Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది

Published : Feb 27, 2026, 10:19 AM IST

Illu Illalu Pillalu Today Episode Feb 26: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, భాగ్యం కలిసి ఇంట్లో పెద్ద చిచ్చునే పెట్టారు. భాగ్యం సాగర్ ఉద్యోగం కొన్న విషయం రామరాజుకు చెప్పేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
పార్టీ స్టార్ట్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సాగర్ కు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు నర్మద తండ్రి ప్రసాద్ రావు పార్టీని అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీలో సాగర్‌ని అందరికీ పరిచయం చేస్తాడు. అందరూ సాగర్ ను చిన్న వయసులోనే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నందుకు మెచ్చుకుంటారు. దీంతో ప్రసాదరావు పొంగిపోతూ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మా అల్లుడు గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉంటాడు అని చెప్పి పొంగిపోతూ ఉంటాడు. నర్మదకు మాత్రమే ఆ మాటలు విని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నర్మదా ఫీల్ అవ్వడం వేదవతి గమనిస్తుంది. ఇంత సంతోషకరమైన వేడుకలో అలా ఉన్నావేంటి, మనసులో ఏదో బాధను మోస్తున్నట్టు ఉన్నావు, ఏమైందమ్మా అని అడుగుతుంది. కానీ నర్మద సమాధానం చెప్పదు. సాగర్.. నర్మదను కాస్త నవ్వుతూ ఉండు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో నర్మద కాస్త నవ్వు ముఖం పెడుతుంది. 

ఈ లోపు నర్మద స్నేహితులు కూడా అక్కడికి వస్తారు. వాళ్లను చూసి నర్మద తండ్రి దగ్గరికి వెళ్లి మా ఆఫీస్ వాళ్ళని ఎవరు పిలిచారు అని అడుగుతుంది. దానికి ప్రసాద్ రావు నేనే పిలిచాను అని, ఇంతవరకు నీ భర్త మూటలు మోసే వాడని అనుకుని ఉంటారు. వాళ్లకి కూడా తెలియాలి కదా నీ భర్త గవర్నమెంట్ ఉద్యోగి అని అంటాడు. వాళ్ళ స్నేహితులు నర్మద దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెబుతారు. మరోపక్క వల్లి మాత్రం నర్మదని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది. నర్మదా అంత సంతోషంగా ఉండడం నాకేమీ నచ్చడం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది . నర్మద సంతోషాన్ని నాశనం చేసేందుకు ప్లాన్ వేస్తుంది.

24
నర్మదను తెగ ఇబ్బంది పెట్టిన వల్లి

నర్మద తల్లి దగ్గరికి వెళుతుంది వల్లి. ‘అవును పిన్ని గారు భోజన ఏర్పాట్లు చేశారా అండి, కేకు కూడా తెప్పించారా అండి కూల్ డ్రింకులు కూడా తెప్పించారా అండి.. మీరు ముఖ్యమైన విషయాలన్నీ ఇలాగే మర్చిపోతున్నారు. నర్మద నగలు మీ బీరువాలోనే ఉన్నాయంట కదా. ఆ బీరువా తాళం ఎక్కడ మర్చిపోయారు కదా, దానివల్ల పాపం నర్మద ప్రేమ నగలు వేసుకుని వచ్చింది’ అని అంటుంది వల్లి. అప్పుడు నర్మద తల్లి మాట్లాడుతూ అసలు నర్మద నగలే మా ఇంట్లో పెట్టలేదు కదా అని అంటుంది. నేరుగా నర్మద దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడుగుతుంది నర్మద తల్లి సుజాత. ఆ విషయం వేదవతి విని ‘అయితే ఇప్పుడు ఏమైంది వదిన గారు’ అని అంటుంది. దానికి మధ్యలో వల్లి వల్లి మరింతగా రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నర్మద నగలు మా ఇంట్లో లేవని పిన్నిగారు చెబుతున్నారు అని వేదవతితో అంటుంది వల్లి. 

