Guppedantha Manasu serial 28th December:శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర, సూపర్ ట్విస్ట్

Published : Dec 28, 2023, 12:04 PM IST

తనకు కూడా అలానే అనిపిస్తోందని మనం ధరణి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని శైలేంద్ర అంటాడు. 

PREV
19
Guppedantha Manasu serial 28th December:శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర, సూపర్ ట్విస్ట్
Guppedantha Manasu

Guppedantha Manasu serial 28th December:భద్ర ఎకామిడేషన్ గురించి అనుపమ, మహేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. హోటల్ లో ఉంచుదాం అని మహేంద్ర అంటే.. ఇక్కడే ఉంచుదాం అని అనుపమ అంటుంది. అప్పుడే భద్ర వచ్చి.. తన ఎకామిడేషన్ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదని, చాప ఇస్తే ఇక్కడే కింద పడుకుంటా అని చెబుతారు.
 

29
Guppedantha Manasu

తర్వాత..  భద్ర విషయం శైలేంద్ర.. తల్లి దేవయానికి చెబుతాడు. ఇప్పటి వరకు  చాలా మంది రౌడీలకు పని అప్పగించావని, ఎవరూ ఏమీ చేయలేకపోయారు అని దేవయాణి అంటుంది. అయితే, ఈ భద్ర మాత్రం చాలా తెలివైన వాడు అని, నాసిరకం కాదని, సమయం పట్టినా, మనం అనుకున్న పనిని వాడు పూర్తి చేసేస్తాడు అని శైలేంద్ర అంటాడు. భద్ర పేరు చెప్పకుండా, వాడి గురించి విషయాలు మాత్రమే చెబుతాడు. దేవయాణి పేరు తెలుసుకోవడానికి ప్రయత్నించినా, తల్లికి కూడా చెప్పడు. ఈలోగా.. అదే సమయానికి ధరని కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని శైలేంద్ర ముందే పసిగడతాడు. ధరని వస్తోందని ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు.
 

39
Guppedantha Manasu

మేం కాఫీ అడగలేదు కదా ఎందుకు వచ్చావ్ అని దేవయాణి అంటే,  తాను కూడా కాఫీ తేలేదని ఖాళీ కప్పులు తెచ్చానని అంటుంది. తర్వాత, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడుకోండి అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెబుతుంది. ఈ మధ్య దరణి చాలా డేంజర్ గా కనపడుతోందని దేవయాణి అంటే, తనకు కూడా అలానే అనిపిస్తోందని మనం ధరణి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని శైలేంద్ర అంటాడు. 
 

49
Guppedantha Manasu

మరోసారి శైలేంద్ర... వసుధారకు మెసేజ్ చేస్తాడు. ఎండీ సీటు కావాలా? రిషి కావాలా అని  ఆ మెసేజ్ అర్థం. ఆ మెసేజ్ చదివిన తర్వాత వసు.. రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. శైలేంద్ర.. మిమ్మల్ని అడ్డుపెట్టుకొని కాలేజీని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడని, ఇప్పుడు వాడిని అప్పగిస్తే కాలేజీని నాశనం చేసేస్తాడని, మీరు త్వరగా రండి సర్ అని వసు ఏడుస్తుంది. అప్పుడే.. వెనక నుంచి ఎవరో వెళ్లిన నీడ కనపడుతుంది. ఎవరా అని వసు బయటకు వెళ్లి చూస్తుంది. ఎవరు అని అడిగితే.. తాను భద్ర అని చెబుతాడు. 
 

59
Guppedantha Manasu

ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని వసు అడిగితే, వాటర్ కోసం అంటాడు. కిచెన్ లోకి వెళ్లాలి కానీ, ఇటువైపు ఎందుకు వచ్చావ్ అని సీరియస్ అవుతుంది. తర్వాతే తానే స్వయంగా వాటర్ తెచ్చి ఇస్తుంది. ఇంకోసారి ఇలా బయపెట్టకండి అని వసు అంటే.. నేను ఉన్నాను కదా మేడమ్ భయపడకండి అని చెబుతాడు. అతని మాటలు వసుకి కాస్త కొత్తగా అనిపిస్తాయి.
 

