నన్ను విలన్ చేసి చూపిస్తారా, ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకున్నారు... బిగ్ బాస్ పై శివాజీ ఫైర్!

Published : Dec 28, 2023, 12:02 PM IST

నటుడు శివాజీ మెల్లగా బిగ్ బాస్ షోపై తన బాణాలు సంధిస్తున్నారు. ఇంటర్వ్యూలలో విమర్శల దాడికి దిగుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ నిర్వాహకులు తనను విలన్ చేసి చూపించారని సీరియస్ కామెంట్స్ చేశాడు.   

PREV
17
నన్ను విలన్ చేసి చూపిస్తారా, ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకున్నారు... బిగ్ బాస్ పై శివాజీ ఫైర్!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అతడు అల్లర్లు కేసులో అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై విడుదలయ్యాడు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో విన్నర్ అరెస్ట్ కావడం ఇదే ప్రథమం. కాగా మొదటి నుండి శివాజీ టైటిల్ విన్నర్ గా ప్రచారం అయ్యాడు. 

 

27

బిగ్ బాస్ షోలో అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభ శెట్టి, అర్జున్ అంబటి టాప్ సెలెబ్స్ ఉన్నారు. శివాజీ ఒకప్పటి హీరోగా ఫేమ్, ఫ్యాన్ బేస్ ఉంది. టైటిల్ ఫేవరెట్ లో హౌస్లో అడుగుపెట్టిన అమర్ దీప్ తేలిపోయాడు. దాంతో శివాజీదే టైటిల్ అనుకున్నారు. శివాజీ మెచ్యూర్డ్ గా ఆడాడు. 
 

37


చివరి వారాల్లో సమీకరణాలు మారిపోయాయి. అమర్ దీప్, శివాజీలను వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ రేసులోకి వచ్చాడు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు తనను విలన్ గా చూపించారు. అందుకే టైటిల్ కోల్పోయానని అర్థం వచ్చేలా శివాజీ ఫైర్ అయ్యాడు. 

 

47

లేటెస్ట్ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ... నేను ఎపిసోడ్స్ అన్నీ చూశాను. 12వ వారం నుండి విలన్ చేసి చూపించారు. ఎడిటింగ్ ట్రిక్ తో మ్యాగ్జిమమ్ నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. మీకు ఇష్టం లేకపోతే ఎందుకు కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. ఇంత పెద్ద షోలో ఇలాంటి సిల్లీ థింగ్స్ కంట్రోల్ చేయకూడదు. 

57

సినిమా, టీవీ ఏదైనా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. నేను అమర్ ని టార్గెట్ చేసింది లేదు. కానీ చేసినట్లు చూపించారు. మేము సరదాగా అనుకున్నవి కూడా ఎడిటింగ్ లో వేరే విధంగా చూపించారు. అమర్ ఎలా ఫీల్ అయినా, నేను అతని అభిప్రాయాన్ని గౌరవిస్తాను. అమర్ టైటిల్ విన్నర్ కాకూడదని నేను అనుకోలేదు. 
 

67

ఫౌల్ గేమ్ ఆడినట్లు తనే ఒప్పుకున్నాడు. అమర్ ని నేను తొక్కేస్తే ఫైనల్ కి ఎలా వచ్చాడు. రన్నర్ ఎలా అయ్యాడు? నేను ఆపితే ఆగలేదు కదా.. అంటూ చెప్పుకొచ్చాడు. అమర్ విషయంలో విలన్ గా చూపించడం వలనే టైటిల్ మిస్ అయ్యిందనే వేదన అంతర్గతంగా శివాజీలో కనిపించింది. 

 

77

చివరి కెప్టెన్ అయ్యే ఛాన్స్ అమర్ కి వచ్చింది. అప్పుడు శివాజీ సపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ శివాజీ చేయలేదు. అందుకు అమర్ బాగా ఏడ్చాడు. అది శివాజీకి మైనస్ అయ్యింది. ఇక మొదటి వారం నుండి శివాజీకి సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలతో గొడవలు జరిగాయి. 

click me!

Recommended Stories