మాస్ జాతర ఓటీటీ రిలీజ్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే రవితేజ సినిమా స్ట్రీమింగ్

Published : Nov 15, 2025, 10:02 AM IST

Mass Jathara OTT Release : వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. రీసెంట్ గా మాజ్ జాతర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి.. మరోసారి దెబ్బతిన్నాడు. మాస్ ఆడియన్స్ ను నిరాశపరిచిన ఈసినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? 

PREV
14
రవితేజ్ వరుస డిజాస్టర్స్

వరుసగా డిజాస్టర్స్ ను ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ. ఎన్నిప్రయత్నాలు చేసినా.. ఫ్లాప్స్‌ నుంచి బయటపడలేకపోతున్నాడు. రకరకాల జానర్స్ ను ట్రై చేస్తున్న రవితేజ.. వరుస డిజాస్టర్స్ ను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇక మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్‌గా చేసిన సినిమా మాస్ జాతర. ఈ సినిమాతో మరో డిజాస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సీనియర్ హీరో. ఈ చిత్రం రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచి థియేటర్లలో పెద్దగా స్పందన దక్కించుకోలేకపోయింది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త బాగానే ఉన్నప్పటికీ, ఆడియన్స్‌కు చాలా రొటీన్ అనిపించి ఫ్లాప్‌గా మిగిలింది.

24
మాస్ జాతర బిజినెస్

గతంలో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలకు 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది . కానీ మాస్ జాతర సినిమాకు కేవలం 20 కోట్ల వరకు మాత్రమే బిజినెస్ జరిగాయి. ఇంత తక్కువ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటలేకపోయింది. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ షేర్ 11 కోట్ల రూపాయలు మాత్రమే. దాంతో నిర్మాతలకు దాదాపు 9 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

34
మాస్ జాతర ఓటీటీ రిలీజ్ డేట్

ఇక మాస్ జాతర ఓటీటీ రిలీజ్ పై తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఈక్రమంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఈసినిమా ఓటీటీకి రానున్నది. అయితే, సినిమా రిజల్ట్ వల్ల.. ఓటీటీ రిలీజ్ ను అనుకున్న డేట్ కంటే ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా మాస్ జాతర సినిమాను ఈ నెల 20వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. థియేటర్లలో పెద్ద స్పందన లేకపోయినప్పటికీ, ఓటీటీ ద్వారా ఆడియన్స్ కు చేరువవ్వాలని చూస్తున్నారు టీమ్.

44
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా

మాస్ జాతర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నవీన్‌ చంద్ర విలన్ గా ఆకట్టుకున్నాడు. వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్, నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేశ్, హైపర్‌ ఆది, అజయ్‌ ఘోష్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్లాప్ టాక్ తెచ్చకుంది.

Read more Photos on
click me!

Recommended Stories