బాల్కనీలో ఉన్న నీకు సుమిత్ర వెళ్లడం కనిపించలేదు. కానీ నేను కార్తీక్ కి సైగ చేసింది మాత్రం కనిపించిందా అంటాడు. లేదండి కనిపించలేదు అని తప్పించుకుంటుంది పారు.
మరోవైపు అల్లుడి గురించి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు శ్రీధర్. ఇంతలో అక్కడికి వస్తాడు కాశీ. డే అంతా బాగానే మ్యానేజ్ చేస్తావు కానీ.. నెలాఖరులో శాలరీ ఎలా తెచ్చిస్తావు అని అడుగుతాడు శ్రీధర్. జాబ్ లేకపోతే నాకు రెస్పెక్ట్ లేదు. నేను బాధపడటం.. మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని అబద్ధం చెప్పాను అంటాడు కాశీ. నేను నీ గురించి స్వప్నకు చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్.
శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు కాశీ. చెప్పొద్దు. ఈలోపు నేను జాబ్ చూసుకుంటాను అంటాడు. స్వప్నకు అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు నచ్చరు. నాపై కోపంతోనే నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు. నీ గురించి తెలిస్తే నీకు ఎలా ఉంటుందో ఆలోచించుకో అంటాడు శ్రీధర్. పక్కనుంచి గమనిస్తుంది స్వప్న. కాశీ ఏం తప్పు చేశాడు? ఎందుకు నాన్న కాళ్లు పట్టుకున్నాడు అని ఆలోచిస్తుంది. చెప్పనులే అని కాశీని పైకి లేపుతాడు శ్రీధర్.
గుడికి వెళ్తారు దశరథ, కార్తీక్. ఎందుకు మామయ్య గుడికి తీసుకొచ్చావు అంటాడు కార్తీక్. ప్రశాంతత కోసం అని చెప్తాడు దశరథ. ప్రశాంతత ఇక్కడ కలుస్తానని చెప్పిందా అని అంటాడు కార్తీక్. అసలు ఏమైంది రా నీకు, నాన్నకు. ఇంతకుముందు నాపై జాలి చూపించేవారు. ఇప్పుుడు దెప్పిపొడుస్తున్నారు. వెటకారం చేస్తున్నారు అంటూ గుడిలోకి వెళ్తాడు దశరథ. దీపకు ఫోన్ చేస్తాడు కార్తీక్. సుమిత్రను తీసుకొని గుడికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఫోన్ ని కారులో పెట్టి గుడి లోపలికి వెళ్తాడు.
బావ ఫోన్ చేశాడు. నేను సుమిత్రమ్మను తీసుకొని గుడికి వెళ్తాను అని కాంచనతో అంటుంది దీప. వదిన వస్తుందో రాదో దీప అంటుంది కాంచన. వారిద్దరూ పెళ్లిరోజు నాడు కచ్చితంగా శివాలయం వెళ్తారట. దశరథ గారు ఆల్రెడీ వచ్చారట. సుమిత్రమ్మ కూడా కచ్చితంగా వస్తుంది. వారిని కలపడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. సుమిత్రమ్మ రాకపోతే మీరే చెప్పాలి అంటుంది దీప. సరే వెళ్లు అంటుంది కాంచన.
గదిలో ఎక్కడ చూసినా సుమిత్ర కనిపించదు. అంతా వెతికి అత్తయ్య సుమిత్రమ్మ గారు.. అని దీప చెప్పబోతూ… గుమ్మంలో నిలబడి ఉన్న జ్యోను చూసి షాక్ అవుతుంది. చెప్పు దీప.. మా మమ్మీ పేరు ఎందుకు అన్నావు. మా మమ్మీని ఇక్కడే దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావా? అని తనతో వచ్చిన పోలీసులను లోపలికి పిలుస్తుంది జ్యో. మా మమ్మీ కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చాను. ఎవ్వరిపై అనుమానం ఉందని అడిగితే నీ పేరే చెప్పాను. తన శత్రువే ఏదో ఒకటి చేసి ఉంటుందని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు సిద్ధంగా ఉండు దీప అని చెప్తుంది జ్యో. సుమిత్ర కోసం ఇళ్లు మొత్తం వెతుకుతుంది. సుమిత్ర ఎక్కడా కనిపించకపోయేసరికి.. మా మమ్మీని ఏం చేశావు దీప అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న.
మరోవైపు గుడిలో దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది సుమిత్ర. ఆ పక్కనే తిరుగుతుంటారు దశరథ, కార్తీక్. పూజ పూర్తయిన తర్వాత మరోసారి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది సుమిత్ర. చేతిలో మిగిలిపోయిన కుంకుమను పక్కకు పోస్తుండగా.. కాస్త దూరంలో దశరథ కనిపిస్తాడు. భర్తను చూసి సుమిత్ర షాక్ అవ్వడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.