నయనతార కాదు, ఇకపై లేడీ సూపర్‌స్టార్ బిరుదు అందుకున్న నటి ఎవరో తెలుసా?

Published : Oct 04, 2025, 02:56 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్  నయనతార తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దని చెప్పి ఆ బిరుదును వదులుకోగా, ఇప్పుడు ఆ బిరుదు మరో హీరోయిన్ కు  దక్కింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? 

PREV
15
Next Lady Superstar

లేడీ సూపర్‌స్టార్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది నయనతార. కొన్నేళ్లుగా ఆమె కోసం అభిమానులు ఆ బిరుదును వాడుతున్నారు. అయితే, కొన్ని నెలల క్రితం తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దని నయన్ ప్రకటించారు. దీంతో తదుపరి లేడీ సూపర్‌స్టార్ ఎవరనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఈ జాబితాలో సాయి పల్లవి, అనుష్క పేర్లు వినిపించగా, ఇప్పుడు ఓ ప్రముఖ నటి లేడీ సూపర్‌స్టార్ బిరుదును దక్కించుకున్నట్టు సమాచారం.

25
కొత్త లేడీ సూపర్ స్టార్

ఆ నటి మరెవరో కాదు.. 'కూలీ' సినిమాలో విలన్‌గా నటించి పాపులర్ అయిన కన్నడ నటి రచితా రామ్. నిన్న ఆమె తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కన్నడ సినిమాల అప్‌డేట్స్ విడుదలయ్యాయి. అందులో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 'ల్యాండ్ లార్డ్' సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అందులో నటి రచితా రామ్ పేరు ముందు 'లేడీ సూపర్‌స్టార్' అని రాసి ఉంది.

35
అభిమానులతో కలిసి

అంతేకాదు, నటి రచితా రామ్ తొలిసారిగా తన ఇంటి ముందు అభిమానులతో కలిసి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. వేడుకల తర్వాత ఆమె మాట్లాడుతూ.. 'రెండు సంవత్సరాలుగా నేను పుట్టినరోజు జరుపుకోలేదు. నన్ను ఇష్టపడే వారితో ఆనందాన్ని పంచుకోవాలనిపించింది. అందుకే ఈసారి పుట్టినరోజు జరుపుకున్నాను' అని చెప్పారు.

45
రజనీకాంత్ ఫోన్ చేసి

రచితా మాట్లాడుతూ  ‘’ కూలీ లో నా నటన చూశాక, రజనీకాంత్ గారే ఫోన్ చేసి అభినందించడం నాకు దక్కిన గొప్ప బహుమతి. ఆయన మాటలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. 'కూలీ' సినిమా తర్వాత ఇతర భాషల నుంచి చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఎక్కువగా నెగెటివ్ పాత్రలే వస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నేను నటిస్తున్నాననే వార్త నిజమే. వివరాలు తర్వాత చెబుతాం.'' అని ఆమె అన్నారు. 

55
త్వరలో పెళ్లి

‘’నేను రాజకీయాల్లోకి రాను, నాకు, రాజకీయాలకు సరిపడదు, సినీ పరిశ్రమలోనే బిజీగా ఉన్నాను, కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తాననేది కేవలం పుకారు మాత్రమే,  త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది ప్రేమ వివాహం కాదు. పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. అని రచితా రామ్ చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories