BrahmamudiBrahmamudi
Brahmamudi 20 January Episode: శ్వేత తన ఇంట్లో ఎవరో ఉన్నారు అనే భయంలో ఉంటుంది. కర్ర పట్టుకొని.. కొట్టడానికి తిరుగుతూ ఉంటుంది. అదే సమయానికి రాజ్ అక్కడకు వస్తాడు. శ్వేత ఎవరో అనుకొని కొట్టబోతుంటే.. తాను రాజ్ ని అని చెప్పి.. లోపలికి వెళతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మొత్తం వెతుకుతారు. ఎవరూ లేరు అని రాజ్ చెబుతూ ఉంటాడు. కానీ.. టీవీ ప్లే అయ్యిందని, ప్లవర్ వాజ్ పడిపోయిందని, కత్తి పడిందని.. ఇలా సాక్ష్యాలు చూపిస్తూ ఉంటుంది.
Brahmamudi
మరో వైపు కావ్య నిద్రపోతూ ఉంటే.. శ్రుతి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావ్ అని అడుగుతుంది. సర్ .. ఇంకా రాలేదు ఆఫీసుకు అని చెబుతుంది. ఎప్పుడో బయలు దేరారు.. ఈపాటికి వచ్చేయాలి కదా అని కావ్య అంటుంది. చాలా ఇంపార్టెంట్ డీల్ అని, డిజైన్లు ఫైనల్ అవ్వలేదని, భయంగా ఉందని శ్రుతి చెబుతుంది. దీంతో.. కావ్య తనకు మెయిల్ చేయమని, తాను సరి చేస్తానని మాట ఇస్తుంది. వెంటనే మెయిల్ చేయడంతో కావ్య కూర్చొని డిజైన్లు వేయడం మొదలుపెడుతుంది.
BrahmamudiBrahmamudi
మరోవైపు శ్వేత ఇంకా బయటపడుతూనే ఉంటుంది. ఇంట్లోకి ఎవరూ రాలేదని మొదట రాజ్ కన్విన్స్ చేయాలని చూస్తాడు. కానీ శ్వేత నమ్మకపోవడంతో వచ్చారు అని రాజ్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత.. శ్వేత కు ధైర్యం చెబుతూ ఉంటాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే.. ఎవరో ఓ వ్యక్తి వీడియో తీస్తాడు.
Brahmamudi
ఇంట్లో కావ్య డిజైన్స్ వేసి.. వాటిలో కొన్ని మార్పులు అవసరం అని.. మళ్లీ కొత్త డిజైన్లు వేయడం మొదలుపెడుతుంది. అప్పుడే కావ్యకు ఎవరో వీడియో, ఫోటోలు పంపుతారు. దాంట్లో రాజ్.. శ్వేత చేతిని పట్టుకొని ఉంటాడు. అంతే.. అది చూసి కావ్య గుండె పగిలిపోతుంది. ఒక్కసారిగా షాకౌతుంది. ఏం చేయలేక.. ఏడుస్తూ కూర్చుంటుంది. గతంలో తాను రాజ్ తో గడిపిన సంతోషకరమైన సందర్భాలను తలుచుకొని, మరింత బాధపడుతుంది. బ్యాగ్రౌండ్ లో బ్రహ్మముడి టైటిల్ సాంగ్ ప్లే అవుతుంది.
