Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి పెట్టిన చిచ్చు.. ఉప్పు, నిప్పులా గొడవ పడిన మీనా, శ్రుతి..!

Published : Jan 30, 2026, 08:45 AM IST

Gunde Ninda Gudi Gantalu: మీనా, శ్రుతిలను విడగొట్టాలని ప్రభావతి ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ లో భాగంగా శ్రుతి తల్లిని బాగా రెచ్చగొట్టింది. మరి, ఆమె ఏం చేసిందో నేటి ఎపిసోడ్ టీవీకంటే ముందుగా మీ కోసం.. 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

శ్రుతి మీద.. వాళ్ల అమ్మకు రోహిణీ, ప్రభావతి చాలా ఎక్కిస్తారు. కానీ, ఆవిడ ఆవేమీ పట్టించుకోకుండా.. ఆమె మరో ప్లాన్ వేసుకుంటుంది. శ్రుతి ఇలానే ఇరిటేట్ చేస్తే వాళ్లే వెళ్లగొడతారు అనుకొని..మీ చావు మీరు చావండి అనేసి వెళ్లిపోతుంది.‘ కూతురికి బుద్ధి చెప్పమని పిలిస్తే.. మీ చావు మీరు చావండి అనేసి వెళ్లిపోయిందేంటి?’ అని కామాక్షి అంటుంది. ‘ శ్రుతిని ఈవిడ తిడితే.. మీనాని దూరం పెడుతుందని అనుకున్నాను.. వాళ్లిద్దరికి గొడవలు అవుతాయని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఏం చేసేది’ అని ప్రభావతి అంటుంది. ఈలోగా రోహిణీకి ఫోన్ వస్తుంది. క్లైంట్ కాల్ అని అబద్ధం చెప్పి.. పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. ‘ కళ్యాణీ నా మాట్లాడేది.. ఇక్కడ ఒక ఆవిడ పడిపోయింది.. ఆవిడ పేరు సుగుణమ్మ అంట’ అని చెబుతారు.. ‘ మా అమ్మ.. ఎప్పుడు? ఎక్కడ ?’ అనేసి.. కంగారుగా.. రోహిణీ వెళ్లిపోతుంది.

ఇక పిల్లలు అందరినీ డ్యాన్స్ చేయడానికి పిలుస్తారు. పిల్లలు అందరూ వస్తారు. కానీ.. ఆ ప్రేమ జంట మాత్రం రారు. వేరే గదిలో ఉంటారు. వాళ్ల బ్యాగులు మాత్రం అక్కడే ఉంటాయి. దీంతో.. ప్రేమ్ కుమార్, రాధికలను ప్రభావతి పిలుస్తుంది. వాళ్లిద్దరూ ఒకరి తర్వాత మరొకరు నెమ్మదిగా వస్తారు.దొరికిపోయాం అని రాధిక భయపడుతుంటే...ఏమీ కాదులే నేను చూసుకుంటాను అని ప్రేమ్ కుమార్ అంటాడు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాం అని వాళ్లు చెప్పగానే ప్రభావతి నమ్మేస్తుంది. కామాక్షికి అనుమానం వచ్చి ప్రశ్నలు అడిగినా.. ప్రభావతి పట్టించుకోదు.

25
మీనాని తక్కువ చేసి మాట్లాడిన శోభన..

ఇక.. మీనా తన ఇంటి ముందు ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే.. శ్రుతి తల్లి శోభన అక్కడికి వస్తుంది.మీనాని పిలుస్తుంది. బాగున్నారా అని మీనా చాలా మర్యాదగా అడిగితే.. ‘ నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బాగుంటారు?’ అని అంటుంది. ఆ మాటకు మీనా షాక్ అవుతుంది.‘ నేనా.. నేనేం చేశాను.. మీ బాగుకు అడ్డు తగులుతున్నానా?’ అని మీనా అడుగుతుంది. ‘ నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా?’ అని శోభన అడుగుతుంది. ‘ శ్రుతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట.. నీలాంటి వాళ్లతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది.. ఏం నేర్పిస్తున్నావ్ దానికి.. దాని కాపురం ఎందుకు చెడగొడుతున్నావ్?’ అని శోభన ప్రశ్నిస్తుంది. ‘ నేను ఎవరి కాపురాలు కూల్చాలని అనుకోవడం లేదు, అయినా శ్రుతి ఏమీ చిన్న పిల్ల కాదు.. మంచి చెడు అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయి.. అలాంటి అమ్మాయి మీలాంటి వాళ్ల కడుపులో ఎలా పుట్టిందా అని ఆశ్చర్యంగా ఉంది.. చూడండి.. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు.. శ్రుతి, నేను సొంత అక్కా చెల్లెళ్లు లా ఉంటున్నాం’ అని మీనా చెబుతుంది. ‘ ఏంటి..? నువ్వు శ్రుతికి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడ? మా స్టేటస్ ఎక్కడ? పూలు అమ్ముకునేదానివి నువ్వు నా కూతురికి అక్కవా?’ అని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ‘ కొంచెం మర్యాదగా మాట్లాడండి..పూలు అమ్ముకునే వాళ్లు అంటే అంత చులకనా? నిజమే.. నేను పూలు అమ్ముకునేదాన్నే కానీ, నా పని చూసుకొని పూతాను.. రోడ్డు మీద చిల్లరగా గొడవలు పట్టుకోను’ అని మీనా అంటుంది.

