NagaPanchami 31st January Episode: పంచమి శివయ్య గుడిలో కూర్చొని.. మోక్షతో గడిపిన సందర్భాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సడెన్ గా అప్పుడే మోక్ష వస్తాడు. దీంతో.. అక్కడి నుంచి లేచి వెళ్లిపోదాం అనుకుంటుంది. కానీ.. మోక్ష.. పంచమి అని పిలవడంతో ఆగిపోతుంది. నువ్వు లేకుండా నేను బతకలేను.. నాతో వచ్చేయ్ అని అడుగుతాడు. చెయ్యి పట్టుకొని తీసుకువెళదాం అనుకుంటాడు. కానీ పంచమి రావడానికి అంగీకరించదు.
తన తల్లి తనకు మరో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుందని, పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అని హెచ్చరిస్తోందని మోక్ష చెబుతాడు. పంచమి వెంటనే సంతోషంగా పెళ్లి చేసుకోండి మోక్ష బాబు అని అంటుంది. దానికి మోక్ష అది తన కంఠంలో ఉన్నంత వరకు జరగదని తేల్చిచెబుతాడు. తన అమ్మను మభ్యపెట్టడానికి.. మేఘనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వచ్చానని అంటాడు. ఆ మాట విని పంచమి షాకౌతుంది.