kantara chapter 1 ott collection : ‘కాంతార చాప్టర్ 1’ ఓటీటీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఓటీటీలో సుమారు 22.54 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార చాప్టర్ 1’.ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఓటీటీలో సుమారు 22.54 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
25
మళ్లీ మళ్లీ చూస్తున్న ఆడియన్స్
ఒక్క కన్నడ భాషలోనే ఈసినిమాకు 7 కోట్లు వసూలు కాగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ 13.32 కోట్లు రాబట్టింది. తమిళంలో 1.64 కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి. చూసిన ప్రేక్షకులే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంతలా ఆదరణ పొందింది కాంతార ఛాప్టర్ 1 సినిమా.
35
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
ఓటీటీలో రిలీజైనా కానీ.. కొన్ని థియేటర్లలో ఇంకా ఈ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. వీకెండ్స్, పండగలకు జనం థియేటర్లలో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఓటీటీ కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 880 కోట్లు దాటాయి.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ నిర్మించారు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ కు ఈసినిమాతో మంచి పేరు కూడా వచ్చింది. ఈసినిమా వల్ల రిషబ్ కు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్టు సమాచారం.
55
అనుమతి తీసుకున్నాం
ఇక ఈసినిమా పై వచ్చిన కాంట్రవర్సీల గురించి ఓ సందర్భంలో రిషబ్ శెట్టి స్పందించారు. " నేను దైవాన్ని నమ్మేవాడిని, ఆరాధించేవాడిని. నా సినిమాకు దైవ అనుమతి తీసుకున్నాం. సినిమాలో దైవాన్ని చూపించిన విధానంలో ఎలాంటి తప్పులు జరగకూడదనే జాగ్రత్తతో సినిమా చేశాను ‘’ అని రిషబ్ అన్నారు.