ఇక్కడ.. మోక్షను కాపడటానికి పంచమి, ఫణీంద్ర, నాగ సాధు చాలా కష్టపుతూ ఉంటారు. ఈ లోగా పంచమి తల్లికి నాగ సాధువు సమాచారం అందిస్తారు. ఆమె అక్కడకు వచ్చిన తర్వాత అసలు విషయం అర్థమౌతోంది. అప్పటికే.. మోక్ష ఇంట్లో అందరూ.. మోక్షకు ఏదో ప్రమాదం జరగబోతోందని కంగారుపడుతూ ఉంటారు. మోక్షకు నాగ గండం పొంచుకు వస్తుందని వారు భయపడుతూ ఉంటారు. అదే సమయానికి పంచమి తల్లి.. వైదేహికి ఫోన్ చేసి.. మోక్షను పాము కరిచిందని చెబుతుంది.