Guppedantha Manasu 20 January Episode:భద్రపై వసుకి అనుమానం, ఒక్కటౌతున్న వసు, రిషిల శత్రువులు..!

First Published | Jan 20, 2024, 8:20 AM IST

అక్కడ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారని నాకు తెలీదు కదా.. అందుకే ఫోన్ చేశాను అని శైలేంద్ర అంటాడు. అందుకే.. మనిషికి టైమ్ సెన్స్ ఉండాలి అని భద్ర సెటైర్ వేస్తాడు.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 20 January Episode: తన కొడుకు రిషిని చూడాలని మహేంద్ర పట్టుపడతాడు.  అనుపమ, వసుధార ఎంత చెప్పినా మహేంద్ర వినడు. తనకు రిషి అడ్రస్ చూపించాలని పట్టుపడతాడు. అదంతా భద్ర అక్కడే వింటూ ఉంటాడు. కచ్చితంగా వసుధార.. రిషి అడ్రస్ చెబుతుందని, తాను వెళ్లి రిషిని చంపుతాను అని భద్ర అనుకుంటాడు. మహేంద్ర.. వసుకి దండం పెట్టి మరీ తన కొడుకు అడ్రస్ చెప్పమని అంటాడు. చెప్పేలోగా.. భద్రకు ఫోన్ వస్తుంది. ఆ శబ్దం వీళ్లు వినేస్తారు. భద్ర వెంటనే అలర్ట్ అయ్యి.. అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే అనుపమ.. చూశావా.. మహేంద్ర మన వెనక ఏదో జరుగుతోంది.. అందుకే వసుధార జాగ్రత్తగా ఉండమని చెబుతోందని మహేంద్రకు అర్థమయ్యేలా చెబుతుంది.
 

Guppedantha Manasu

ఇక.. ఫోన్ రావడంతో పక్కు వచ్చిన భద్ర.. ఆ ఫోన్ చేసిన శైలేంద్రతో మాట్లాడతాడు. టైమ్ సెన్స్ లేదు మీకు అని శైలేంద్రను భద్ర తిడతాడు.  టైమ్ సెన్స్ ఏంటి అని అడిగితే.. మహేంద్ర వాళ్లు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటూ ఉంటే.. వినే సమయానికి ఫోన్ చేశారు అని భద్ర అంటాడు. వసుధార అక్కడ ఉందా అని శైలేంద్ర అడుగుతాడు. ఉన్నారని.. వాళ్లు రిషి గురించి మాట్లాడుకుంటుండగా.. సరిగ్గా విని.. రిషి ఆచూకీ తెలిసిపోతుందని ఆనందపడేలోగా.. మీరు ఫోన్ చేసి ఆనందాన్ని పాడు చేశారు అని భద్ర అంటాడు. అక్కడ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారని నాకు తెలీదు కదా.. అందుకే ఫోన్ చేశాను అని శైలేంద్ర అంటాడు. అందుకే.. మనిషికి టైమ్ సెన్స్ ఉండాలి అని భద్ర సెటైర్ వేస్తాడు.
 


Guppedantha Manasu

వెంటనే సారీ చెప్పిన శైలేంద్ర... బాబాయ్ కి ఇప్పుడు రిషి ఆచూకీ తెలిసిపోయి ఉంటుంది కదా.. నువ్వు బాబాయ్ ని ఫాలో అవుతూ ఉంటే... రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు అని సలహా ఇస్తాడు. కానీ.. వాళ్లు చాలా జాగ్రత్తపడుతున్నారని.. ఇప్పుడు వాళ్ల వెంటనే ఉన్నా తెలుసుకునే అవకాశమే లేదు అని అంటాడు. చెప్పింది చెయ్యి అని శైలేంద్ర వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఈ మనిషి ఏంటి.. ఇంత విచిత్రంగా ఉన్నాడు అని..  భద్ర అనుకుంటాడు. తిరిగి వెనక్కి చూసేలోగా... మహేంద్ర, వసుధార, అనుపమ ఉంటారు.
 

Guppedantha Manasu

వాళ్లను చూసి భద్ర షాకౌతాడు. వెంటనే మహేంద్ర.. ఎవరితో మాట్లాడుతున్నావ్..? ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నలు వేస్తాడు. అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు అని మహేంద్ర అడగగా.. వసు ఫోన్ లాక్కుంటుంది. నీకు ఫోన్ వచ్చింది ఈ నెంబర్ నుంచేనా అని వసు అడుగుతుంది. అవును అని భద్ర అంటాడు. చూస్తే అది శైలేంద్ర నెంబర్ కాదు అని వసు అనుకుంటుంది. వాళ్లు ఎమీ వినలేదు అని అర్థం చేసుకున్న తర్వాత.. లోన్ ఇస్తాం అని ఫోన్ చేశారు అని అబద్దం చెబుతాడు.

కానీ వసు నమ్మదు. నువ్వు అబద్దం చెబుతున్నావ్ అని అంటుంది. మీరు ఎలా చెబుతారు.. నేను అబద్దం చెబుతున్నాను అని..? అని భధ్ర అడుగుతాడు. నీ ప్రవర్తన అలా ఉంది.. అందుకే అలా అనుమానం వచ్చింది అని వసు అంటుంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం నేను కాదు అని శైలేంద్ర చెబుతాడు. కానీ వసు మాత్రం.. నువ్వు మాటలతో అందరినీ మాయ చేయగలవు కానీ.. నన్ను కాదు అని అంటుంది. నీ మనసులో ఏదో విషం ఉంది.. అందుకే ఆ రోజు మా ఇంటికి వచ్చావ్ అని నిలదీస్తుంది. కానీ.. భద్ర ఏ మాత్రం తొనకకుండా.. అది తన పని అని.. అంతే తప్ప మీరు అనుకున్నట్లు ఏమీ లేదు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

