Guppedantha Manasu Serial Today:ఫ్లోలో నిజాలు చెప్పేసిన ధరణి, రిషిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనుపమ అనుమానం

First Published Dec 6, 2023, 7:35 AM IST

 కారులో వెళ్తుండగా,వసు.. రిషికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ, స్విచ్ఛాఫ్ అని వస్తుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. మహేంద్ర మాత్రం టెన్షన్  పడకమని, రిషికి ఏమీ కాదు అని భరోసా ఇస్తాడు.
 

Guppedantha Manasu


Guppedantha Manasu Serial Today:ఫణీంద్ర మహేంద్రకు జ్యూస్ తీసుకొని వస్తాడు. రక్తం ఇచ్చి నీరసంగా ఉన్నావని జ్యూస్ తాగిపిస్తాడు. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతాడు. దానికి మహేంద్ర ఇక్కడే ఉంటానని, నీకు తోడుగా ఉంటాను అన్నయ్య అంటాడు. అయితే, దేవయాణి, ధరణిలను ఇంటికి పంపిద్దాం అని ఫణీంద్ర అంటాడు. సరే అని మహేంద్ర అంటాడు. దేవయాణిని పిలిచి.. ధరణిని తీసుకొని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతాడు. అయితే దేవయాణి మనసులో‘ నేను ఇక్కడే ఉండి శైలేంద్ర కండిషన్ సరిగాలేదని నమ్మించాలి. లేకపోతే ప్రమాదం’ అని అనుకుంటుంది. భర్తతో మాత్రం మీకు తోడుగా ఉంటానని, ఈ పరిస్థితుల్లో శైలేంద్రను వదిలేసి తాను వెళ్లలేను అని చెబుతుంది.దీంతో ఫణీంద్ర.. మీ వదిన ఇక్కడే ఉంటాను అంటోంది కదా.. నువ్వు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో, వెళ్తూ వెళ్తూ వసుధారను కూడా తీసుకొని వెళ్లు అని చెబుతాడు. మహేంద్ర సరే అంటాడు.

Guppedantha Manasu

మహేంద్ర వెళ్తుంటే.. రిషి ఎక్కడికి వెళ్లాడు ఫణీంద్ర అడుగుతాడు. అప్పుడు మహేంద్ర తనకు తెలీదని, ఫోన్ కూడా కలవడం లేదని, రిషి బాగా డిస్టర్బ్ అయ్యాడని చెబుతాడు. తర్వాత మనసులో‘ వదినగారు మీరు ఇక్కడ ఎందుకు ఉంటాను అంటున్నారో నాకు తెలుసు. శైలేంద్ర విషయం బయట పడకుండా చాలా జాగ్రత్తపడుతున్నారు కదా’ అనుకొని అక్కడి నుంచి వసుని తీసుకొని వెళ్లిపోతాడు. కారులో వెళ్తుండగా,వసు.. రిషికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ, స్విచ్ఛాఫ్ అని వస్తుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. మహేంద్ర మాత్రం టెన్షన్  పడకమని, రిషికి ఏమీ కాదు అని భరోసా ఇస్తాడు.

Latest Videos


Guppedantha Manasu

వసు మాత్రం భయపడుతూనే ఉంటుంది. ‘రిషి సర్, జగతి మేడమ్ ని చంపినవాళ్లను పట్టుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో ఏ ఆధారాలు దొరకడం లేదని, మేడమ్ చావుకు కారణమైన వారిని పట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నానని, ఇప్పుడు ఓ ఆధారం దొరికింది, నిందితుడు దొరికాడు. ఇది కదా అసలైన ఇంపార్టెంట్ పని. కానీ, దీనిని మించి ఇంపార్టెంట్  పని మరొకటి ఏమి ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. దాని గురించే నాకు కంగారుగా ఉంది మామయ్య’ అని వసు అంటుంది.

‘నేను ఇంతకాలం మంచివాడు అనుకున్న తన అన్నయ్య  ఇలాంటి పని చేశాడా అని రిషి అప్ సెట్ అయ్యాడమ్మా, మళ్లీ మాములు మనిషి అవ్వగానే వచ్చేస్తాడు. నువ్వేమీ కంగారుపడకు. నా మీద, జగతి మీద చాలా సార్లు బయటకు వెళ్లిపోయి రాత్రికి ఎప్పటికో వచ్చేవాడు. అంతెందుకు నీ మీద కూడా చాలా సార్లు అలిగి రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోయేవాడు కదా, రిషి వచ్చేస్తాడు. నువ్వేమీ కంగారుపడకు’ అని మహేంద్ర ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

Guppedantha Manasu

వాళ్లు ఇంటికి వెళ్లే సమయానికి ఎదురుగా అనుపమ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని మహేంద్ర అంటే.. రాకూడదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తుంది. నువ్వు రావద్దు అన్నది హాస్పిటల్ కే కదా, ఇక్కడికి కాదు కదా అంటుంది. తర్వాత శైలేంద్రకు ఎలా ఉంది అని అడుగుతుంది. వాడికే.. అలానే ఉన్నాడు అని మహేంద్ర బదులు చెబుతాడు. తర్వాత అనుపమ లోపలికి పిలవరా అంటే, మహేంద్ర ఇష్టం లేనట్లుగా మాట్లాడతాడు. వసుధార మాత్రం అనుపమను లోపలికి పిలుస్తుంది. అప్పుడు అనుపమ.. వసుని మెచ్చుకుంటుంది. ‘నీకు చాలా పాజిటివ్ మైండ్ ఉంది. చిత్ర కేసు విషయంలో నీపై నిందలు వేసినా, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లేలా చేసినా కూడా , నువ్వు నాతో చాలా పాజటివ్ గా ఉన్నావ్, నీ తెలివితేటలే కాదు, నీ ప్రవర్తన కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. అలా అని  నువ్వు నాకు నచ్చావ్ అని కాదు. చాలా విషయాల్లో నువ్వు ఇంప్రెసివ్ గా ఉంటావ్. కానీ, నాకు ఎందుకో ఆ ఎండీ సీటుకి నువ్వు అర్హురాలివి కాదు అని నాకు అనిపిస్తోంది.’ అని అనుపమ ఉంటుంది.

