Gunde Ninda Gudi Gantalu: మరోసారి మనోజ్ ని వెర్రివాడిని చేసి ఆడుకున్న రోహిణీ, చింటూ దగ్గరకు బాలు, మీనా

Published : Feb 03, 2026, 09:00 AM IST

Gunde Ninda Gudi Gantalu: సుగుణమ్మ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. ఆమె కోసం రోహిణీ ఆస్పత్రిలోనే ఉంటుంది. అందుకోసం మనోజ్ కి అబద్ధం చెబుతుంది. మరి, మనోజ్ కు అనుమానం రాకుండా ఎలా తప్పించుకుందో టీవీ కంటే ముందుగా మీ కోసం... 

PREV
14
Gunde Ninda Gudi Gantalu

రోడ్డు మీద బాలు, మీనా సరదాగా గొడవపడుతూ ఉంటారు. బాలు కారులో ఉన్న వ్యక్తి మాత్రం తనకు పెళ్లి చూపులకు ఆలస్యం అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. బాలు, మీనా మాత్రం అతన్ని పట్టించుకోకుండా గొడవ పడతారు. వీరి గొడవ చూసి ట్రాఫిక్ పోలీస్ వస్తాడు. రాంగ్ రూట్ లో వచ్చినందుకు ట్రాఫిక్ పోలీసు బాలుకి రూ.500 ఫైన్ వేస్తాడు. దీంతో.. మీనా వద్దు అని బతిమిలాడుతుంది. ఎందుకు వద్దు అని ట్రాఫిక్ పోలీసు అడిగితే.. ఆయన మా ఆయనే సర్ అని చెబుతుంది. దీంతో.. ఇద్దరినీ తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆ పెళ్లి చూపుల అబ్బాయి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

24
అబద్ధం చెప్పి దొరికిపోయిన రోహిణీ..

ఆస్పత్రిలో రోహిణీ.. వాళ్ల అమ్మకు సేవలు చేస్తూ ఉంటుంది. ఇక.. వాళ్ల అమ్మని చూసుకోవడానికి ఎవరైనా మనిషి ఉంటే చూడమని ఓ నర్సుని అడుగుతుంది. అయితే.. ఆ నర్సు తానే చూసుకుంటాను అని చెబుతుంది. వెంటనే మనిషి దొరికినందుకు రోహిణీ సంతోషిస్తుంది. ఆ తర్వాత.. ఇంటి నుంచి వచ్చి చాలా సేపు అయ్యింది.. మనోజ్ కి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది. ఈలోగా.. మనోజ్ కే.. రోహిణీ ఎక్కడికి వెళ్లింది అనే డౌట్ వస్తుంది. రోహిణీ ఫోన్ చేసేలోగా.. మనోజ్ ఫోన్ చేస్తాడు.

‘ ఎక్కడున్నావ్..షాప్ కి రాకుండా?’ అని మనోజ్ అడుగుతాడు. ‘ చిన్న పని ఉంటే బయటకు వచ్చాను.. నీకు చెబుదాం అంటే.. నువ్వు అప్పటికే షాప్ కి వెళ్లిపోయావ్ ’ అని అంటుంది. ‘ నీకు తెలుసా... ఈరోజు మన సేల్స్ చాలా పెరిగాయి’ అని చెబుతాడు. మన బిజినెస్ ఇలానే డెవలప్ అవ్వాలని అని రోహిణీ అంటుంది. ఇంతకీ ఎక్కడ ఉన్నావ్ అంటే.. ‘విద్య దగ్గర ఉన్నాను’ అని చెబుతుంది. అలా రోహిణీ చెప్పగానే.. మనోజ్ కి విద్య కనపడుతుంది. దీంతో.. మనోజ్ కి అనుమానం వస్తుంది. రోహిణీకి డౌట్ వచ్చి.. విద్యకు ఫోన్ చేసి.. నువ్వు షోరూమ్ కి వెళ్లకు అని చెబుతుంది. కానీ.. నేను ఆల్రెడీ షాప్ లోనే ఉన్నాను అని చెబుతుంది. దీంతో... రోహిణీలో కంగారు మొదలౌతుంది.మనోజ్ వెళ్లి.. విద్యను ఏదో అడిగేలోగా... వాష్ రూమ్ అని అబద్ధం చెప్పి.. అక్కడి నుంచి తప్పించుకుంటుంది.

ఉదయం రోడ్డు మీద జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ మీనా చాలా కోపంగా ఉంటుంది. రెండు గ్లాసులు పట్టుకొని.. బాలుని కొట్టినట్లు ఆ గ్లాసులను కొడుతుంది.బాలు నిజంగా తనకు దెబ్బలు తగిలినట్లు యాక్ట్ చేస్తాడు. తర్వాత.. మీనా కోపం పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీనా మాత్రం.. గొడవ సాగదీస్తూనే ఉంటుంది. కాసేపటికీ ఇద్దరూ కూల్ అయిపోతారు. బాలు.. మీనా కోసం హల్వా తీసుకొస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. మాటల సందర్భంలో.. చింటూ గుర్తుకు వస్తాడు. వాళ్ల ఇంటికి వెళ్లి.. చింటూ వాళ్ల అమ్మమ్మతో మాట్లాడదాం అని అనుకుంటారు.

34
మరోసారి మనోజ్ ని బకరా చేసిన రోహిణీ..

