బిగ్ బాస్ షోకి ఆ సంచలన కంటెస్టెంట్ రీఎంట్రీ? మళ్ళీ కాంట్రవర్శీ షురూ!

First Published | Oct 19, 2024, 7:32 AM IST

బిగ్ బాస్ హౌస్లోకి ఓ వివాదాస్పద కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

Bigg boss telugu 8


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షో నుండి 7 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం బేబక్క ఇంటిని వీడింది. అనంతరం శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంఘటిత తెలిసిందే. ఈ వారానికి గాను తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 
 

Bigg boss telugu 8


కాగా 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, మెహబూబ్, గౌతమ్, అవినాష్, రోహిణి, గంగవ్వ, నయని పావని మరోసారి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనంతరం షో ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. 

సోనియా ఆకుల మరోసారి హౌస్లోకి రానుందనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. సోనియా ఆకుల 4వ వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. సోనియా ఆకులపై అత్యంత నెగిటివిటీ నడిచింది. ఆమె ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. పృథ్విరాజ్, నిఖిల్ లతో సోనియా అత్యంత సన్నిహితంగా ఉండేది. 


Bigg boss telugu 8

అనూహ్యంగా ఆమెకు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. బయటకు పంపారు. ఎలిమినేటైన సోనియా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఆమె బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేయడం విశేషం. తనను చాలా తప్పుగా చూపించారని. వెనక ముందు కట్ చేసి వాళ్లకు కావలసినట్లు ఎడిట్ చేసి ఎపిసోడ్స్ లో ప్రసారం చేశారని సోనియా ఆకుల ఆవేదన చెందింది. 

ఒకింత బిగ్ బాస్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సోనియా ఆకుల మరలా బిగ్ బాస్ హౌస్లోకి వస్తారా లేదా అనేది చూడాలి. 8వ వారం ఆమె రీఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్లోకి వస్తే స్పైసీ కంటెంట్ కి కొదవ ఉండదని చెప్పొచ్చు. గతంలో రతికా రోజ్ కి బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. 

Soniya Akula

సీజన్ 7లో పాల్గొన్న రతికా రోజ్ సైతం అత్యంత నెగిటివిటీ ఎదుర్కొంది. ఈ క్రమంలో ఐదు వారాలు కూడా ముగియకుండానే రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. రెండు వారాల అనంతరం ఆమెకు రీ ఎంట్రీ దక్కింది. ఈ సీజన్ కి సోనియా ఆకులకు ఈ అవకాశం లభించింది అంటున్నారు. మరోవైపు సోనియా ఆకుల పెళ్లి ఏర్పాట్లలో ఉందనే వాదన వినిపిస్తోంది. 

యష్ అనే వ్యక్తితో సోనియా ఆకులకు పెళ్లి కుదిరింది. డిసెంబర్ లో పెళ్లి జరగాల్సి ఉందట. యష్ తో పాటు ఆయన పేరెంట్స్ అనుమతితోనే సోనియా ఆకుల బిగ్ బాస్ షోకి వెళ్లిందట. యష్ కి గతంలో పెళ్లి అయ్యింది. అతడు భార్యతో విడిపోయాడు. ఒక కొడుకు కూడా యష్ కి ఉన్నాడు. రెండో వివాహంగా సోనియా ఆకులను యష్ చేసుకుంటున్నాడు. 


కాగా సోనియా ఆకుల 2019లో నటిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జార్జి రెడ్డి మూవీలో హీరో సిస్టర్ రోల్ చేసింది. అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్, దిశా ఎన్కౌంటర్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ విధంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాలు పెద్దగా ఆడలేదు. అందుకే నటిగా సోనియా ఆకులకు బ్రేక్ రాలేదు.  

బిగ్ బాస్ షోతో ఆమెకు పాపులారిటీ దక్కింది. ఇప్పుడు అవకాశాలు పెరిగే సూచనలు కలవు. మరి చూడాలి సోనియా ఆకుల కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో. 

Latest Videos

click me!