‘నీ నగలు మన అత్తారింట్లో లేక పుట్టింట్లోనూ లేక ఎక్కడ ఉన్నాయి’ అని అడుగుతుంది వల్లి.దీంతో నర్మద చాలా ఇబ్బంది పడుతుంది. ‘నేను చెప్పింది మా ఇంట్లో ఉన్నాయని కాదు అత్తయ్యా, మన ఇంట్లోనే బీరువాలో ఉన్నాయి. నేనే తాళం ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని చెప్పాను’ అని మాట మారుస్తుంది నర్మద. వల్లి మాత్రం లేదు నువ్వు మీ నగలు పుట్టింట్లోనే ఉన్నాయని చెప్పావు అని మళ్ళీ మళ్ళీ అంటుంది. వల్లిని అడ్డుకుంటుంది వేదవతి. నర్మద ఎప్పుడూ అబద్ధం చెప్పదు, మోసం చేయదు, మనమే పొరపాటుగా వినుంటాములే అని వల్లికి సర్ది చెబుతుంది వేదవతి.

34
ఏజెంట్ దగ్గర ఇరుక్కుపోయిన సాగర్

ఈ లోపు పార్టీలోకి సాగర్ కు ఉద్యోగం ఇచ్చిన ఏజెంటు ఎంట్రీ ఇస్తాడు. ఆ ఏజెంట్ వల్లిని వెతుకుతూ ఉంటాడు. కేరళ కుట్టి ఎక్కడుందో అని చూస్తూ ఉంటాడు. మరోపక్క వల్లి డాన్స్ లు వేసుకుంటూ ఉంటుంది. నర్మద ముఖంలో ఉన్న టెన్షన్ చూసి ఆనంద పడిపోతూ ఉంటుంది. ‘కాసేపటిలో ఏజెంట్ వస్తాడు. అప్పుడు మీరు ఉద్యోగం కొనుక్కున్న విషయం బయట పడిపోతుంది. అందరి ముందు పరువు పోతుంది. అప్పుడు నీకు ఉంటుంది’ అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఏజెంట్ వల్లిని చూస్తాడు. దగ్గరకు వచ్చి కేరళ కుట్టి అంటూ ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వల్లి మాత్రం అతడు ఎవరో తెలియనట్టు నటిస్తుంది. తరువాత తెలివిగా ఏజెంటును సాగర్ దగ్గరికి తీసుకెళుతుంది. సాగర్ ఏజెంట్ ను చూసి షాక్ అయిపోతాడు. ఏజెంట్ కూడా పార్టీ నీదేనా? నన్ను పార్టీకి పిలవలేదు ఏంటి? అని అడుగుతాడు. సాగర్ ఏజెంట్ ని వెళ్ళిపోమని చెబుతాడు. కానీ ఏజెంట్ మాత్రం క్లయింట్ ఇక్కడికే వస్తున్నాడని 5 లక్షలు పట్టుకొస్తాడని, అవి తీసుకునే వెళ్తానని అంతవరకు వెళ్లనని మొండికేస్తాడు. సాగర్ మాత్రం బతిమిలాడుతూ ఉంటాడు.

సాగర్ ఏజెంట్ ను బతిమిలాడడం వల్లి.. వేదవతికి చూపిస్తుంది. వేదవతి ‘అతను ఎవరు? సాగర్ ఎందుకు బతిమిలాడుతున్నా?’అని అంటుంది. మీరు వెళ్లి అతనితో మాట్లాడేసి రండి అని పంపిస్తుంది వల్లి. వేదవతి వచ్చి ‘నమస్తే సార్’ అంటుంది. సాగర్ తన అమ్మ అని పరిచయం చేస్తాడు. అప్పుడు ఏజెంట్ మీ అబ్బాయికి నేనేనండి ఉద్యోగం వేయించాను అని అంటాడు. అయితే వేదవతి మా అబ్బాయి కష్టపడి పరీక్ష రాసి, ఉద్యోగం సాధించానని చెప్పాడు కదా... మరి మా వాడికి ఉద్యోగం ఇప్పించానని చెబుతున్నారు ఏంటి? అని అడుగుతుంది. అసలు ఏం జరిగిందంటే అని ఏజెంట్ చెప్పబోతుంటే నర్మద వచ్చి అడ్డుకుంటుంది. సాగర్ కి ఈ ఊర్లోనే పోస్టింగ్ వచ్చేలా ఇతనే రికమెండ్ చేశారు అని సర్దిచెబుతుంది. ఏజెంట్ నర్మద వైపు చూడగానే నర్మద చెప్పద్దని సైగ చేస్తుంది. దానికి ఏజెంట్ ఒప్పుకుంటాడు.