రోహిణీ.. భయపడుకుంటూ ఇంటికి వెళ్తుంది. అప్పుడే మనోజ్ ఎదురౌతాడు. కోపం వచ్చిందా అని అడుగుతుంది..‘ కోపమా నాకా? ఎందుకు నాకు జస్ట్ ఒక అబద్ధం చెప్పావ్ అంతే కదా’ అని మనోజ్ వెటకారంగా మాట్లాడతాడు. అయితే.. రోహిణీ తెలివిగా.. మనోజ్ ని బెడ్రూమ్ కి తీసుకొని వెళ్తుంది. ‘ నేను చెప్పేది కూల్ గా విను’ అని రోహిణీ అంటుంది. ‘ నువ్వేమి చెబుతావ్?. నేను ఏమి వినాలి? నా రోహిణీ నా దగ్గర ఏమీ దాచదు అనుకునేవాడిని. కానీ.. నువ్వు.. షోరూమ్ పెట్టకముందు వరకు నేను నా పరిస్థితిని బట్టి అబద్ధం చెప్పి ఉండొచ్చు.. కానీ షోరూమ్ పెట్టాక అబద్ధం చెప్పలేదు. చివరికి మీనా నగలు అమ్మేసిన విషయం అమ్మ నీకు చెప్పొద్దు అన్నా కూడా చెప్పాను. ఎందుకంటే.. మన మధ్య అబద్ధం, దాపరికం లాంటివి ఉండకూడదు అని, కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఎవరిని కలవడానికి వెళ్లావ్? ఇదే మొదటిసారా? ఇంతక ముందు కూడా ఇలానే చేశావా? చెప్పు రోహిణీ.. ’ అంటూ నిలదీస్తాడు.

ఇక రోహిణీ.. అయిపోయిందా నేను మాట్లాడొచ్చా అంటూ.. ఏదో మాల బయటకు తీసి చూపిస్తుంది. ఏంటిది? అని మనోజ్ అడిగితే.. మహిమగల మాల.. నీ కోసమే కొన్నాను అని చెబుతుంది. నా కోసమా అని మనోజ్ అడిగితే.. ‘ పక్క ఊరు స్వామిజీ... చాలా మహిమగల వాడంట.. మా క్లైంట్ చెబితే వెళ్లాను. ఆయన మంత్రించి ఇచ్చిన ఈ మాల ధరిస్తే.. అంతా మంచి జరుగుతుందట. వృత్తి, వ్యాపారాలు అన్నీ లాభాల బాట పడతాయంట. అందుకే వెళ్లాను’ అని చెబుతుంది. ‘ దీని కోసమే వెళితే.. విద్యను కలవడానికి వెళ్లాను అని ఎందుకు అబద్ధం చెప్పావు’ అని మనోజ్ అడిగితే.. ‘ సర్ ఫ్రైజ్ ఇద్దామని అనుకున్నాను.. అది నీ దగ్గరకు వచ్చి నాకు షాక్ ఇచ్చింది’ అని రోహిణీ అంటుంది. నువ్వు ఇలాంటివి నమ్మవు కదా.. మనోజ్ అడిగితే..‘ నువ్వు రంగు రంగుల డ్రెస్సులు వేసుకోవడం వల్ల మన బిజినెస్ బాగా డెవలప్ అయ్యింది.. అందుకే నా వంతు ప్రయత్నం చేద్దాం అని ఇది తెచ్చాను’ అని రోహిణీ చెబుతుంది. కానీ మనోజ్ నమ్మడు. దీంతో.. నమ్మించడానికి ఏవేవో మాయ మాటలు చెబుతుంది.మనోజ్ ని నమ్మించడానికి స్వామిజీకి ఫోన్ చేస్తాను అని చెప్పి.. విద్యకు ఫోన్ చేస్తుంది. కానీ.. మనోజ్ ఆ ఫోన్ మాట్లాడకుండానే.. రోహిణీని నమ్మేస్తాడు. అంతేకాదు.. రోహిణీ ఇచ్చిన మాలను దేవుడి దగ్గర పెట్టి.. ఉదయాన్నే వేసుకుంటాను అని చెబుతాడు. దీంతో.. రోహిణీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.మనోజ్ పక్కకు వెళ్లగానే విద్యకు ఫోన్ చేసి.. తిట్టేస్తుంది.

44
చింటూ దగ్గరకు బాలు, మీనా..

మరుసటి రోజు ఉదయాన్నే కిచెన్ లో రవి ఏదో వంట చేస్తూ ఉంటాడు. ఆ వంట రుచి చూసి అద్భుతంగా ఉందని పొగిడిన శ్రుతి.. తీసుకువెళ్లి.. మీనాకి రుచి చూపిస్తుంది. ఇద్దరూ రవిని పొగుడుతూ ఉంటారు. చింటూ దగ్గరకు వెళ్లేటప్పుడు.. ఇవి తీసుకువెళ్లండి అని రవి అంటాడు. అప్పుడే.. ప్రభావతి రావడంతో.. నాటకం మొదలుపెడతారు. గొడవ పడుతున్నట్లు నాటకం ఆడతారు. ప్రభావతి వచ్చి.. శ్రుతికి సపోర్ట్ చేసి మీనాని తిట్టి.. అక్కడి నుంచి పంపించేస్తుంది. ప్రభావతిని కాకా పట్టడానికి.. తన చేతిలో ఉన్న స్వీట్ ఇచ్చి.. మీకోసమే స్పెషల్ అని చెబుతుంది.కొన్నింటిని డబ్బాలో పెట్టుకొని మరీ వెళ్తుంది. పూల కొట్టుదానికి మాత్రం ఇవ్వొద్దు అని చెప్పి మరీ వెళ్తుంది. ప్రభావతి వెళ్లిపోయిన తర్వాత.. వీళ్లు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు.అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో.. బాలు, మీనా సుగుణమ్మ ఇంటికి వస్తారు. వచ్చి చింటూని మేం దత్తత తీసుకుంటాం అని బాలు, మీనా అడుగుతారు. అదే విషయం సుగుణమ్మ.. ఫోన్ చేసి రోహిణీకి చెబుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories