Guppedantha Manasu serial 26th December: వసుని కాపాడిన వ్యక్తే మరో కొత్త విలన్, శైలేంద్ర మరో కన్నింగ్ ప్లాన్..

First Published | Dec 26, 2023, 8:59 AM IST

చనిపోయిన వ్యక్తి దగ్గర రిషి ఫోన్ ఎందుకు ఉందో అర్థం కావడం లేదని, ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పంపానని మహేంద్ర చెబుతాడు. తాను ఇన్వెస్టిగేషన్ చేస్తానని ముకుల్ అంటాడు. ఆ వ్యక్తి ఫోటో కూడా చూస్తాడు.
 

Guppedantha Manasu

Guppedantha Manasu serial 26th December: రిషి గాయాలతో పడి ఉంటాడు. అతనికి ఇద్దరు వృద్ధ దంపతులు చికిత్స చేస్తూ ఉంటారు. స్పృహలో లేని రిషి.. వసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. రిషి సర్ అని వసు పిలిచినట్లు అనిపించడంతో వెంటనే.. వసుధార అని కళ్లు తెరుస్తాడు. అతనికి చికిత్స చేసిన దంపతులు అతని దగ్గరకు వెళ్లి.. ‘ బిడ్డ.. లే బిడ్డ’ అని పిలుస్తారు. కానీ, వసుధార అని కలవరిస్తూనే ఉంటాడు. పసరు మందు బాగానే పని చేసిందని,  కళ్లు తెరిచాడని, మళ్లీ మందు తాగిస్తారు. రిషి ఆ మందు తాగుతూ కోలుకుంటున్నాడని ఆ దంపతులు సంతోషంగా ఫీలౌతారు.ప్రాణాలకి అయితే ప్రమాదం లేదని, కానీ స్పృహలోకి రావడానికి టైమ్ పట్టేలా ఉందని వారు అనుకుంటూ ఉంటారు.  రిషి మాత్రం వసు పేరు కలవరిస్తూనే ఉంటాడు. వసుధార అంటే.. భార్య కానీ, ప్రేమించిన అమ్మాయి కానీ అయ్యి ఉండాలి అని వారు అనుకుంటారు.  గొప్ప ఇంటి బిడ్డలా ఉన్నాడని వారు అనుకుంటారు.
 

Guppedantha Manasu

మరోవైపు ఆస్పత్రిలో ఉన్న మహేంద్ర..ముకుల్ కి ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ నుంచి కాల్ వచ్చిందని.. డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కి వెళ్లామని, అది రిషిది కాదని,వేరే ఎవరిదో అని మొత్తం విషయం చెబుతాడు. చనిపోయిన వ్యక్తి దగ్గర రిషి ఫోన్ ఎందుకు ఉందో అర్థం కావడం లేదని, ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పంపానని మహేంద్ర చెబుతాడు. తాను ఇన్వెస్టిగేషన్ చేస్తానని ముకుల్ అంటాడు. ఆ వ్యక్తి ఫోటో కూడా చూస్తాడు.
 

Tap to resize

Guppedantha Manasu

మరోవైపు శైలేంద్ర.. వసు తనకు ఎండీ సీటు ఇవ్వకుండా, వీడియో చూపించి బెదిరించినది, తనను కొట్టింది తలుచుకొని రగలిపోతూ ఉంటాడు. అతని దగ్గరకు తండ్రి ఫణీంద్ర వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఎండీ సీటు గురించి ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. ఎండీ సీటు పక్కన పెడితే.. రిషి ఇంటికి రావాలి అని, మహేంద్ర తుపాకీతో నిన్ను చంపాలని చూశాడని, అది మహేంద్ర బాధతో చేశాడని, ఆ బాధ ని నువ్వే నిరూపించుకోవాలి. రిషి ఎక్కడున్నా నువ్వే తీసుకురావాలి అని ఫణీంద్ర.. శైలేంద్ర కు చెబుతాడు. అసలు రిషి ఎక్కడ ఉన్నాడో తనకు ఎలా తెలుస్తుందని శైలేంద్ర అడుగుతాడు. దానికి ఫణీంద్ర.. తెలుసుకోమని, నీ మీద వాళ్లకు అనుమానం ఉందని, అది పోగొట్టుకోవాలి అంటే.. నువ్వు ఈ బాధ్యత తీసుకొని రిషి కోసం వెతకమని ఫణీంద్ర కోరతాడు.
 

Guppedantha Manasu

ఫణీంద్ర వెళ్లిన తర్వాత దేవయాణితో శైలేంద్ర మాట్లాడతాడు. అన్నీ వచ్చి తన మెడకే చుట్టుకుంటున్నాయని , డాడ్ రిక్వెస్ట్ చేస్తున్నాడని, వసు బెదిరిస్తోందని, ఏం చేయాలో అర్థం కావడంలేదని, రిషి ఏమైపోయాడో తెలియడం లేదు అని అరుస్తాడు. ఇక, దేవయాణి కూడా ఆలోచనలో పడుతుంది. రిషి ఎక్కడికి వెళ్లాడో.. తన కొడుకు ఇరుక్కుపోయాడని ఫీలౌతూ ఉంటుంది.
 

Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర ఇంటికి వెళ్లి.. జగతి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు.‘ జగతి.. నీ కొడుకు కనిపించడం లేదు. ఈ రోజు మార్చురీలో చూడబోయేది మన కొడుకు రిషి నే అని నా గుండెలు పగిలిపోయాయి జగతి’ అని అంటూ ఉంటాడు. మరో గదిలో వసు కూడా కూర్చొని.. రిషి ఫోటో పట్టుకొని బాధపడుతుంది.  మహేంద్ర తన బాధను జగతి ఫోటోతో, వసు.. రిషి ఫోటోతో  మాట్లాడుతూ ఉంటారు. మార్చురీ సందర్భాన్ని వారు తలుచుకొని భయపడిపోతారు. వీరితో పాటు.. అనుపమ కూడా మరో గదిలో కూర్చొని ఆ సందర్భాన్ని తలుచుకుంటుంది. 

Guppedantha Manasu

వసుధార పడుతున్న బాధను చూస్తే.. తానే తట్టుకోలేకపోయాను అని అనుపమ అనుకుంటూ ఉంటుంది. రిషికి ఏమైనా అయిపోయిందా అనే భయంతో పాటు, వసుధార ఏమైపోతుందా అని  భయం వేసిందని మహేంద్ర అంటుంటే...‘ రిషి సర్ మీకు ఏమీ కాదని, మీకు ఏదైనా అయితే, నా గుండె ఆగిపోయేది’ అని వసు అనుకుంటూ ఉంటుంది. ఇలా ముగ్గురూ ఒకే ఇంట్లో.. ముడు చోట్ల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
 

Guppedantha Manasu

మరుసటి రోజు  శైలేంద్ర ఓ ప్రదేశంలో ఎదురుచూస్తూ ఉంటాడు. అక్కడికి నిన్నటి ఎపిసోడ్ లో వసుని కాపాడిన వ్యక్తి వచ్చి.. శైలేంద్రను కలుస్తాడు. అతని పేరు భద్ర అనే విషయం తెలుస్తుంది. ఆ భద్రకే.. వసుని చంపమని శైలేంద్ర డీల్ కుదుర్చుకుంటాడు. అదే విషయం మాట్లాడుకుంటారు.  ఇంకా ఎందుకు వాళ్లను చంపలేదు అని అడుగుతాడు. రూ.100 ఇస్తేనే చెబుతా అంటాడు. దీంతో.. శైలేంద్ర రూ.100 ఇచ్చి.. ఇప్పుడు వాళ్లను ఎందుకు చంపలేదు అని అడుగుతాడు. దానికి భద్ర.. తాను ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశాను అని, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జైలుకు వెళ్లేలేదని అంటాడు. ఎందుకంటే.. దాని కోసం తాను వేసే ప్లాన్ అలా ఉంటుందని, తనకు పని ఇచ్చిన వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్లాన్ చేస్తానని, తన చేతులకే కాదు.. తనకు పని ఇచ్చిన వారి చేతికి కూడా మట్టి అంటకుండా జాగ్రత్త పడతానని, తన ప్లాన్ తనకు ఉందని, తనను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని అంటాడు.

తాను చంపాలి అనుకునేవారికి ముందుగా మంచిగా దగ్గరౌతానని, వాళ్లు తనను పూర్తిగా నమ్మిన తర్వాత చంపేస్తానని, అందరికీ తెలిసేలా  కత్తితో పొడవడం లాంటివి చేయను అని  చెబుతాడు. శైలేంద్ర మాత్రం ఎక్కువ రోజులు చేయవద్దని.. తొందరగా చేయమని అడుగుతాడు. సరే, తొందరగానే చేస్తాను అంటాడు. ఆ తర్వాత.. రిషి కనిపించడం లేదనే విషయం, ఆ మార్చరీలో జరిగిన విషయం, డెడ్ బాడీ చూసిన విషయం మొత్తం చెప్పేస్తాడు.  ఆ డెడ్ బాడీ ని తాను తీసిన ఫోటో కూడా చూపిస్తాడు. ఆ ఫోటోలో వ్యక్తిని శైలేంద్ర గుర్తుపడతాడు. వాడితోనే రిషిని కిడ్నాప్ చేయిస్తాడు. తర్వాత.. శైలేంద్ర.. రిషి ఫోటో కూడా చూపించి, వసుధారతో పాటు కనపడితే రిషిని కూడా చంపమని అడుగుతాడు. దానికి భద్ర.. తాను అన్నీ చూసుకుంటానని.. మీరు టెన్షన్ పడకండి అని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!