అయితే.. శోభన మాటలకు మీనా ఫ్రెండ్ కి కోపం వచ్చి.. దుమ్ము దులుపుతుంది. కానీ శోభన మాత్రం.. ‘ నా కూతురిని వెనకేసుకొని డబ్బు లాగాలని చూస్తున్నావా?’ అని అంటుంది. ‘ ఇప్పటి వరకు ఎంత లాగానో.. వెళ్లి మీ కూతురినే అడగండి’ అని మీనా కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది. ‘ నా కూతురిని అడగేదేంటి? ఆ రోజు మండపంలో నా కూతురి హారం దొంగలిస్తూ దొరికిపోయావ్ కదా.. మీ బుద్ధి నాకు తెలీదా’ అని అంటే... మర్యాదగా మాట్లాడమని మీనా అంటుంది. ‘ చూడు.. నీ లాంటి వాళ్లతో గొడవ పెట్టుకోవడానికి నేను రాలేదు.. నా కూతురు కాపురం కోసం వచ్చాను’ అని శోభనా అంటుంది. ‘ అసలు.. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ..?’ అని మీనా అడిగితే..‘ మీ అత్త చెప్పింది.. నాకు ఫోన్ చేసి పిలిపించి..కామాక్షి ఇంట్లో కూర్చో పెట్టి మరీ చెప్పింది’ అని అంటుంది.. దీంతో.. విషయం మొత్తం మీనాకు అర్థమౌతుంది. కానీ శోభన ఆపదు. ‘నీ భర్తకు తాగుడుకు డబ్బులు కావాలంటే చెప్పు.. ముష్టి పడేసినట్లు పడేస్తాను’ అని అంటుంది. బాలుని అనడంతో మీనాకు కోపం వచ్చి..‘ ఇక చాలు.. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. నువ్వు ఎంత? నీ లెక్క ఎంత? ఇదే మాట ఇంకెవరైనా అని ఉంటేనా?’ అని మీనా ఆపేస్తుంది.

‘ ఏం చేస్తావ్?’ అని శోభన అడిగితే..‘ శ్రుతి మీద యాసిడ్ పోయాలని చూసిన వాళ్లను రాళ్లతో ఎలా కొట్టానో.. అలా కొట్టేదాన్ని.. ముక్కు, ముఖం ఏకం చేసేదాన్ని..’ అని బదులిస్తుంది. మీనా ఫ్రెండ్ కూడా శోభన దుమ్ము దులుపుతుంది. ఇటుక రాయి ఇచ్చి కొడతాను అని చెప్పడంతో.. ఇగో హర్ట్ అయ్యి శోభన అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

శోభన అలా వెళ్లడం.. బాలు ఇలా వస్తాడు. ‘ ఆవిడ ఎందుకు వచ్చింది?’ అని అడుగుతాడు. కానీ.. మీనా సరిగా సమాధానం చెప్పదు.. అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ.. పక్కన ఉన్న మీనా ఫ్రెండ్ బయట పెడుతుంది. ఆ మాటలకు బాలు కి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే వెళ్లి ఆమె తాడోపేడో తేల్చుకుందాం అని బాలు అంటే.. మీనా వద్దు అని ఆపుతుంది. ‘ నా పెళ్లాన్ని అన్ని మాటలు అంటే నేను ఊరుకోను’ అని బాలు అంటాడు ‘ నేను కూడా ఊరుకోలేదు.. గట్టిగానే సమాధానం చెప్పాను’ అని మీనా చెప్పినా బాలు వినడు.. నేను చెప్పే విధంగా సమాధానం చెబితే.. జీవితంలో ఆవిడ నీ జోలికి రాదు అని.. మీనాని తీసుకువెళ్లడానికి బాలు ట్రై చేస్తాడు. మీనా ఆపడానికి ఎంత ప్రయత్నించినా..బాలు వినకుండా మీనాని కారు ఎక్కిస్తాడు.

