Guppedantha Manasu 22nd January Episode:నీకు కుర్చీ.. నాకు కుర్చీలో మరదలు పిల్ల.. శైలేంద్రతో రాజీవ్ డీల్..!

Published : Jan 22, 2024, 09:33 AM IST

అల్లుడు గారు తనకు కూడా కొడుకు లాంటివారేనని.. ఆయనను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని, తన కూతురు, అల్లుడు సంతోషంగా ఉండటం కోసం తాను ఏదైనా చేస్తాను అని ఆయన చెబుతారు.  

PREV
19
Guppedantha Manasu 22nd January Episode:నీకు కుర్చీ.. నాకు కుర్చీలో మరదలు పిల్ల.. శైలేంద్రతో రాజీవ్ డీల్..!
Guppedantha Manasu


Guppedantha Manasu 22nd January Episode: శైలేంద్ర, దేవయాణిలు రాజీవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. అసలు ఈ రాజీవ్ ఎవరు అని శైలేంద్ర అడుగుతాడు. దానికి దేవయాణి.. మొత్తం వివరిస్తుంది. వసు కి కష్టాలను పరిచయం చేసిన వాడు ఈ రాజీవ్ అని.. గతంలో వాడు చేసిన దారుణాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంది. వసుధార జీవితంలో ఇంత జరిగిందా..? మరి నాకు ఎందుకు చెప్పలేదు అని శైలేంద్ర అడుగుతాడు. అవసరం రాలేదని చెప్పలేదని దేవయాణి అంటుంది. రాజీవ్ ఇంకా రాలేదని దేవయాణి ఫోన్ చేస్తుంది. అయితే.. వస్తున్నానని దారిలో ఉన్నానని చెబుతాడు. ఇంత ఆలస్యం ఏంటి అని దేవయాణి అడిగితే... తాను తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడినని.. ఇలానే దాక్కొని రావాలి అని చెబుతాడు.

29
Guppedantha Manasu

మరోవైపు... వసుధార రిషిని చూడాలని ఆత్రంగా  ఉంటుంది. వీడియో కాల్ కి సిగ్నల్ లేకపోవడంతో తన తండ్రిని కనీసం వీడియో తీసి పంపమని అడుగుతుంది. సరే అని.. చక్రపాణి వీడియో తీసి.. వసుధారకు పంపుతాడు. ఆ వీడియోలో కూడా రిషి మరింత  నీరసంగా కనిపిస్తాడు. కొంచెం కూడా హుషారుగా కనిపించడదు. దీంతో.. వసుధార ఆ వీడియో చూసి మరింత బాధపడుతుంది. వెంటనే వాళ్ల నాన్న కి ఫోన్ చేసి అదే విషయం అడుగుతుంది. అయితే.. చక్రపాణి మాత్రం అదేం లేదని.. ఇప్పుడు చాలా హుషారుగా ఉంటున్నారని చెబుతాడు. అయితే.. రిషికి జ్యూస్ లు, జావలు తాగించమని వసు చెబుతుంది. ఆయన సరే అంటాడు. ఇక.. వసుని ఇక్కడికి రావద్దని, ఫోన్ కూడా అవసరమైతే తానే చేస్తాను అని చక్రపాణి చెబుతూ ఉంటాడు.

39
Guppedantha Manasu

ఈలోగా అక్కడికి మహేంద్ర, అనుపమలు వస్తారు. ఎవరితో మాట్లాడుతున్నావ్ వసుధార అని మహేంద్ర అడిగితే.. నాన్నతో మాట్లాడుతున్నాను అని చెబుతుంది. అయితే.. రిషి ఎలా ఉన్నాడంట అని మహేంద్ర అడుగుతాడు. మీరే మాట్లాడండి అని..ఫోన్ మహేంద్రకు ఇస్తుంది. దీంతో.. మహేంద్ర.. రిషి గురించి చక్రపాణిని అడుగుతాడు. తండ్రిగా నేను చేయాల్సిన సేవలు.. మీరు చేస్తున్నారని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అయితే.. అల్లుడు గారు తనకు కూడా కొడుకు లాంటివారేనని.. ఆయనను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని, తన కూతురు, అల్లుడు సంతోషంగా ఉండటం కోసం తాను ఏదైనా చేస్తాను అని ఆయన చెబుతారు.

49
Guppedantha Manasu

ఇక, రిషిని వీడియోలో చూసిన తర్వాత వసు బాగా ఏడుస్తుంది. రిషి సర్ ని అలాంటి పరిస్థితిలో వదిలేసి దూరంగా ఉండాల్సి వచ్చింది అని వసు బాధపడుతుంది. వెంటనే.. అనుపమ చూసి ధైర్యం చెబుతుంది. నువ్వు మునుపటి వసుధారలానే ఉండాలని, నువ్వు వీక్ గా ఉంటే.. ఆ శైలేంద్ర మరింత  ఏడిపించాలని చూస్తాడని.. అలా ఉండొద్దని  ధైర్యం చెబుతుంది.

