
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో.. వెళ్లమన్నాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి అని కాశీతో కోపంగా అంటుంది స్వప్న. ఎందుకు మేడం అంత కోపం.. నేను ఏమన్నాను అంటాడు కాశీ. భర్తతో తాచు పాము కథ చెప్పడం మొదలు పెడుతుంది స్వప్న. ఒక తాచుపాము చావు బతుకుల్లో ఉందని ఓ వ్యక్తి కాపాడితే.. కోలుకున్నాక అతన్నే కాటేసింది. అతను చనిపోయాడు. నువ్వు కూడా ఆ పాము లాంటి వాడివే. నిన్ను మరోసారి నమ్మి తప్పుచేయలేను అంటుంది స్వప్న.
దీప అక్క కూడా కార్తీక్ బావను ఎన్నోసార్లు బాధపెట్టింది. సుమిత్ర పెద్దమ్మ, దశరథ పెద్దనాన్నతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. కానీ వాళ్లు ఎప్పుడూ దూరం కాలేదు కదా.. తిరిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. మళ్లీ కలిసిపోయారు. నువ్వు కూడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటాడు కాశీ. నన్ను కూడా జైలుకు పంపివ్వడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? నేను నిన్ను ఈ జీవితంలో క్షమించను కాశీ అంటుంది స్వప్న.
మరోవైపు దాసును కలిసి కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. కూతురితో ఓ ఆట ఆడుకుంటాడు దాసు. దీప గురించి మా డాడీకి చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్న. అలా దశరథ అన్నయ్య నీతో చెప్పాడా అని అడుగుతాడు దాసు. దీప తన కూతురు అని తెలిస్తే ఎలా ప్రవర్తిస్తారో, మా డాడీ ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అంటుంది జ్యోత్స్న. వాళ్లు మనుషులు వారిలో మానవత్వం ఉంది. అందుకే అలా ఉంటారు అంటాడు దాసు.
నేను నిజంగా దశరథ కూతురినా? కాదు.. కాదు.. నీ కూతురినే, నువ్వే నా తండ్రివి అంటుంది జ్యోత్స్న. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది? అని అడుగుతాడు దాసు. మా వదినను కాపాడాల్సింది నువ్వే. ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు. నా అనుమానం ఏంటంటే దశరథను దీప షూట్ చేసిందని చెప్పావు కదా.. నాకు తెలిసి ఆ పని కూడా నువ్వే చేసి ఉంటావు అంటాడు దాసు. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఇక అన్నీ ఆపేసి, నీ తల్లిని నువ్వు కాపాడుకో అంటాడు దాసు. అన్నీ లెక్కలు తేలుస్తాను. అంత ఈజీగా ఏది వదలిపెట్టను నా తండ్రి ఎవరో నేనే తెలుసుకుంటాను మీ ఆట కట్టిస్తాను అని చిటికెలు వేస్తూ చెబుతుంది జ్యోత్స్న. అంతలో పారిజాతం వచ్చి ఎవ్వరి మీదే చిటికెలు వేస్తున్నావు అని సీరియస్ అవుతుంది.
మరోవైపు ఏమైంది బావ, నాన్న ఏమన్నాడు అని కార్తీక్ ని అడుగుతుంది దీప. మామయ్యను కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని భయంగా ఉంది అంటాడు కార్తీక్. నాన్నతో నేను మాట్లాడనా అని అడుగుతుంది దీప. మామయ్యను చూస్తే జ్యోత్స్నకు కచ్చితంగా అనుమానం వస్తుంది అంటాడు కార్తీక్. వస్తే ఏం చేస్తుంది అంటుంది దీప. దాసు మామయ్యతో మాట్లాడుతుంది అంటాడు కార్తీక్.
సారీ బావ.. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. అంటుంది దీప. అత్తను కాపాడి ఆ ఇంటి వారసురాలి స్థానంలో నిన్ను నిలబెట్టాలి అదే నా లక్ష్యం అంటాడు కార్తీక్. ఆపరేషన్ అంటే మనం శాంపిల్స్ ఇచ్చినంత ఈజీ కాదు దీప. అందులోను మన బిడ్డకు ఏమైనా అయితే ఆ బాధ నుంచి తేరుకోవడం అంత సులువు కాదు. డాక్టర్ ఛాన్స్ లేదని చెప్పింది కానీ, బిడ్డపై ఆశలు వదులుకోలేదు అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్.
మేము ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది గ్రానీ అంటుంది జ్యోత్స్న. నేనే రమ్మన్నాను అంటాడు దాసు. నీకు భయం లేదు అన్నావు కదా.. మరి గ్రానీని ఎందుకు రమ్మన్నావు అంటుంది జ్యోత్స్న. మా అమ్మను కాపాడుకోవడానికి అని చెప్తాడు దాసు. నువ్వు నన్ను పదే పదే కలవడం చూస్తే శివన్నారాయణకు అనుమానం వస్తుంది. అప్పుడు నీ మీద నిగా పెడతాడు. పిల్లల్ని మార్చిన విషయం బయటపడుతుంది.
మా అమ్మ ఫోటోకు దండ పడుతుంది అంటాడు దాసు. ఒరేయ్ నువ్వు అలా మాట్లాడుకురా అని నాకు భయమేస్తుంది అంటుంది పారిజాతం. జ్యోత్స్న పదే పదే నన్ను కలిస్తే జరిగేది అదే అంటాడు దాసు. నువ్వు నా అసలైన మనుమరాలిని వెతుకురా అంటుంది పారు. నేను నీ మనుమరాలిని అంటుంది జ్యోత్స్న. కాదు నువ్వు సుమిత్ర కూతురివి అని అరిచి చెబుతుంది పారు.
మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న, పారు మెడిటేషన్ చేస్తుంటారు. నా గురించి నిజం ఎవరికి చెప్పొద్దు అంటుంది పారు. నువ్వు ఏం టెన్షన్ పడకు. మనం మళ్లీ ఫ్రెండ్స్ లా ఉందాం అంటుంది జ్యోత్స్న. ఏంటి పారు ఇంత పొద్దునే మెడిటేషన్ చేస్తున్నావ్ అంటాడు కార్తీక్. మనశ్శాంతి కోసం అంటుంది పారు. నువ్వు మనశ్శాంతి కోల్పోయే అంతా ఇప్పుడు ఏం జరిగిందో అంటాడు కార్తీక్. కొన్ని చెప్పుకోలేము, దాచుకోలేము, ఒప్పుకోలేము అంటుంది పారు.
అంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఏంటి అని అడిగితే పారుకు మనశ్శాంతి కరువైందట తాత. ఎందుకో మనం కచ్చితంగా తెలుసుకోవాలి అని పారును ఇరికిస్తాడు కార్తీక్. ఎందుకు నీకు అంత ఒత్తిడి.. దాసు మామయ్య కిడ్నాప్ గురించా? అంటాడు కార్తీక్. కిడ్నాప్ ఏంట్రా అంటాడు శివన్నారాయణ. టెన్షన్ పడుతుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.