35
శ్రుతిపై బాలు సీరియస్..

సీన్ కట్ చేస్తే... ఇంట్లో ప్రభావతి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. ‘ శ్రుతి వాళ్ల అమ్మను రెచ్చ గొడితే.. ఆవిడ శ్రుతిని రెచ్చగొడుతుంది.. శ్రుతి వచ్చి మీనాతో గొడవపడుతుంది.. ఇక జీవితంలో శ్రుతి.. మీనాకి సపోర్ట్ చేయదని మాస్టర్ ప్లాన్ వేశాను.. ఎగిరితన్నిపోయింది వియ్యపురాలు’ అని ప్రభావతి ఇంట్లో తెగ ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే రవి, శ్రుతి ఇంటికి వస్తారు. తొందరగా వచ్చారేంటి? అని ప్రభావతి అడగగానే.. శ్రుతి చాలా సీరియస్ అవుతుంది. శ్రుతి యాక్షన్ కి ప్రభావతి షాక్ అవుతుంది. శ్రుతి లోపలికి వెళ్లిపోగా.. ప్రభావతి రవిని నిలదీస్తుంది. తాను శ్రుతి వాళ్ల అమ్మతో మాట్లాడిన విషయం మొత్తం రవికి చెబుతుంది. ఈ లోగా.. మీనాని తీసుకొని బాలు సీరియస్ గా ఇంటికి వస్తాడు.

‘ లేచిపోయినోడా.. డబ్బుడమ్మ ఎక్కడ ?’ అని బాలు అడుగుతాడు. నీకు ఏమైంది అని రవి అంటాడు. ‘ ఏది జరిగినా అందరూ నా మీదే పడతారు’ అని మీనా అంటే.. ‘ నీకు ఏమైంది వదినా?’ అని రవి అడుగుతాడు.‘ ఏమైందో.. శ్రుతినే పిలువు చెబుతాను.. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే’ అని మీనా అంటుంది. ‘ అందరికీ నా పెళ్లమే కనపడుతుందా? ఈవిడ( ప్రభావతి) అన్నదంటే ఒక అర్థం ఉంది.. ఇన్ని ఏళ్లు వచ్చినా ఈవిడకు మెదడు పెరగలేదు.. నీ భార్య మీనాతో బానే ఉంటుందిగా.. వాళ్ల అమ్మ మన అమ్మలా తయారైందేంటి?’ అని బాలు రవిని అడుగుతాడు. ‘ ఇవన్నీ కాదు.. తాడో పేడో తేల్చుకోవాలి’అని మీనా అంటుంది. ‘ ఏమైంది? అందరూ శ్రుతి మీద సీరియస్ అవుతున్నారు?’ అని రవి అడుగుతాడు ‘కంపెనీ ఒక రకంగా తయారు చేస్తే.. వస్తువు ఇంకోలా తయారౌతుందా? తల్లిని బట్టే కూతురు అని మీనా అంటుంది. ‘ అయితే.. నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది అని ప్రభావతి మనసులో అనుకొని బయటకు మాత్రం.. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు?’ అని అడుగుతుంది. ‘ ఇది నీకు అనవసరం ’ అని చెప్పి..శ్రుతిని నిలదీద్దాం.. అని మీనాని తీసుకొని బాలు పైకి వెళతారు. అక్కా-చెల్లెల్లా ఉండేవారు.. వీరి మధ్య ఏం జరుగుతుంది అని రవి కంగారు పడతాడు. అతను కూడా వాళ్ల వెనకే వెళతాడు.

45
ప్రభావతి ఆనంద తాండవం..