59
Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే..  కారుకి ఓవైపు శైలేంద్ర, మరో వైపు  దేవయాణి నిలపడి ఉంటారు. శైలేంద్ర ఉన్నవైపు రాజీవ్ వచ్చి...ఓ అడ్రస్ చూపించి ఎక్కడ అని అడుగుతాడు. నాకు తెలీదు అని శైలేంద్ర అంటాడు. సరిగా చూసిచెప్పమని మరోసారి అడిగితే.. ఈసారి చూసి అడ్రస్ ఇదే అని శైలేంద్ర అంటాడు. అలా ఇద్దరూ.. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. రాజీవ్ ని చూసి పెద్ద ఎదవలా గా ఉన్నాడు అని శైలేంద్ర మనసులో అనుకుంటే... శైలేంద్రలో విలన్ లక్షణాలు స్పష్టంగా కనపడుతన్నాయని రాజీవ్ బయటకే అనేస్తాడు.

69
Guppedantha Manasu


ఇక.. దేవయాణి రాజీవ్ తో మాట్లాడటం మొదలుపెడుతుంది. తర్వాత.. రాజీవ్.. మీరు నన్ను ఎందుకు కలిశారు అని అడుగుతాడు. దానికి దేవయాణి.. నువ్వే కదా ఫోన్ చేసి కలుద్దాం అన్నావ్ అని అంటుంది. అయితే. మీకు అవసరం లేకుండా ఏ పని చేయరని తనకు తెలుసు అని.. మీకు ఏ అవసరం వచ్చింది అని అడుగుతాడు.

79
Guppedantha Manasu


రాజీవ్ తెలివిని దేవయాణి మెచ్చుకుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోదానిపై మోజు ఉంటుందని.. నీకు వసుధార అంటే పిచ్చి.. నా కొడుక్కి.. ఎండీ సీటు అంటే పిచ్చి అని చెబుతుంది. ఆ ఎండీ సీటు కోసం ఎన్ని దారుణాలు చేయాలో.. అన్నీ చేశాం అని కానీ.. వర్కౌట్ అవ్వడం లేదని చెబుతుంది. చివరిదాకా వచ్చి.. ఆ సీటు మిస్ అయిపోతోందని చెబుతుంది. మొదట ఆ సీటు లో రిషి ఉండేవాడని.. నిందపడేలా చేసి దూరం చేశామని, తర్వాత ఆ సీటులోకి జగతి వచ్చిందని.. ఆమెను ఏకంగా ఈ లోకం నుంచి పంపిచేశామని, అప్పుడైనా ఆ సీటు వీడికి దక్కుతుందని అనుకుంటే.. వసుని రిషి ఎండీ చేశాడు అని దేవయాణి కూడా తమ సమస్య చెబుతుంది.

89
Guppedantha Manasu

దానికి రాజీవ్.. నీకు కుర్చీ కావాలి.. నాకు ఆ కుర్చీలో ఉన్న నా మరదలు పిల్ల కావాలి అని అంటాడు. తర్వాత.. రిషి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని.. తనను ఎక్కడో దాచిపెట్టి వైద్యం చేయిస్తున్నారని శైలేంద్రకు అసలు విషయం చెబుతాడు. అది విని.. శైలేంద్ర షాకౌతాడు. వాడి ఆరోగ్యం బాలేకపోవడం వల్లే.. ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడని..లేదంటే ఎప్పుడో తన ముందుకు వచ్చేవాడు అని శైలేంద్ర అనుకుంటాడు.

రిషిని లేపేస్తే.. నాకు వసుధార విషయంలో లైన్ క్లియర్ అవుతుందని.. నీకు ఎండీ సీటు దక్కుతుందని రాజీవ్ అంటాడు. నీ తమ్ముడు సంగతి నేను చూసుకుంటానని..నువ్వు నాకు నా మరదలిని నాకు అప్పగించు అని డీల్ కుదుర్చుకుంటాడు. ఇద్దరూ చేతులు కూడా కలుపుతారు. ఇక నుంచి తాను రిషి సంగతి చూసుకుంటాను అని  రాజీవ్ అంటాడు.

99
Guppedantha Manasu

ఇక, కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. యూత్ ఫెస్టివల్ ఏర్పాటు చేద్దాం అని... బోర్డ్ మెంబర్స్ వసుతో చెబుతారు. స్టూడెంట్స్ కి పరీక్షలు వచ్చేలోగా..  యూత్ ఫెస్టివల్ చేద్దాం అని అంటారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో వసుధార ఇవన్నీ హ్యాండిల్ చేయగలదా అని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. బోర్డు మెంబర్స్  చెప్పింది కరెక్ట్ అని ఫణీంద్ర వసుధార చెబుతాడు. కానీ.. వసు ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories