BrahmaMudi Serial 28th December:రాజ్ మనసులో శ్వేత, అప్పూ ప్రేమను పసిగట్టిన పద్దూ..!

First Published Dec 28, 2023, 9:15 AM IST

మురళి గాజులు వేయడం తప్పించుకోవడానికి గాజు వేయకుండా చేతిలోనే పగలకొట్టుకుంటాడు. అది చూసి అరవింద గాయం అయ్యిందని మురళిని పక్కకు తీసుకువెళ్తుంది. తర్వాత, సంగీత్ ఏర్పాటు చేయాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
 

Brahmamudi

BrahmaMudi Serial 28th December:కళ్యాణ్ పెళ్లిలో భాగంగా గాజుల ఫంక్షన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆడపిల్లలకు తోబుట్టువు వరస అయ్యేవాళ్లు చేతికి గాజులు తొడగాలి. పెళ్లికూతురు అనామికకు రాహుల్, మురళిలు గాజులు వేస్తారు. తర్వాత కనకం కి సుభాష్, ప్రకాశ్ లు కూడా గాజులు వేస్తారు. అది చూసి కనకం పొంగిపోతుంది. తర్వాత.. అరవిందకు విక్కీ, ఆర్యలతో పాటు.. రాజ్, కళ్యాణ్ లు కూడా గాజులు వేయాలని ఆశపడతారు. కుర్చీ తీసుకొచ్చి, స్పెషల్ గా కూర్చోపెట్టి మరీ గాజులు వేస్తారు. అదే సమయానికి అక్కడికి బంటి కూడా వస్తాడు. బావ మరుదులు ఎక్కువై.. శత్రువుల సంఖ్య పెరిగిపోతోందని మురళి తన మనసులో తానే అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
 

Brahmamudi

అయితే, వెళ్లిపోతున్న మురళిని కావ్య ఆపేస్తుంది. నాకు, మా అక్కకి కూడా గాజులు వేయమని అడుగుతుంది.  దీంతో.. మురళి కావ్య, స్వప్నల చేతులకు గాజులు తొడుగుతాడు.తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. తర్వాత వెళ్తుంటే మళ్లీ  కావ్య ఆపుతుంది. పద్మావతి ని మర్చిపోతే ఎలా అని చెప్పి...  దగ్గరుండి గాజులు వేయిస్తుంది. అలా చేయడం మురళికి ఇష్టం లేకపోయినా.. కావ్య బలవంతంగా వేయించాలని చూస్తుంది. ఆ సీన్ అక్కడున్న విక్కీకి కూడా నచ్చదు. కానీ, మురళి గాజులు వేయడం తప్పించుకోవడానికి గాజు వేయకుండా చేతిలోనే పగలకొట్టుకుంటాడు. అది చూసి అరవింద గాయం అయ్యిందని మురళిని పక్కకు తీసుకువెళ్తుంది. తర్వాత, సంగీత్ ఏర్పాటు చేయాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
 

Latest Videos


Brahmamudi

మరోవైపు బంటి.. కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కళ్యాణ్ కనిపించిన తర్వాత వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పూ ప్రేమ గురించి చెప్పే సమయానికి అప్పూ చూసేస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి బంటిని విషయం చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. బంటిని చెప్పనివ్వదు. సంగీత్ కి రెడీ అవ్వమని కళ్యాణ్ కి చెప్పేసి, బంటిని తీసుకొని  వెళ్తుంది.
 

Brahmamudi

ఇక, అరుణ్ కోసం రాహుల్, రుద్రాణి, మురళి మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్ భయంతో దాక్కున్నాడేమో, వెతుకుందాం అని రాహుల్ చెబితే, సరే అని మురళి కూడా వెళతాడు. ఈలోగా బంటిని పక్కకు పిలిచి అప్పూ తిడుతుంది. నీ బాధ చూడలేకపోతున్నాను అని బంటి అంటే, నేను బాగానే ఉన్నాను అని అప్పూ అంటుంది. అయినా, బంటి వినకుండా నీ ప్రేమ విషయం కళ్యాణ్ కి చెప్పేస్తాను అంటాడు. కోపంతో బంటిని అప్పూ కొడుతుంది. ఆ సీన్ ని కావ్య చూసేస్తుంది.  కావ్య వీళ్లదగ్గరకు వస్తూ ఉంటుంది. కావ్యకు అయినా చెబుతాను అంటే, అప్పూ తన మీద ఒట్టేసుకుంటుంది. దీంతో బంటి నోరు మెదపడు. ఈలోగా కావ్య వచ్చి  ఏమైందని అడిగితే, అబద్ధం చెప్పి కవర్ చేస్తారు.
 