ప్రభావతి మాత్రం చాలా సంతోషిస్తుంది. బాలు, రవి, శ్రుతి, మీనా గొడవ పడుతున్నట్లు మాటలు వినపడుతుంటే.. ప్రభావతి కింద కూర్చొని సంబరపడిపోతూ ఉంటుంది. ఆనందంలో ఆనంద తాండవం చేస్తుంది. ఆమె తెగ ఆనందపడుతుంటే.. సత్యం వస్తాడు. ఏం జరుగుతోంది అంటే.. బాలు, మీనా, శ్రుతి, రవి గొడవ పడుతున్నారు అని చెబుతుంది. గొడవ ఎందుకు ఆపలేదు అని సత్యం అడిగితే.. వాళ్ల మధ్యలో నేను దూరను అని ప్రభావతి అంటుంది. ఈ లోగా.. రవి, శ్రుతితో గొడవ పడి.. మీనా, బాలు కిందకు వస్తారు. ఏంటి విషయం అని సత్యం అడిగితే..బాలు, మీనా సరిగా సమాధానం చెప్పరు. సత్యంకి ఏమీ అర్థం కాక.. బాలు వెనకే వెళతాడు.

55
మీనా- శ్రుతి గొడవ..

‘ ఏంటే..? ఇంట్లో చిచ్చు పెడుతున్నావా?’ అని మీనాని పట్టుకొని ప్రభావతి అడుగుతుంది. ‘ అవును మరీ.. కాగడా తీసుకువెళ్లి.. చిచ్చు పెట్టి వచ్చాను’ అని మీనా అంటుంది. ‘ వెటకారంగా ఉందా?’ అని ప్రభావతి అడిగితే.. ‘ మరి నేనంటే వాళ్లకు వెటకారంగా ఉందా? ఏదో ఒకే ఇంట్లో ఉన్నాం కదా అని ఊరుకుంటుంటే.. నెత్తిన ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు... మీరంటే నేను చచ్చేదాకా మారరు.. శ్రుతికి ఏమైంది? మీలా మారింది’ అని మీనా అంటుంది.‘ మధ్యలో నేనేం చేశాను’ అని ప్రభావతి అంటే.. ‘ మీ అండగ చూసుకునే కదా అంత పొగరు మీ చిన్న కోడలికి’ అని మీనా బదులిస్తుంది. ‘ ఏంటి.. ఏదో పొగరు, వగరు అంటున్నావ్ ? ఏమనుకుంటున్నావ్ నా గురించి?’ అని శ్రుతి నిలదీస్తుంది. ‘ పొగరు అనే అనుకుంటున్నాను.. రోజూ ఈవిడ రాచి రంపాలు పెట్టడం సరిపోవడం లేదా? నువ్వు కూడా మొదలుపెట్టావా? మీ అందరికీ ఎలా కనిపిస్తున్నాను?’ అని మీనా అడుగుతుంది. ‘ నువ్వు అయితే.. పొగరుబోతులానే కనిపిస్తున్నావ్ .. బాలుకి, నీకు తేడా ఉంది అనుకున్నాను.. కానీ బాలు కంటే నువ్వు గయ్యాళిలా తయారు అయ్యావ్’ అని శ్రుతి కూడా అంటుంది. వీళ్లిద్దరూ గొడవ పడుతుంటే.. ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. ‘ అవునమ్మా.. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను.. నీ అంతస్థుకు తగిన వాళ్లతోనే మాట్లాడు అని.. ఈ పూలు అమ్ముకునే దానితో రాసుకుపూసుకు తిరిగితే ఇలానే తప్పు పడతారు’ అని శ్రుతితో ప్రభావతి అంటుంది. ‘ ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పు పట్టాను ఆంటీ.. ఇలాంటి వాళ్లకు మీరే కరెక్ట్.. నేను మీ మాటే వినాల్సింది ’ అని శ్రుతి అనగానే.. ప్రభావతి మురిసిపోతుంది. అయితే.. ఇక నుంచి నీకు కాఫీ, వంటలు కావాలని నా దగ్గరకు రావద్దని.. మీ అత్తనే అడుగు అని మీనా అనడంతో.. శ్రుతి సరే అంటుంది. ఆ మాటలకు ప్రభావతి షాక్ అవుతుంది. ఇద్దరూ గొడవ పడితే..వంట నా నెత్తిన పడిందే అని భయపడుతుంది. కానీ.. శ్రుతి, మీనా ఇక జీవితంలో మళ్లీ కలవరు అని సంబరపడుతుంది. అయితే.. శ్రుతి, మీనా గొడవపడటం.. నాటకం అయ్యి ఉండొచ్చు.. ప్రభావతి తిక్క కుదర్చాలని అలా నాటకం ఆడి ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories