
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఏ విషయంలో క్లారీటి వచ్చింది చెప్పు పారిజాతం అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న ఎవరి కూతురు అని అడుగుతుంది పారు. సుమిత్ర కూతురు అంటాడు శివన్నారాయణ. సుమిత్ర ఎవరి తల్లి అంటుంది పారు. జ్యోత్స్న తల్లి అంటాడు శివన్నారాయణ. అదే క్లారిటీ వచ్చింది అంటుంది పారు. గట్టిగానే వచ్చింది పారు అంటాడు కార్తీక్. నేను ఇక వెళ్తాను మామయ్య అంటాడు శ్రీధర్. నువ్వు వస్తావా.. అని కాంచనను అడుగుతాడు. వస్తాను అంటుంది కాంచన. ఈ రోజు ఇక్కడే ఉండండి అంటారు తండ్రి, అన్నయ్య. లేదు నాన్న రేపు గుడికి వెళ్లాలి అంటుంది కాంచన.
జ్యోత్స్నను పిలిచి సుమిత్ర చేయిని జ్యోత్స్న చేతిలో పెడుతుంది. నీ తల్లి బాధ్యత నీదే. తల్లి రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు. నీకు వచ్చింది. నీ తల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది కాంచన. మరోవైపు లోలోపల జ్యోత్స్నపై కోపంతో రగిలిపోతుంది పారు. జ్యోత్స్న వైపు అనుమానంగా చూస్తాడు దశరథ. శ్రీధర్ కార్తీక్ ని కూడా పిలిచి ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. మీరు దీపను తీసుకొని వెళ్లండి బావ కార్తీక్ తో నాకు పనుంది అంటాడు దశరథ. దాసును కలిస్తే కానీ రిపోర్ట్స్ విషయంలో క్లారిటీ రాదు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
తాత నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వెంటనే వస్తాను అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ అమ్మను చూస్కో అంటాడు శివన్నారాయణ. సుమిత్ర దగ్గరకు వెళ్లి, అమ్మ నేను త్వరగా వెళ్లి వస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. సరే త్వరగా రా.. మీ తాతగారికి తెలిస్తే బాగోదు అంటుంది సుమిత్ర. ఇంతకు ముందు నాకు చెప్పేదానివి. ఇప్పుడు కన్నతల్లికి చెప్పుకుంటానావా.. సుమిత్ర కూతురా అని మనసులో రగిలిపోతుంది పారు. నాకు తెలియకుండా నువ్వేదో చేస్తానవ్. అనుకుంటూ జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది.
దాసు కోసం ఫుడ్ తీసుకొస్తారు రౌడీలు. మీరు తినరా అని వాళ్లను అడిగితే కాస్త మందు తాగాక తింటామంటారు రౌడీలు. మీతోపాటు నేను తాగుతాను కట్లు విప్పండి అంటాడు దాసు. కట్లు విప్పాక పారిపోతే ఎలా అంటారు రౌడీలు. పారిపోనురా అని వాళ్లతో కూర్చొని మందు తాగినట్లు నటించి పారిపోతాడు దాసు.
మరోవైపు కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొస్తాడు దశరథ. ఏంటి మామయ్య ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు కార్తీక్. రిపోర్ట్స్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయిరా అంటాడు దశరథ. డాక్టర్ దగ్గరకు వెళ్లి తన అనుమానం బయటపెడతాడు దశరథ. ఇంతకు ముందు మీరే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అన్నారు. ఇప్పుడు మళ్లీ మీరే మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు. ఈ విషయంలో జ్యోత్స్న మిమ్మల్ని బెదిరించిందా అని అడుగుతాడు దశరథ.
లేదండి అంటుంది డాక్టర్. నా భార్య విషయంలో రిస్క్ చేయలేను ఏదైనా ఉంటే చెప్పండి అంటాడు దశరథ. జ్యోత్స్న మీ కూతురు కాదు అంటుంది డాక్టర్. షాక్ అవుతారు కార్తీక్, దశరథ. మరి లేకపోతే ఏంటండి. మీ కన్నకూతురి శాంపిల్స్ మీ భార్యతో మ్యాచ్ అయ్యాయి. తను ఏ కూతురు చేయలేని త్యాగం చేస్తోంది అని తనను తమాయించుకుంటుంది డాక్టర్. మీరు ఏం టెన్షన్ పడకండి మీ భార్యకు ఏం కాదు అని దశరథను పంపిస్తుంది డాక్టర్.
ఏంటి కార్తీక్ ఇది. మీ మామయ్య వస్తున్నారు అని నాకు ముందే చెప్పాలి కదా అంటుంది డాక్టర్. నాకు కూడా తెలియదండి అంటాడు కార్తీక్. మిమ్మల్ని ఇలా అడగవచ్చో లేదో తెలియదు కానీ నా బిడ్డను కాపాడే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతాడు కార్తీక్. లేదు ఏదో ఒక ప్రాణాన్ని మాత్రమే కాపాడగలం అంటుంది డాక్టర్.
శ్రీధర్ కి కాఫీ పెట్టి ఇస్తుంది దీప. పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాంచన, శ్రీధర్. ఇప్పుడు సడెన్ గా గుడికి ఎందుకు కాంచన అంటాడు శ్రీధర్. దీప కడుపులో బిడ్డకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు కల వచ్చింది అండి అంటుంది కాంచన. అందుకే దేవుడికి మొక్కుకున్నాను. మా అమ్మకు ఎవరి దిష్టి తగలకూడదు. క్షేమంగా నా దగ్గరికి తిరిగి రావాలి అంటుంది కాంచన. ఆ మాటలు విన్న దీప ఏడుస్తుంది. మీ అమ్మకు నాతోనే గండం వచ్చింది అని బాధపడుతుంది.
మరోవైపు దాసు ఉన్న ప్లేస్ కి వెళ్తుంది జ్యోత్స్న. అప్పటికే దాసు పారిపోతాడు. రౌడీలు మత్తుగా నిద్రపోయి ఉంటారు. వాళ్లను లేపి అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు. జ్యోత్స్నను కిటికిలో నుంచి చూస్తుంది పారు. నీ గురించి కార్తీక్ గాడు చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటుంది. నువ్వు తెలివిగా పారిపోయాను అనుకుంటున్నావా నాన్న. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు అనుకుంటూ బయటకు వస్తుంది జ్యోత్స్న. దాక్కుంటుంది పారు.
నా కొడుకును నువ్వే కిడ్నాప్ చేసి ఏం తెలియనట్లు నాటకమాడుతావా.. ఇంతకు ముందు నువ్వు నా మనుమరాలు అనుకొని ఏం చేసినా ఊరుకున్నాను. ఇక ఊరుకునేది లేదు అని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.