ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షోగా ప్రాచుర్యం పొందిన టెలివిజన్ షోని బిగ్ బాస్ గా ఇండియాకు తీసుకొన్నారు. 2007లో నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుండి అప్రతిహతంగా షో కొనసాగుతుంది. శిల్పా శెట్టి, అమితాబ్, సంజయ్ దత్ బిగ్ బాస్ హోస్ట్స్ గా చేశారు. అయితే సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తన మార్కు హోస్టింగ్ స్కిల్స్ తో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సీజన్ 17 నడుస్తుంది.