Guppedantha Manasu

మహేంద్రకు కోపం వచ్చి, ఈ ప్రశ్నలు ఆపుతావా? సమయం, సందర్భం లేకుండా ఇతరులు ఏ మూడ్ లో ఉన్నారో కూడా చూసుకోకుండా మాట్లాడతావ్ అంటూ క్లాస్ పీకుతాడు. తర్వాత ముగ్గురూ ఇంటి లోపలికి వెళ్లిపోతారు. అయితే, లోపలికి వెళ్లగానే, అనుపమ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు భోజనాలు పెట్టావ్.. ఇప్పుడు కనీసం కాఫీ కూడా ఇవ్వవా అని అడుగుతుంంది. రిషి కోసం ఆలోచిస్తున్న వసు, సారీ చెప్పి, కాఫీ తెస్తాను అంటే, అనుపమ మళ్లీ, నేను ఇస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది.వసు మాత్రం రిషి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. నాట్ రీచబుల్ వస్తుందని కంగారుపడుతూ ఉంటుంది.

Guppedantha Manasu

మరోవైపు ధరణి.. శైలేంద్ర దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దానికి శైలేంద్ర తాను బాగానే ఉన్నానని, నువ్వు అలా ఏడుస్తుంటే, నేను తట్టుకోలేను అని, నీకేమీ గాయాలు కాలేదు కదా అని అడుగుతాడు. ధరణి బాధపడుతుంటే, శైలేంద్ర తన యాక్టింగ్ మొదలుపెడతాడు. ధరణి మాత్రం అతని నటన గురించి తెలియకుండా.. అసలు మనం బయటకు వెళ్లకుండా ఉండి ఉంటే, అసలు ఇలా జరిగేది కాదు అని ఏడుస్తుంది. శైలేంద్ర మాత్రం మనసులో ‘ ధరణి నువ్వే నా ఆయుధం.ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అనునకుంటాడు. 

Guppedantha Manasu

ధరణి ముందు మాత్రం తాను గతంలో తప్పులు చేశానని, అందుకే, ఇప్పుడు ఆ తప్పులకు శిక్ష పడింది అంటాడు. ఇక, ఆ రౌడీలు కాలేజీకి సంబంధించిన శత్రువులు అయ్యి ఉంటారని, అందుకే తనపై ఎటాక్ చేసి ఉంటారు అని  శైలేంద్ర అంటాడు. అయితే, అమాయకంగా, ధరణి కొన్ని మాటలు అంటుంది. అమాయకంగా చెప్పినా, శైలేంద్ర గురించి నిజాలే చెబుతుంది. కాలేజీ కోసం మీకన్నా ఇంకెవరూ ప్రయత్నించలేదు కదా అంటుంది. ఆ మాటలకు శైలేంద్ర బెదిరిపోతాడు. తర్వాత కవర్ చేసేస్తాడు. నీ మెడలో ఉన్న తాళే తనను రక్షిస్తూ ఉంటుందని, నీకు భర్తగా ప్రేమను పంచుతాను అని చెబుతాడు. తర్వాత ధరణిని పంపించి, తాను పడుకుంటాను అని చెబుతాడు.ధరణి వెళ్లిపోగానే, ఓ కన్నింగ్ లుక్ ఇస్తాడు.

Guppedantha Manasu

మరోవైపు వసు.. రిషి కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా వాళ్లెవరూతమకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలియదని చెబుతూ ఉంటారు.  అనుపమ అప్పుడే కాఫీ తెచ్చి మహేంద్రకు ఇస్తుంది. మళ్లీ, అనుపమ శైలేంద్ర గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. మహేంద్ర మాత్రం ఇప్పుడు అవన్నీ అడగొద్దు అంటాడు.  తర్వాత వసుధారను కూడా పిలిచి కాఫీ తాగమని అంటుంది. వసు మాత్రం చాలా కంగారుగా ఫోన్ చూస్తున్నా కూడా  మళ్లీ రమ్మని పిలుస్తుంది. వసు, అక్కడికి వచ్చి రిషి సర్ జాడ తెలియడం లేదని బాధపడుతుంది.  ఉదయం నుంచి కనపడటం లేదని వసు భయపడుతుంది. అనుపమ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది.. వసు ఆన్సర్స్ చెబుతూ ఉంటుంది.  హాస్పిటల్ దాకా వచ్చి తర్వాత కనిపించకుండా పోయాడు అని చెబుతుంది. జస్ట్ ఒక మెసేజ్ చేశాడని, తర్వాత ఫోన్ రాలేదని వసు అంటుంది.

Guppedantha Manasu


అయితే, ఆ మెసేజ్ రిషి చేశాడు అనడానికి గ్యారెంటీ లేదని అనుపమ అంటుంది. అంటే, రిషికి ఏదైనా జరగరానిది జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది. కీడెంచి, మేలు ఎంచాలి అని, వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని సలహా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!