10వ వారం బిగ్ బాస్ హౌస్ ఫ్యామిలీ ఎమోషన్స్ కి వేదికగా మారింది. రెండు నెలలకు పైగా ఇంటికి దూరమైన హౌస్ మేట్స్ లో హోమ్ సిక్ ఏర్పడింది. దాన్ని పోగొట్టేందుకు కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ప్రవేశ పెడుతున్నారు. శివాజీ, అర్జున్, అశ్విని, శోభ, యావర్, అమర్, భోలే, గౌతమ్ లను కలిసేందుకు ఒక్కొక్కరి చొప్పున కుటుంబ సభ్యులు వచ్చారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్లోకి వచ్చాడు.