మా అబ్బాయి మా కళ్ళ ముందు ఉండేలా మా ఊర్లోనే ఉద్యోగం వేయించినందుకు థాంక్స్ అండి అంటుంది వేదవతి. ఏజెంటు పర్లేదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వల్లి ఇదంతా చూస్తూ ఉంటుంది. నర్మద మాత్రం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటుంది.

44
రామరాజుకు మొత్తం ఊదేసిన భాగ్యం

ఇక్కడ నుంచి సీన్ భాగ్యం ఇడ్లీ బాబాయి దగ్గరికి మారుతుంది. రామరాజు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఇడ్లీ బాబాయ్, భాగ్యం వెళతారు. భాగ్యం భోజనానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు రామరాజు బుజ్జమ్మ వచ్చాకే భోజనం చేస్తానని చెబుతాడు. రామరాజు మీరు వెళ్లలేదా పార్టీకి అని అడుగుతాడు. అప్పుడు ఇడ్లీ బాబాయ్ యాక్టింగ్ మొదలు పెడతాడు. ‘ఎలా వెళ్తాము? మా బావగారు గౌరవ మర్యాదలు తగ్గే చోటికి మేము ఎలా వెళ్తాం? ప్రాణం పోయినా అది జరగదు. అయినా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని ఇలా పార్టీలు చేసుకోవడం నాకు ఏమీ నచ్చడం లేదు’ అని అంటారు. ఈలోపు ఇడ్లీ బాబాయ్ కావాలనే భాగ్యానికి సైలెంట్ గా ఫోన్ చేస్తాడు. 

భాగ్యం.. రామరాజు ముందే ఫోన్ తీసి మాట్లాడుతుంది ‘శాంతక్క చెప్పండి, ఈ టైంలో ఫోన్ చేశారు ఇంపార్టెంట్ విషయమా? ఏంటది? ఉద్యోగం కోసం వెళ్లారా? ఈరోజుల్లో అన్ని కొనాల్సి వస్తుందిలే. ఏంటి? మా సాగర ఉద్యోగం కొన్నాడా? మీరేదో పొరపాటు పడి ఉంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? రామరాజు గారి అబ్బాయి సాగర్ గురించా? చచ్చినా మా అన్నయ్య గారి పిల్లలు అలాంటి పనులు చెయ్యరు. ఆధారాలు వీడియోలు ఉన్నాయా? ఏది పెట్టు చూస్తాను’ అని డ్రామాలాడుతూ ఫోన్ కట్ చేస్తుంది. అదంతా విన్న రామరాజు ‘ఏమైంది ఉద్యోగం కొనడం, ఇది అది అంటున్నావ్ ఏంటి?’ అని అడుగుతాడు. భాగ్యం ‘నా స్నేహితురాలు శాంత రత్నం. దాని కొడుక్కి ఉద్యోగం కోసం ఏజెంట్ దగ్గరికి వెళ్లిందట. అక్కడ సాగర్ వివరాలు ఉన్నాయిట. సాగర్ పాతిక లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడని ఈవిడకి తెలిసిందట. ఏవో ఆధారాలు ఉన్నాయి పెడతాను అంటుంది’ అని చెబుతుంది. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories