
బాలు, మీనా.. రాజేష్ వాళ్ల ఇంటికి వెళతారు. అక్కడ షష్ఠి పూర్తి చేసుకోవాల్సిన దంపతులు గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటారు. వీళ్లు ఇక్కడ ఉన్నారేంటి? అని బాలు రాజేష్ భార్యను అడుగుతాడు. మీ ఫ్రెండ్ నే అడగండి అని ఆ అమ్మాయి ఏమీ చెప్పదు. ఈ లోగా... బాలు, మీనా.. రాజేష్ తల్లిదండ్రులకు కొత్త దుస్తులు పెట్టి.. ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత.. వాళ్ళిద్దరినీ కుర్చీలు వేసి కూర్చోపెడదాం అని మీనా అంటే.. అవేమీ వద్దని.. ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడుగుతారు. ఆ మాటలకు బాలు, మీనా షాక్ అవుతారు. వాళ్ల మాటలకు చాలా బాధపడతారు. విషయం ఏంటో తెలుసుకోవడానికి బాలు, మీనా వెళితే... రాజేష్ అందరితో కలిసి తాగి, చిందులు వేస్తూ ఉంటాడు. అది చూసి బాలుకి విపరీతంగా కోపం వస్తుంది.
మీనా వెళ్లి... రాజేష్ తల్లిదండ్రులకు భోజనం పెడుతుంది. ఈ లోగా.. బాలుని రాజేష్ చూస్తాడు. బాలుని కూడా తీసుకువెళ్లి.. తాగమని మందు పోస్తాడు. కానీ.. బాలు తనకు వద్దు అంటాడు. అందరికీ తాగినంత మందు పోయడానికే లక్ష రూపాయలు నీ దగ్గర తీసుకున్నాను అని రాజేష్ చెబుతాడు. అక్కడ జరిగేదంతా చూసి బాలుకి విపరీతంగా కోపం వస్తుంది. ఈలోగా మటన్ ముక్కలు సరిగా వేయడం లేదని గొడవ మొదలుపెడతారు. ఒకరి తర్వాత మరొకరు వచ్చి.. మటన్ ముక్కలు పెట్టలేదని.. రాజేష్ ని తక్కువ చేసి మాట్లాడతారు. వీళ్ల గొడవ ఆపి.. తాను వడ్డిస్తాను అని బాలు వెళతాడు. బాలు వడ్డిస్తున్నా కూడా సరిగా పెట్టలేదని గొడవ చేయడం మొదలుపెడతారు. ఆ గొడవ ఆపడానికి బాలు ప్రయత్నించినా కూడా వాళ్లు వినరు. దీంతో.. మీనా వెళ్లి... వాళ్లందరినీ పక్కకు నెట్టేసి.. బాలుని వాళ్ల మధ్యలో నుంచి లాక్కొచ్చేస్తుంది.
‘ మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఎంత గొప్పగా ఉపయోగపడ్డాయో చూశారా? ఫలితం దక్కిందా? తల్లిదండ్రులను ఓ మూలన పడేసి.. ఏం ఫంక్షన్ అండీ ఇది..’ అని మీనా బాలుని ప్రశ్నిస్తుంది. ఇక.. పాప కి కనీసం స్కూల్ ఫీజ్ కట్టకుండా.. బంధువుల మెప్పు కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశాడు అని రాజేష్ భార్య కూడా బాధపడుతుంది.మీరిచ్చిన డబ్బుకు న్యాయం జరగలేదు అని చెబుతుంది. ఇక.. బాలు, మీనా భోజనం కూడా చేయకుండా అక్కడి నుంచి వచ్చేస్తారు.
బాలు కోపంగా వచ్చి ఇంట్లో కూర్చొంటాడు. మీనా భోజనం పెడతాను అంటే.. బాలు వద్దు అంటాడు. ఈ లోగా.. సత్యం వచ్చి.. ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతాడు. మీనా అసలు విషయం చెప్పకుండా.. వెటకారంగా మాట్లాడుతుంది. మీనా చెప్పింది నిజం అనుకొని.. సత్యం పొంగిపోతాడు.బాలు ముఖం మాత్రం మాడిపోతుంది. తర్వాత పెళ్లాం చెబితే వినాలి.. అపాత్రదానం చేయకూడదు అని మీనా సెటైర్లు వేస్తుంది. ఆ మందుకు డబ్బులు ఇచ్చే బదులు.. పిల్లల స్కూల్ ఫీజ్ కి ఇస్తే కనీసం పుణ్యం దక్కేది అని మీనా.. తాను చెప్పాలి అనుకున్నది చెప్పేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక చింటూ రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటే... అతని తండ్రి వస్తాడు. తానే తండ్రి అని చెప్పకుండా.. చింటూతో సెల్ఫీ దిగుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక... మనోజ్.. తన బాడీ గార్డ్ కి ఫుడ్ పెడతాడు. వాడు బకాసురుడు మింగినట్లు గుడ్లు మింగుతూనే ఉంటాడు. వాడి తిండి చూసి రోహిణీ కూడా షాక్ అవుతుంది. ఇంకా అతని ఫుడ్ లిస్ట్ చాలా ఉందని చెప్పి.. మనోజ్ ఫీల్ అవుతూ ఉంటాడు. తప్పదు అని రోహిణీ.. మనోజ్ ని ఓదారుస్తుంది.
ఈ లోగా.. చింటూతో దిగిన సెల్ఫీ.. రోహిణీకి వస్తుంది. వెంటనే తన మాజీ భర్తకు రోహిణీ ఫోన్ చేసి.. తన కొడుక్కి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. కానీ.. అతను వినడు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావ్ అనుకుంట.. ఇప్పుడు నేను బయటకు వచ్చాను.. నీ భర్తకు రెండు లెటర్స్ పంపింది నేనే’ అని అసలు విషయం చెబుతాడు. ‘ నా కొడుకుని ఏదైనా చేస్తే ఊరుకోను’ అని రోహిణీ బెదిరిస్తే.. ‘ ప్రస్తుతానికి నేను నీ కొడుకును ఏం చేయను.. కాకపోతే నువ్వు నా మాట వినాలి.. లేకపోతే మాత్రం వాడిని ఎత్తుకెళతాను’ అని బెదిరిస్తాడు. ‘ నీకు ఏం కావాలి?’ అని రోహిణీ బతిమిలాడితే.. ‘ నేను చెప్పిన లొకేషన్ కి వస్తే.. నాకు ఏం కావాలో చెబుతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే లొకేషన్ కూడా పంపుతాడు.
ఇక.. రాత్రి కాగానే బాలు.. మందు తాగడానికి కూర్చొంటాడు. ఇంతలో.. బాలు అంతరాత్మ వచ్చి... బాలుతో మాట్లాడుతుంది. రాజేష్ కి లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చావ్ అని.. బాలుని బాలు అంతరాత్మ వచ్చి తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో రాజేష్ వచ్చి.. ఫంక్షన్ చదివింపులు వచ్చాయని చెప్పి.. అవి తెచ్చి బాలుకి ఇచ్చి వెళతాడు.