Brahmamudi
మరుసటిరోజు ఉదయం కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే.. అనామిక వచ్చి టీ ఇస్తుంది. నువ్వే చేశావా అని అడుగుతాడు. కాదు పనమ్మాయి అని చెప్పడంతో తీసుకొని తాగుతాడు. అప్పుడు అనామిక.. బావగారు ఎప్పుడో ఆఫీసుకు వెళ్లారు.. నువ్వు వెళ్లవా అని అడుగుతుంది. దానికి కళ్యాణ్. మరీ అర్జెంట్ అయితే తప్ప నేను వెళ్లను, మొత్తం అన్నయ్యే చూసుకుంటాడు అని కళ్యాన్ చెబుతాడు. మరి నువ్వు ఇంట్లో ఏం చేస్తుంటావ్ అని అనామిక అడిగితే.. రాహుల్ వచ్చి.. ఇదిగో ఇలా పిచ్చి రాతలు రాస్తూ ఉంటాడు.. నన్ను ఆఫీసుకు రానివ్వరు, కళ్యాణ్ ని కూడా రానివ్వరు అనేసి.. అనామిక బుర్రలో ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Brahmamudi
నువ్వు ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే..నాకు ఇంట్లో విలువ ఏం ఉంటుంది అని అనామిక మనసులో అనుకుంటుంది. తర్వాత కళ్యాణ్.. భోజనం అయ్యాక పిలువు అని చెబుతాడు. సరే.. నువ్వు రాసుకో అని చెప్పి అనామిక వెళ్లిపోతుంది. అలా వెళ్లున్న అనామికకు రుద్రాణి ఎదురౌతుంది. పట్టించుకోకుండా అనామిక వెళ్తుంటే.. రుద్రాణి ఊరుకోదు. ‘ నీ పెయిన్ నాకు అర్థమైంది అనామిక, కళ్యాణ్ ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే, రాజ్ అక్కడ రాజ్యం ఏలుతున్నాడనే కదా నీ బాధ’ అని అంటుంది. ‘ అవును ఆంటీ, ఏే భార్య అయినా భర్తకి అందరూ గౌరవం ఇవ్వాలనే అనుకుంటుంది కదా’ అని అనామిక అంటుంది., ‘అదే విషయం నేను మొత్తుకుంటున్నాను. కానీ.. నా మాట ఎవరూ వినిపించుకోలేదు. రాజ్ ని రాజకుమారుడిలా చూసుకుంటున్నారు.’ అని రుద్రాణి ఎక్కింది.
‘ మా అత్తగారు ఎలా ఒప్పుకున్నారు?’ అని అనామిక అంటే.. మీ అత్త ఓ పిచ్చి మొహంది అని రుద్రాణి అంటుంది. అయితే.. దానిని నేను మారుస్తానని, మా అత్తయ్యగారికి నేను చెప్పినట్లు చెప్పండి అని.. ఏదో చెబుతుంది. అది విని రుద్రాణి సరే అంటుంది. రుద్రాణి వెళ్లిన తర్వాత.. ఈ విషయంలో తాను తప్పకుండా గెలుస్తాను అని అనామిక అనుకుంటుంది.
Brahmamudi
మరోవైపు కావ్య ఇంట్లో అందరికి కాఫీలు ఇస్తుంది. రాజ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్లు అందరూ ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతారు. వాళ్ల ప్రశ్నలకు కావ్య సమాధానం చెబుతుంది. రాత్రి ఆఫీసుకు వెళ్లారు అని చెబుతుంది. కానీ.. పనిలో పనిగా సెటైర్లు వేస్తుంది. బయట ఫుడ్ కి అలవాటు పడ్డాడని అందరి ముందు కౌంటర్లు వేస్తుంది.
Brahmamudi
‘ఇంటిల్లపాది రాజ్ ని పొగిడేస్తూ ఉంటారు.. కళ్యాణ్ గురించి ఎప్పుడైనా ఇలా మాట్లాడారా?’ అని ధాన్యలక్ష్మికి రుద్రాణి ఎక్కించే పనిలో పడుతుంది. రాజ్ నిజంగానే కష్టపడుతున్నాడుు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. వెంటనే రుద్రాణి.. అనామిక బాధను ధాన్యలక్ష్మికి చెబుతుంది. అనామిక ఇప్పటికే కళ్యాణ్ విషయంలో ఫీలౌతోందని చెబుతుంది. కళ్యాణ్ కూడా వ్యాపారం చూసుకునేలా చెయ్యమని ఇంతకాలం అంటే.. వేరు.. ఇప్పుడు పెళ్లి అయ్యింది కదా అని చెబుతుంది.
Brahmamudi
ఇక, రాజ్ ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. ఈ లోగా ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. డిజైన్స్ ఎలా అని రాజ్ ఫీలౌతుంటే.. కావ్య తెచ్చి డిజైన్స్ ఇస్తుంది. నీకెలా తెలుసు అని రాజ్ అడిగితే.. నాకు అన్నీ తెలుసు అని కావ్య అంటుంది. ఆ డిజైన్లు చూసిన రాజ్... ఏమైనా అడగాలా అని అంటాడు.. మీరేమైనా చెప్పాలా అని కావ్య అంటుంది. ఏమీ లేదు అని రాజ్ అంటే.. అయితే అడగడానికి కూడా ఏమీ లేదు అని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
డిజైనర్ శ్రుతి ద్వారా ఈ విషయం తెలిసి ఉంటుందని రాజ్ కి అర్థమై.. తనకి ఫోన్ చేసి కావ్యకు చెప్పినందుకు తిడుతుంటాడు. కావ్య కి డౌట్ వచ్చిందా అని కంగారుపడతాడు.