Guppedantha Manasu
GuppedanthaManasu 1st February Episode: స్టూడెంట్స్ రిషి కోసం గొడవ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసి వసుధార, మహేంద్ర ఎలా వచ్చారో.. మినిస్టర్ గారు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో మినిస్టర్ గారు అక్కడికి వచ్చేసరికి వసు కూడా షాకౌతుంది. ఆయన కూడా .. తప్పంతా వసుధారదే అన్నట్లుగా మాట్లాడతారు. కాలేజీ పరువు అంతా పోయిందని.. అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన ఫెస్ట్ ప్లాప్ అయ్యింది అని వసుధారపై సీరియస్ అవుతారు. అసలు రిషి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే.. కాంటాక్ట్ లో లేరు అని వసుధార చెబుతుంది. దీంతో.. ఇదే విషయం గురించి తాను చర్చలు జరుపుతానని, స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్లమని మినిస్టర్ గారు కోరుతారు.
Guppedantha Manasu
స్టూడెంట్స్ అలా గొడవ చేయడానికి శైలేంద్రే కారణం కాబట్టి... అతనే స్టూడెంట్స్ ని లోపలికి వెళ్లమని చెబుతాడు. ఆ చెప్పేది కూడా వసుధారను తక్కువ చేస్తూ, రెచ్చగొట్టేలా చెబుతూ ఉంటాడు. మీకు రిషి అంటే అభిమానం అని మాకు తెలుసు.. మీకు గొడవలు చేయాలని ఉందని కూడా తెలుసు. కానీ కాస్త ఓపికతో ఉండండి అని చెప్పడంతో.. స్టూడెంట్స్ లోపలికి వెళ్లిపోతారు.
Guppedantha Manasu
స్టూడెంట్స్ వెళ్లిన తర్వాత.. మినిస్టర్ గారితో కలిసి బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ మినిస్టర్ గారు.. అసలు ల్యాబ్ టెక్నీషియన్స్ ఎందుకు కాలేజీకి రావడం లేదు అని అడుగుతారు. అయితే.. ఏవేవో కారణాలు చెప్పి..సెలవలు పెడుతున్నారని ఫణీంద్ర చెబుతాడు. అయితే.. టెంపరరీ గా అయినా.. వేరే వాళ్లను పెట్టొచ్చు కదా.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను వచ్చి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. నాకు కూడా చాలా సమస్యలు ఉణ్నాయి.. త్వరలో బడ్జెట్ ఉంది.. నా సమస్యలు నాకు ఉన్నా.. స్టూడెంట్స్ కోసం ఇక్కడిదాకా రావాల్సి వచ్చింది అని మినిస్టర్ చెబుతాడు.
Guppedantha Manasu
రిషి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. వసుధార నోరు తెరవకపోవడంతో.. మహేంద్రను అడుగుతాడు. మీ కొడుకే కదా అని అంటాడు. దానికి మహేంద్ర కూడా రిషి నిజంగానే కాంటాక్ట్ లో లేడు అని చెబుతాడు. ఎప్పటి నుంచి రిషి కాంటాక్ట్ లో లేడు అని మినిస్టర్ అడుగుతాడు. దానికి.. మహేంద్ర.. మొన్నటి వరకు మీరు చెప్పిన సీక్రెట్ పనిలోనే ఉన్నాడని.. ఫెస్ట్ రోజు నుంచే కనిపించడం లేదు అని చెబుతాడు. వెంటనే మినిస్టర్ రిషి ఫోన్ ట్రై చేస్తాడు. కానీ స్విచ్ఛాఫ్ వస్తుంది.
Guppedantha Manasu
ఆ వెంటనే శైలేంద్ర మీటింగ్ లో కూర్చున్న ఓ వ్యక్తికి సైగ చేస్తాడు. అతను.. అర్జంట్ గా వసుధార మేడమ్ ని ఎండీ పదవి నుంచి తొలగించండి.. ప్రాబ్లం మొత్తం ఆమె వల్లే అని అంటాడు. రీసెంట్ గా కూడా ఎండీ పదవిని వేరే వాళ్లకు ఇద్దాం అనుకున్నారని.. కానీ చివరలో రిషి సర్ వచ్చాక ఇష్తానని ఆపేశారని గుర్తు చేస్తాడు. అందరూ అతనికి వంత పాడతారు. వసుధారను ఎండీ పదవి నుంచి తొలగించాలి అని అంటారు.
