Karthika Deepam 2 Today Episode: కాశీని ఇంట్లో నుంచి పోరా అన్న స్వప్న- జ్యోకు పారు వార్నింగ్

Published : Feb 04, 2026, 08:29 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 4వ తేదీ)లో దశరథ మాటలకు ఎమోషనల్ అవుతారు దీప, కార్తీక్, కాశీని ఇంట్లో నుంచి పోరా అంటుంది స్వప్న. చేసిన అవమానం చాలు అంటుంది కాంచన. భయంతో వణికిపోతుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో.. సుమిత్ర, నేను, నా చెల్లి కలిసి నీ బిడ్డతో ఆడుకుంటూ కాలం గడిపేస్తాం. అంతకంటే సంతోషం ఏముంటుంది రా అంటాడు దశరథ. మామయ్య మాటలకు లోలోపలే బాధపడతాడు కార్తీక్. ఈ రోజు కాస్త త్వరగా ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాం అంటాడు కార్తీక్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్లచ్చు. ప్లేసు బాగుంది అన్నారు కదా.. కాసేపు కూర్చొని వెళ్లండి అని చెప్పి వెళ్లబోతాడు దశరథ.

మళ్లీ వెనక్కి తిరిగి బిడ్డకు ప్లాబ్లం ఏం లేదు కదా దీప.. మేం బాధపడతామని వీడు మాతో చెప్పడు. నువ్వు వీడిలా ఉండకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా.. బిడ్డ జాగ్రత్త.. అని చెప్పి వెళ్లిపోతాడు దశరథ. కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్పకూలిపోతారు భార్యాభర్తలు.

28
అది నీ కడుపులో పుట్టాల్సింది

మరోవైపు స్వప్నను మీరే కన్విన్స్ చేయాలని అత్తను, మామను రిక్వెస్ట్ చేస్తాడు కాశీ. కాస్త ఆగురా.. విడాకులు కావాలని అడిగింది కదా.. దాన్ని ఎలా ఒప్పించాలో ఆలోచించనివ్వు అంటుంది కాంచన. నువ్వు చెప్పు కావేరి. నువ్వు చెప్తే స్వప్న వింటుంది అంటుంది కాంచన. అది మొండిది అక్క. నిజానికి అది నీ కడుపులో పుట్టాల్సింది అంటుంది కావేరి. ముందైతే దాన్ని పిలువు అంటుంది కాంచన. మీరు ఒక తండ్రిగా ఏం చెప్పాలో అది చెప్పండని శ్రీధర్ తో చెప్తుంది కాంచన.

38
తేల్చి చెప్పిన స్వప్న

పిలిచారా.. పెద్దమ్మ అంటూ బయటకు వస్తుంది స్వప్న. నీ గురించి ఆలోచిస్తూ మేమంతా ఇక్కడ కూర్చొంటే నువ్వు వెళ్లి లోపల కూర్చొంటే అర్థమేంటీ? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాదా? మీ అన్నావదినలను పిలవమంటావా? అని అడుగుతుంది కాంచన. ఇప్పుడు వాళ్లెందుకు. అయినా నాకు ఇష్టం లేని పనిని మీరు ఎందుకు చేయమంటున్నారు. ఈ మనిషితో నేను కలిసి ఉండలేను అని తేల్చి చెప్తుంది స్వప్న.

48
ఇంట్లో నుంచి పోరా..

భార్యాభర్తల బంధం అంటే నీకు నచ్చినప్పుడు మోసి, నచ్చనప్పుడు దించేయడం కాదు.. జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్తుంది కాంచన. ఒకసారి కాశీని చూడు, నీ కోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. వాడు తప్పు తెలుసుకున్నాడు. నువ్వు తనని క్షమించు. వెంటనే క్షమించలేకపోతే కాస్త టైమ్ తీసుకో. నువ్వు వాడిని నమ్మినప్పుడే మళ్లీ నీ జీవితంలోకి ఆహ్వానించు అని స్వప్నతో చెప్తుంది కాంచన.

మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ సారీ పెద్దమ్మ. నేను కాశీతో కలిసి ఉండలేను అంటుంది స్వప్న. నాకు నువ్వు కావాలి స్వప్న. నేను మారిపోయానని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నీ కాళ్లు పట్టుకోమంటావా? అని అడుగుతాడు కాశీ. ముందు నువ్వు ఇంట్లో నుంచి పోరా.. అని కాశీపై గట్టిగా అరుస్తుంది స్వప్న. నాకు విడాకులు కావాలి. ఇప్పించండి అని ఆవేశంగా చెప్తుంది. ఆ మాటతో కోపంగా వెళ్లిపోతాడు కాశీ. జరిగిన అవమానం చాలు అని కాంచన కూడా వెళ్లిపోతుంది.

58
నీకు ముందే తెలుసా?

మరోవైపు జ్యోత్స్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పారు. జ్యోత్స్న రాగానే.. బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చావా అని అడుగుతుంది. అంటే వాళ్లు నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారని నీకు ముందే తెలుసా? తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది జ్యోత్స్న. మీ తాత, డాడీని పక్కన పెట్టుకొని ఎలా చెప్పను అంటుంది పారు. మెసేజ్ చేయచ్చు కదా అంటుంది జ్యో. నాకు ఆ ఐడియా రాలేదే అంటుంది పారు. 

68
దాసు అంటే ప్రాణం

సరే కానీ దాసు గురించి నీకు ఏమైనా తెలుసా? అని అడుగుతుంది పారు. నాకు తెలియదు గ్రానీ అని పారును ఏమార్చే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. నాకు నా కొడుకు దాసు అంటే ప్రాణం. వాడికి ఏదైనా అయితే నేను ఏం చేయడానికైనా రెడీ అంటుంది పారు. దాసు విషయం గ్రానీకి తెలియకుండా చూసుకోవాలి. తెలిస్తే నన్ను చంపేస్తుందని అనుకుంటుంది జ్యో.

78
బాధలో దీప, కార్తీక్

మరోవైపు కార్తీక్, దీప అక్కడే కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. నువ్వు ఏం మాట్లాడవేంటి బావ అని అడుగుతుంది దీప. ఏం మాట్లాడమంటావు. నువ్వు తల్లి అయ్యావ్ అని తెలిసిన దగ్గరినుంచి నా బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. అత్తను కాపాడాలంటే బిడ్డను వదులుకోవాలా? ఎలా దీప? వదులుకోవడానికి ఇదేమైనా వస్తువా, మన ప్రాణం అంటాడు కార్తీక్.

88
ఇక్కడే ఉంటే గుండె ఆగిపోతుంది

ఇంటికి వెళ్దాం బావ. నాకు బ్రెయిన్ పని చేయడం లేదు. తల తిరుగుతోంది. పడిపోయేలా ఉన్నాను. ఇక్కడే ఉంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అని భయమేస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. భార్యను ఓదార్చి.. ఇంటి దగ్గర ఎవరికీ ఏం చెప్పకు? ఏం జరగనట్లే ఉండమని దీపతో చెప్తాడు కార్తీక్. నువ్వు ఉండగలవా అని కార్తీక్ ని అడుగుతుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories