రాత్రిపూట భారీ భోజనాలు చేయకూడదు. రాత్రి 9 గంటల తర్వాత తినడం తగ్గించాలి. లేకుండా బరువు పెరుగుతారు.
రాత్రిపూట స్వీట్లు, స్నాక్స్ తినకూడదు. లేకపోతే బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.
టీవీ, మొబైల్ చూస్తూ ఆహారాన్ని తినకూడదు. దీనివల్ల ఎంత తింటున్నారో తెలియకుండా అధికంగా తినేస్తారు.
మద్యంలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ తాగితే బరువు పెరిగిపోతారు.
రాత్రిపూట టీ, కాఫీ, సోడా , ఇతర ఎనర్జీ డ్రింక్స్ మాత్రం తాగకూడదు.
డైట్ ప్లాన్ లేకుండా నచ్చినట్టు తింటే బరువు పెరిగిపోతారు. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు తినాలి.
రాత్రిపూట ఆలస్యంగా, తీవ్రంగా వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇది నిద్రను పాడు చేస్తుంది. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు.
ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల కేలరీలు నెమ్మదిగా ఖర్చవుతాయి. అందుకే తిన్న తర్వాత కాసేపు నడవడం, ఇంటి పనులు చేయడం లాంటివి చేయాలి.
అధిక బరువు తగ్గాలా..? ఈ జ్యూస్ తాగితే చాలు
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!
చియా విత్తనాలతో ఇలా బరువు త్వరగా తగ్గండి
కుక్కర్ మూత లీక్ అవుతుందా? ఇలా చేయండి