
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో వీలునామాలో ఉన్న తప్పులను సరిచేసి రాయాలని అంటుంది జ్యోత్స్న. దాంట్లో ఒక్క తప్పు కూడా లేదు. నువ్వు నా కూతురివి కాదని చెప్పు.. ఇప్పుడే మారుస్తాను అంటాడు దశరథ. మీరు కూతురికి అన్యాయం చేస్తున్నారు. వీలునామాలో మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని రాయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఊరికే ఆస్తి వస్తే ఎవరు వద్దంటారు. తన్నుకు పోవాలనే చూస్తారు కదా.. వీళ్లు అంతే.. అవకాశం దొరికిందని ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నారు అని కార్తీక్ కుటుంబంపై నిందలు వేస్తుంది పారు.
ఎవ్వరి గురించి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. నా భార్య గానీ, నా కొడుకు గానీ ఆస్తుల కోసం ఆశ పడేవాళ్లే అయితే ఈ డిస్కర్షన్ కోర్టులో జరిగేది, ఇంట్లో కాదు అంటాడు శ్రీధర్. ఒక్క సంతకం పెట్టు శివన్నారాయణ మీద కేసు వేస్తానని ఎన్నోసార్లు అడిగాను. అందుకు వాళ్లు ఏనాడు ఒప్పుకోలేదు. ఇలాంటి మనుషుల మీదా మీరు నిందలు వేసేదని సీరియస్ అవుతాడు శ్రీధర్.
నువ్వన్నదే నిజం అయితే వీలునామాలో మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని ఎందుకు రాయించావు అని అత్తయ్య మా డాడీని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటుంది జ్యోత్స్న. దాని గురించి మాకు తెలియదు అంటుంటే మా మీద పడతారేంటి అంటాడు కార్తీక్. వీలునామా మార్చింది నేను. దానికి ఓ కారణం ఉంది అంటాడు దశరథ. ఏంటో చెప్పుమంటాడు శివన్నారాయణ. నేను తర్వాత చెప్తాను అంటాడు దశరథ. ఆ వీలునామాను ఇప్పుడే చింపెయ్ తాత అంటుంది జ్యోత్స్న. ఎందుకు చింపాలి. ఆ వీలునామా మార్చేది లేదు అని తేల్చి చెప్తాడు దశరథ.
తప్పు దశరథది కాదు జ్యోత్స్న నీదే. అగ్రిమెంట్ పేరుతో నువ్వు వాళ్లను ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పుడు ఆస్తికే ఎసరు పెట్టారు అంటుంది పారు. అదే కారణం అయితే నేను ఈ క్షణమే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను అంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ కు, వీలునామాకు సంబంధం లేదు అంటాడు దశరథ. ఆ క్లాజ్ తీసేయ్ మామయ్య అంటాడు కార్తీక్.
నువ్వు ఎవర్రా నాకు చెప్పడానికి? నువ్వు చెప్తే నేను వీలునామా రాయించానా? అని సీరియస్ అవుతాడు దశరథ. మీరు కూతురు గురించి ఆలోచించట్లేదు. అదే మా మమ్మీ ఇక్కడ ఉంటే ఇది తప్పని చెప్పేది అంటుంది జ్యోత్స్న. ఇది తప్పని చెప్పను అంటూ ఎంట్రీ ఇస్తుంది సుమిత్ర. ఆ షాక్ తో జ్యోత్స్న మైండ్ బ్లాంక్ అవుతుంది. నా భర్త చేసిన దాంట్లో తప్పులేదు. వీలునామా మార్చడం గురించి నాకు తెలుసు. నా భర్త నాకు చెప్పే చేశారు అని చెప్తుంది సుమిత్ర.