తర్వాత.. వసుధార మేడమ్ చుట్టూ ప్రమాదం ఉందని మీరే చెప్పారు కదా సర్ అని మహేంద్రని అడుగుతాడు. అవును అని మహేంద్ర అంటే.. అందుకే మేడమ్ ని వెతుక్కుంటూ వాళ్ల ఇంటికి వెళ్లాను అని చెబుతాడు. ప్రతి విషయంలో తనను అనుమానిస్తున్నారని, మీ దగ్గర పని చేయడం ఇష్టం లేకపోతే.. ఇప్పుడే ఉద్యోగం మానేస్తాను అని భద్ర చెబుతాడు. వీళ్లందరినీ పడేసేలా కొన్ని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. తనంటే ఇష్టం లేకపోతే.. ఇప్పుడే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాను అని అంటాడు.

వసు ఏదో అనబోతుంటే.. అనుపమ ఆపేసి..  అతని ఫోన్ అతనికి ఇప్పిస్తుంది. నువ్వు వెళ్లి పని చూసుకో అని భద్రకు చెబుతుంది. తర్వాత.. వసుధారను అనుపమ లోపలికి తీసుకువెళ్తుంది.  కానీ.. వసు మాత్రం భద్రను అనుమానిస్తూనే ఉంటుంది.
 

Guppedantha Manasu

మరోవైపు దేవయాణి కి ఓ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. కొత్త నెంబర్ నుంచి ఎవరు చేశారా అని శైలేంద్ర చూస్తాడు. ఫోన్ పక్కన పెట్టినా ఫోన్ వస్తూనే ఉండటంతో.. శైలేంద్ర లిఫ్ట్ చేస్తాడు. అటు నుంచి ఫోన్ చేసింది.. వసు బావ రాజీవ్ కావడం విశేషం. ఇద్దరూ కాసేపు..  ఒకరితో మరొకరు వెటకారంగా మాట్లాడుకుంటారు. దేవయాణి ని రాజీవ్ మేడమ్ కి ఇవ్వమని రాజీవ్ అడుగుతాడు. ఈ లోగా... దేవయాణి రావడంతో.. ఫోన్ తీసుకుంటుంది.

రాజీవ్ తో చాలా ప్రేమగా, ఆప్యాయంగా దేవయాణి ఫోన్ మాట్లాడుతుంది.  ఎలా ఉన్నావ్ అని దేవయాణి అడిగితే.. వసు దక్కక బాలేనని, ఇక మీద బాగుపడాలని వచ్చాను అని చెబుతాడు. రాగానే మీకే ఫోన్ చేశాను అని రాజీవ్ చెబుతాడు. ఇప్పుడే కలిసి మాట్లాడుకుందాం అని రాజీవ్ అంటాడు. ఎక్కడ కలుద్దాం అని దేవయాణి అడిగితే.. రాజీవ్ ఓ ప్లేస్ చెబుతాడు. ఇప్పుడే.. అక్కడకు వచ్చేస్తాను అని దేవయాణి అంటుంది. ఇందాక.. మీ ఫోన్ మాట్లాడింది ఎవరు అని రాజీవ్ అడిగితే... నా కొడుకు అని దేవయాణి చెబుతుంది. మీరు వచ్చేటప్పుడు మీ అబ్బాయిని కూడా తీసుకురమ్మని రాజీవ్ చెబుతాడు. దేవయాణి సరే అంటుంది. వెంటనే శైలేంద్రను తీసుకొని.. దేవయాణి బయలుదేరుతుంది.
 

Guppedantha Manasu

మరోవైపు వసుధార.. రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోగా చక్రపాణి ఫోన్ చేస్తాడు. రిషి సర్ కి ఎలా ఉంది అని వసు అడిగితే.. ఇప్పుడు కోలుకుంటున్నారని, కొంచెం అన్నం కూడా తింటున్నారని చక్రపాణి చెబుతాడు. రిషి సర్ ని చూడాలని అనిపిస్తోందని వసు అంటుంది. వెంటనే రమ్మని చక్రపాణి అంటే.. రాలేను అని వసుధార అంటుంది. అయితే.. వీడియో కాల్ చేస్తాను అని రిషి సర్ ని చూపించమని వసు అడుగుతుంది. అయితే.. సిగ్నల్స్ సరిగా లేవని.. చక్రపాణి చెబుతాడు. ఆ మాటకు వసు బాధపడుతుంది. బాధపడొద్దని చక్రపాణి ధైర్యం చెబుతాడు.  అల్లుడు గారిని వీడియో తీసి..  నీకు పంపిస్తాను అని చెబుతాడు. దానికి వసు సంబరపడుతుంది.
 

Guppedantha Manasu

ఇక..దేవయాణి తన కొడుకు శలేంద్రతో కలిసి.. రాజీవ్ కోసం ఎదురు చూస్తుూ ఉంటుంది. అయితే.. శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు. అసలు ఎవడు వాడు.. వాడిని మనం ఎందుకు కలవాలి అని అడుగుతాడు. అప్పుడు.. ఆ రాజీవ్... వసుధారకు బావ అవుతాడని, పెళ్లి చేసుకోవాలని ఆశపడిన విషయం మొత్తం చెబుతుంది. గతంలో జగతిని కాల్చి చంపాలని చూసిన విషయం కూడా చెబుతాడు. రిషితో వైరం అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెబుతుంది. వసుధారకు నరకం చూపించాడని చెబుతుంది. మరి..ఇప్పుడు వీడితో మనకు పని ఏంటి? అని శైలేంద్ర అడుగుతాడు. దేవయాణి నవ్వుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!