Brahmamudi

ఇక, ఇందిరా దేవి కారిడార్ లోకి వచ్చే సరికి, అందరూ ఫోన్లలో బిజీగా ఉంటారు. దీంతో, ఆమె ఆపండి అని గట్టిగా అరుస్తుంది. రాజ్ ఏమైంది అని అడిగినా చెప్పకుండా ఆర్యను పిలిచి.. అందరి ఫోన్లు తీసుకొని ఆ ట్రేలో పెట్టమని ఆర్డర్ వేస్తుంది.  చేసేది లేక.. అందరూ ఫోన్లు ఇచ్చేస్తారు.  తాను చెప్పేవరకు మళ్లీ ఫోన్లు ఎవరికీ ఇవ్వద్దు అని చెప్పేస్తుంది. తర్వాత పెళ్లి గురించి గొప్పగా,  దాని ప్రాముఖ్యతను ఇందిరాదేవి అందరికీ చెబుతుంది. తర్వాత అందరూ ఫోన్లు పక్కన పెట్టేసి తమ జీవిత భాగస్వామి గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. అందరూ ఎలా కలిసి ఉండాలో గొప్పగా చెబుతున్నారని, ఎలా ఉండకూడదో మాత్రం తమ అత్త రుద్రాణి చెబుతుంది అని స్వప్న సెటైర్ వేస్తుంది.  ఛాన్స్ దొరికిందని రుద్రాణి కూడా.. తన జీవితం ఇలా కావడానికి అపర్ణ కారణం అంటూ తిట్టిపోస్తుంది. ప్రేమించిన వాళ్లను విడదీయకూడదని ఆ విషయంలో మా వదిన అపర్ణ లా కాకుండా, ధాన్యలక్ష్మిలా ఆలోచించాలి అని రుద్రాణి అంటుంది. తర్వాత విక్కీ, రాజ్ లు మాత్రం.. తమ జీవితాలు బాలేవు అని అర్థం వచ్చేలా మాట్లాడటం గమనార్హం.  రాజ్.. కావ్య గురించి కాకుండా శ్వేత గురించి మాట్లాడతాడు.
 

Brahmamudi

తర్వాత అప్పూ వంతు వస్తుంది.‘ పెళ్లి గురించి, కాపురం గురించి అందరూ చెప్పారు, నేను చెప్పడానికి ఏమీ లేదు.  కానీ, కళ్యాణ్ వేరు తనొక పసివాడు. ఒక మనిషిని నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఒక్కసారి స్నేహం చేస్తే జాన్ ఇస్తాడు. తన లోకం వేరు. లోకమంతా తన కవిత్వంలాగే స్వచ్ఛంగా ఉంటుందని అనుకుుంటాడు. నమ్మించేవారు, నటంచేవారు, స్వార్థపరులు ఉంటారని కూడా కళ్యాణ్ కి తెలీదు.’ అని చెబుతుంది. తర్వాత రాధాకృష్ణుల కథ గురించి చాలా గొప్పగా చెబుతుంది.  అప్పూ.. ఇలా మాట్లాడగలదు అని తనకు ఈరోజే అర్థమైందని కళ్యాణ్ అంటాడు.
 

Brahmamudi

తర్వాత అప్పూ ఒంటరిగా ఉండటం పద్దూ చూసి అక్కడికి వెళ్తుంది. ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పావ్ అని అప్పూని  పద్దూ మెచ్చుకుంటుంది. తర్వాత నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది. తాను మగరాయుడు అని, తనకు అలాంటివి సెట్ కావు అని అప్పూ కవర్ చేయబోతుంది. కానీ, పద్దూ మాత్రం నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని నాకు అర్థమైందని, ఎవరు అని అడుగుతుంది. అందరూ ప్రేమను కోరుకుంటారని, కానీ దానిని దక్కించుకునే అదృష్టం అందరికీ ఉండదు అని, అది తనకు కూడా తెలుసు అని అప్పూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  అప్పూ వెళ్లిన తర్వాత, ఈ పెళ్లి అయ్యేలోగా.. అప్పూ మనసులో వ్యక్తి ఎవరో బయటపెడతాను అని పద్దూ అనుకుంటుంది.
 

Brahmamudi

తర్వాత కళ్యాణ్ మళ్లీ కనపడతాడు. బంటి ఈ సారైనా కళ్యాణ్ కి చెప్పాలని అనుకుంటాడు. మధ్యలో ధాన్యలక్ష్మి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. కళ్యాణ్ ని బయటకు తీసుకువెళ్తుంది. తర్వాత పద్దూ.. కావ్యతో అప్పూ ఎవరినో ప్రేమిస్తుందని చెబుతుంది. కానీ, కావ్య పట్టించుకోదు.

click me!