ఆస్తి నీకు పుట్టబోయే పిల్లలకు రాశారు అంటే అది నీకే కదా.. అన్నీ నీ ఇష్టప్రకారమే జరగవు జ్యోత్స్న. పెళ్లి చేసుకో అంటే ఇప్పుడు కాదు అంటున్నావు. ఇంకెప్పుడు చేసుకుంటావు. పదేళ్ల తర్వాత చేసుకుంటావా? లేక పెళ్లి పెటాకులు లేకుండా ఈ ఇంట్లోనే ఉంటావా? ఆ వీలునామా అలాగే ఉంటుంది. నా కూతురు పెళ్లి చేసుకొని. పిల్లలను కంటుంది. వాళ్లకే ఈ ఆస్తి దక్కుతుందని తేల్చి చెప్తుంది సుమిత్ర.
శివన్నారాయణకు విషయం అర్థమవుతుంది. నేను అనవసరంగా వాదించి తప్పు చేశాను. వీలునామా అలాగే ఉంటుంది. ఇక దీన్ని ఇక్కడితో వదిలేయండి అంటాడు. ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. ఆస్తి మేనల్లుడి కుటుంబానికి చెందాలని ఎందుకు ఉందో అని పారు గొడవను సాగదీస్తుంది. దీప అలా చేయమని చెప్పి ఉంటుంది. ఎంతైనా పనిమనిషి కదా.. ఆస్తి కోసం ఆశపడటంలో తప్పు లేదు అంటుంది. కార్తీక్, దశరథ సీరియస్ అవుతారు.
దశరథ దీప గురించి నిజం చెప్పబోతుంటే కార్తీక్ ఆపుతాడు. ఎందుకు వీలునామా రాశారో అందరికీ అర్థమైంది కదా.. నా కొడుకుని కానీ నా కోడలిని కానీ ఏమైనా అంటే ఊరుకోను అని జ్యోత్స్న, పారులకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కాంచన.
మరోవైపు స్వప్నకు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు దాసు. వసంత్ అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి స్వప్నకు పరిచయం చేస్తాడు. వచ్చిన అబ్బాయి, స్వప్న కాసేపు మాట్లాడుకుంటారు. కాశీ కూడా అక్కడే ఉంటాడు. మనం విడిగా ఉంటే ఎప్పటికైనా మళ్లీ కలవగలం.. కానీ నువ్వు మరొకరి సొంతమైతే ఎప్పటికీ కలవలేము. పెళ్లి ఇష్టం లేదని చెప్పు అంటాడు కాశీ. బాగా ఆలోచించుకొని చెప్తున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటుంది స్వప్న. నువ్వు ఈ ఇంటికి డ్రైవర్ అంట కదా.. మా పెళ్లి అయ్యేవరకు మా ఆవిడను జాగ్రత్తగా చూసుకో బ్రో అని కాశీతో చెప్పి వెళ్లిపోతాడు వసంత్.
మరోవైపు లాయర్ చెప్పిన మాటలను తలచుకొని ఫ్రస్టేట్ అవుతుంది జ్యోత్స్న. తనే అసలైన కూతురా? కాదా? అనే కన్ఫ్యూజన్ లో పడుతుంది. ఒకవేళ నేను కన్నకూతురు కాకపోతే నాకు ఎందుకు ఆపరేషన్ చేశారని ఆలోచిస్తుంది. అంతలో దీప అక్కడికి వచ్చి అమ్మానాన్నలను బాధపెట్టొద్దని చెప్తుంది. ఎవరి అమ్మానాన్నలను అంటుంది జ్యోత్స్న. మీ అమ్మానాన్నలను అని చెప్తుంది దీప.
దశరథ గారు కూతురి పిల్లలకు ఆస్తి అని చెప్పినప్పుడు.. నేనే నీ సొంత కూతురిని అని ఎందుకు బలంగా చెప్పలేకపోయావు అంటుంది దీప. ఒక తెలివైనవాడు, ఆట తెలిసినవాడు ఆట మొదలుపెడితే ఎవరు గెలుస్తారు దీప అని అడుగుతుంది జ్యోత్స్న. ఆట తెలిసినవాడే గెలుస్తాడు అంటుంది దీప. నేను తెలివైనదాన్ని, నువ్వు ఆట తెలిసినదానివి. అందుకే నేను ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.