ఓవైపు ఫణీంద్ర, మరోవైపు అనుపమ.. వసుకి సపోర్ట్ గా మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఎండీ స్థాయికి ఎదిగి కష్టపడుతోందని .. సపోర్ట్ చేయమని అనుపమ అంటుంది. అయితే.. ఇది ఆడపిల్ల, మగ పిల్లాడు కాదు అని మరొకరు సెటైర్ వేస్తారు. ఎవరు ఎన్ని అంటున్నా.. వసుధార మాత్రం.. చాలా కామ్ గా వింటూ ఉంటుంది. ఒకప్పుడు అభివృద్ధి గురించి మాత్రమే చర్చ జరిగేది.. ఇప్పుడు అన్నీ సమస్యల మీదే చర్చ జరుగుతోంది అని మనసులోనే బాధపడుతుంది
Guppedantha Manasu
మధ్యలో శైలేంద్ర కలగజేసుకొని.. ఫణీంద్ర వద్దు మాట్లాడొద్దు అన్నా వినకుండా మాట్లాడతాడు. వసుధారకు మన మందరం సపోర్ట్ గా నిలుద్దాం అని అంటాడు. వసుధారకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే మాట్లాడుతూ... చాలా లూప్స్ బయటపెడతాడు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైమ్ లో కూడా గొడవలు చేసే అవకాశం ఉందని.. మీడీయా ముందుకు వెళ్లి రచ్చ చేసే అవకాశం ఉందని.. ఇవన్నీ జరగకుండా చూసుకుందాం అని అంటాడు. అయితే.. మిగిలినవారందరూ..వసుని ఎండీ పదవికి అనర్హురాలు అని తేల్చేస్తారు.
ఇక.. వసు ఎండీ పదవికి రాజీనామా చేయడం తప్ప.. మరో ఆప్షన్ లేదు అని శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడు మినిస్టర్ షాకిస్తాడు. తన ఉద్దేశం ప్రకారం... ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వసుధార తప్ప మరొకరు ఎండీగా సూటవ్వరు అని అంటాడు. ఏమంటావ్ శైలేంద్ర అని మినిస్టర్ అడుగుతాడు. ఇక.. ఏం చేయలేక.. వసుధారే ఎండీ పదవికి కరెక్ట్ అని ఒప్పుకుంటాడు. రిషి గురించి తాను ఎంక్వైరీ చేస్తానని... మీరు కూడా చేయండి అని మినిస్టర్ చెబుతాడు. మహేంద్ర సరే అంటాడు.
ఆ తర్వాత... స్టూడెంట్స్ ఈ మధ్యలో గొడవ చేయకుండా ఉండేందుకు వారం రోజుల్లో రిషి వచ్చేస్తాడు అని నోటీసు పెట్టమని చెబుతాడు. ఈ లోగా ల్యాబ్ , పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని చెబుతాడు. అందరూ సరే అంటారు. పాపం... చివరి వరకు తనకు ఎండీ పదవి దక్కుతుందని ఆశపడిన శైలేంద్రకు ఊహించని దెబ్బ తగిలింది.
Guppedantha Manasu
తర్వాతి సీన్ లో... రాజీవ్ ని శైలేంద్ర ని కలుస్తాడు. జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. దానికి రాజీవ్ నాకు ఎందుకు జాగ్రత్తలు అని నవ్వేస్తాడు. అయితే.. ఈ మధ్య వసుధారను చూడటానికి రెండు, మూడు సార్లు వెళ్లావ్ అంట కదా అని అంటాడు. అయితే.. తాను రెండు సార్లు మాత్రమే వెళ్లాను అని.. నా మరదలిని చూడాలి అనిపించి వెళ్లాను అని చెబుతాడు
Guppedantha Manasu
కొద్ది రోజులు వసుధారకు కనిపించకుండా దూరంగా ఉంటే.. ఇద్దరం సేఫ్ గా ఉంటామని శైలేంద్ర అంటాడు. కొద్ది రోజులు ఆగితే... వసుధార నీ సొంతం అవుతుంది అని శైలేంద్ర అనడంతో.. ఇంతలా చెబుతున్నావ్ కాబట్టి.. సరేలే అంటాడు. అయితే.. రిషి గురించి అడగలేదు ఏంటి..? ఇంతకీ వాడు ఏమయ్యాడు అని రాజీవ్ మనసులో అనుకుంటాడు.. శైలేంద్ర కూడా.. రిషిని వీడు కాకపోతే మరి ఎవరు కిడ్నాప్ చేశారు అనుకుంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... ఇంట్లో కూర్చొని వసుధార, మహేంద్ర కాలేజీలో జరగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. బోర్డు మెంబర్స్ అలా మాట్లాడటానికి శైలేంద్రే కారణం అని వసుధార చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ రిషి రాడు.. వీళ్లు ఇదిగో వస్తాడు.. అదిగో వస్తాడు అని ఊరిస్తూ.. ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు సాగదీస్తున్నారు. ఇంకా ఎంత కాలం సాగదీస్తారో చూడాలి.