బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఫస్ట్ టైమ్‌, నబీల్‌, మోహబూబ్‌ కమ్యూనిటీ ఓట్ల ప్రస్తావన, ఆడియెన్స్ డిమాండ్‌ ఇదే!

First Published | Oct 16, 2024, 7:59 AM IST

బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో కమ్యూనిటీ ఓట్ల గురించి చర్చించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో కులమతాలు, ప్రాంతాలకు, సంఘాలకు అతీతమైనది. ఆర్థికపరమైన ఎక్కువ, తక్కువ అనే భేదాలకు ఆస్కారం లేదు. అందరు సమానమే కాన్సెప్ట్ తోనే రన్‌ అవుతుంది. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఆలోచించాలి? అనే మానసికమైన పరిపక్వత పెంచే షోగా భావిస్తుంటారు. కానీ బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఓ దారుణం చోటు చేసుకుంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో ఓ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. సాధారణ రాజకీయ ఓట్లని తలపించేలా ఓటింగ్‌పై చర్చ జరిగింది. కమ్యూనిటీ ఓట్ల గురించి డిస్కషన్‌ జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఏడో వారం రన్‌ అవుతుంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్లలో నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ సారి నామినేషన్ల ప్రక్రియ చాలా కొత్తగా ఉండటంతో కాస్త డిలే అయ్యింది. పైగా హౌజ్‌మేట్స్ కొంత కంటెంట్‌ క్రియేట్‌ చేయడంతో అది రెండో రోజుకి వెళ్లింది. ఇదిలా ఉంటే ఈ సారి నామినేషన్లలో మెగా చీఫ్‌ అయిన కారణంగా మెహబూబ్‌ నామినేషన్‌కి దూరంగా ఉన్నారు.

కానీ నబీల్‌ ఉన్నారు. ఆయనతోపాటు యష్మి, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, గౌతమ్‌, హరితేజ, ప్రేరణ, మణికంఠ, టేస్టీ తేజ ఉన్నారు. ఈ నామినేషన్ల ప్రకియ పూర్తయిన తర్వాత నబీల్‌, మెహబూబ్‌ల మధ్య షాకింగ్‌ డిస్కషన్‌ జరిగింది. అదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. 
 


నబీల్‌, మెహబూబ్‌ కలిసి నామినేషన్లలో జరిగిన విషయం గురించి చర్చించుకున్నారు. సండే రోజు స్టార్టింగ్‌ స్టార్టింగే ఆ విషయం ఎందుకు లేచిందో అర్థం కాలే నాకు అంటూ నబీల్‌ ఆదివారం ఎపిసోడ్‌ గురించి మాట్లాడారు. ఏదో మెహబూబ్‌ హెల్ప్ చేస్తున్నారని, ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారేమో అని చర్చించుకున్నారు. ఇది వంద శాతం వస్తుందని నాకు తెలుసు అని మెహబూబ్‌ అన్నాడు.

మన గురించి ప్రారంభంలోనే ఇలా అనుకుంటారని, కానీ దారుణమైన ప్లస్ ఏంటో తెలుసా? మనకు కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు దారుణంగా పడతాయి. ఒకటి కచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరం నామినేషన్లలో ఉండకూడదు. ఇద్దరం ఉంటే డివైడ్‌ అవుతాయి. సింగిల్‌గా ఉంటే అన్ని ఒక్కరికే పడతాయని మెహబూబ్‌ వెల్లడించడం విశేషం. 
 

ఈ విషయంపై నెటిజన్లు, ఆడియెన్స్ మండిపడుతున్నాయి. బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఎప్పుడూ, ఎవరూ కులం, మతం, ప్రాంతం ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఈ చర్చ జరగడం పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌ బాస్‌లో కమ్యూనిటీ చర్చేంటి? కులం, మతం, ప్రాంతాలు, సంఘాలకు, వ్యక్తులకు అతీతంగా ఈ షో రన్‌ అవుతుందని డిస్‌క్లెయిమర్ లో ఉన్న నేపథ్యంలో ఆ పాయింట్ ని బిగ్‌ బాస్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అదే సమయంలో నబీల్‌, మెహబూబ్‌లపై యాక్షన్‌ తీసుకోవాలని, వీకెండ్‌లో గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ హౌజ్‌ని కూడా పాలిటిక్స్ గా మార్చేస్తున్నారని మండిపడుతున్నారు. నాగార్జున, బిగ్‌ బాస్‌ దీనిపై యాక్షన్‌ తీసుకోండి అంటూ రచ్చ లేపుతున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడిది నెట్టింట ట్రెండింగ్‌ అవుతుంది. 

మరి దీనిపై బిగ్‌ బాస్‌ రియాక్ట్ అవుతాడా? చర్యలు తీసుకుంటారా? లేక వీకెండ్‌ వరకు నాగార్జున వచ్చేంత వరకు వెయిట్‌ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. కాన ఇప్పుడిది బిగ్‌ బాస్‌పై నెగటివ్ ప్రచారానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇలాంటి మతాల ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

కుల, మతాలకు అతీతంగా ఈ షోని ఆడియెన్స్ తిలకిస్తారు. బాగా ఆడేవారిని ఎంకరేజ్‌ చేస్తారు. కన్నింగ్‌గా కనిపించే వారిని, బాగా ప్రదర్శన ఇవ్వలేని వారిని ఎలిమినేట్‌ చేస్తుంటారు.  ఈ విషయంలో నిర్వహకులు రియాక్షన్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. కానీ దీన్ని మాత్రం నెటిజన్లు పెద్ద రచ్చ లేపుతున్నారు. మరి ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. 

read more: అన్నంత పని చేస్తున్న హరితేజ, టేస్టీ తేజతో కలిసి యష్మిని టార్గెట్‌, పాపం చేసేదేం లేక కన్నీళ్లు

Also read: `ఓజీ` గూస్‌బంమ్స్ అప్‌ డేట్‌, పవన్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. ఫస్ట్ వచ్చేది ఏ సినిమా అంటే?

Latest Videos

click me!