69
Guppedantha Manasu

మరోవైపు రిషి కొద్ది కొద్దిగా కోలుకుంటూ ఉంటాడు. వసుధార, డాడ్ తన గురించి ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటూ ఉంటాడు. తన కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో అని, వసుధారను  చూడాలని అనుకుంటూ ఉంటాడు. తాను ఇక్కడ ఉన్నాను అనే విషయం వసుధారకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
 

79
Guppedantha Manasu

మరుసటి రోజు ఉదయం కాలేజీకి బయలుదేరిన వసు.. తనకు వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన దగ్గర వీడియో సాక్ష్యం ఉన్నా కూడా శైలేంద్ర తనకు ఇలా ఎందుకు మెసేజ్ చేశాడని, తాను ఆ వీడియో ఎవరికీ చూపించను అని అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే విషయం తేల్చుకోవడానికి శైలేంద్రకు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని  ఫణీంద్ర చూస్తాడు. వసు.. శైలేంద్రకు ఎందుకు ఫోన్ చేస్తుందా అని అనుకుంటాడు. తర్వాత..  ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
 

89
Guppedantha Manasu

అయితే, శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు అని అనుకొని, వసు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఎండీ సీటు నీకు దక్కనివ్వను అని అంటుంది. వెంటనే ఫణీంద్ర.. అమ్మా వసుధార అంటాడు. అంతే.. భయంతో వసు ఫోన్ కట్ చేస్తుంది. అయితే. శైలేంద్ర కుట్ర మాత్రం ఫణీంద్రకు తెలిసిపోతుంది. వెంటనే కొడుకును కోపంగా పిలుస్తాడు. ఈరోజు నీ ప్రోగ్రాం ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు కాలేజీకి వెళ్లడమే అని శైలేంద్ర సమాధానం ఇస్తాడు. దీంతో.. ఫణీంద్ర.. నీకు కాలేజీలో ఏం పని..? ఏ పని చేయడానికి వస్తున్నావ్ అని అడుగుతాడు. అడ్మినిస్ట్రేషన్ పనిమీద అని శైలేంద్ర చెబుతాడు. వేరే ఏ పని మీద కాదు కదా అని అడుగుతాడు. తర్వాత వసు పేరు చెప్పకుండా శైలేంద్రకు ఫోన్ తాను లిఫ్ట్  చేశానని చెబుతాడు. 
 

99
Guppedantha Manasu

తర్వాత.. డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండాలని నీకు ఆశగా ఉందా అని అడుగుతాడు. శైలేంద్ర సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతుంటే ధరణి.. అనుకున్నారు మామయ్య అఅంటుంది. శైలేంద్ర కోపంగా చూడటంతో.. అంటే, ఒసారి మీరు అన్నట్లు గుర్తుంది అని ధరని అంటుంది. నేనెప్పుడు అన్నాను ధరని అని శైలేంద్ర అడగగానే, నేను భ్రమ పడ్డానేమో అంటుంది. తర్వాత ఫణీంద్ర వెంటనే.. నీకు ఎండీ సీటు పై మోజు ఉందా అని మళ్లీ అడుగుతాడు. లేదు అని, ముకుల్ ఇన్వెస్టిగేషన్ సమయంలోనే అదే చెప్పాను కదా అని శైలేంద్ర నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

నా కొడుకు నిజం చెబుతున్నాడనే అనుకుంటున్నాను, ఎందుకటే నా రక్తం ఎవరినీ మోసం చేయదు అని ఫణీంద్ర అంటాడు. ధరణి మనసులో ఆయనలో మీ రక్తంతోపాటు అత్తయ్య లాంటి స్వార్థపరురాలి రక్తం కూడా ఉంటుంది కదా మామయ్య అనుకుంటుంది. ఆ వెంటనే దేవయాణి.. వాడికి ఎండీ సీటు మీద ఆశ ఉంటే తప్పేంటి? రిషి వస్తే ఇస్తానని వసు చెప్పింది కదా అని అడుగుతుంది. వసు చెప్పిందని.. నీ కొడుక్కి ఎండీ సీటు ఇచ్చేస్తానా? రిషిని వెతకడం మాత్రమే మన పని, దానికీ ఎండీ సీటుకు సంబంధం లేదు అని ఫణీంద్ర తేల్చేస్తాడు. అంతేకాదు.. ఎండీ సీటు పై ఆపేక్ష లేదు అని లెటర్ మీద రాసి ఇవ్వమని ఫణీంద్ర శైలేంద్రను అడుగుతాడు. ఇలాంటిది వస్తుందని ఊహించని శైలేంద్ర.. వాళ్ల నాన్న ముందు నో అని చెప్పలేక.. దానికి అంగీకరిస్తాడు. ఈ సీను మాత్రం అదిరిపోయింది. శైలేంద్ర దేవయాణి ముఖంలో రక్తం చుక్క ఉండదు. తప్పక.. శైలేంద్ర తన తండ్రి అడిగింది పేపర్ మీద రాసి ఇస్తాడు. అది చూసి ధరణి చాలా సంతోషిస్తుంది. మరోవైపు వసు కాలేజీకి వెళ్తుంది. శైలేంద్ర అనుకొని ఫణీంద్ర సర్ తో మాట్లాడిన విషయం తలుచుకొని భయపడుతూ ఉంటుంది. అదే సమయానికి ఫణీంద్ర అక్కడికి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories