
BrahmaMudi Serial Today Episode:అరుణ్ గొడవ ముగిసేసరికి, మళ్లీ అప్పూ ప్రేమ టాపిక్ తెరపైకి వస్తుంది. ఎలాగైనా కళ్యాన్ పెళ్లి అనామికతో ఆపేయాలని బంటి ఫిక్స్ అవుతాడు. అప్పూ ప్రేమను ఓ ఉత్తరం లో రాసి.. కళ్యాణ్ కంట పడేలా చేయాలని అనుకుంటాడు. మరోవైపు వధూవరులు దుస్తులు మార్చుకోవడానికి వెళతారు. కళ్యాణ్ కి పంచ కట్టుకోవడానికి తోడుగా అప్పూ కూడా వెళ్లడం విశేషం. అలా వెళ్తున్నప్పుడే కళ్యాన్.. తన ప్రేమ నిజమైందని అందుకే అందరి అంగీకారంతో ఘనంగా జరుగుతోందని అంటాడు. కళ్యాణ్ కి పెళ్లి జరుగుతుందనే బాధతో ఉన్నా.. నీ ప్రేమ నిజమైంది కాబట్టే.. నీకు పెళ్లి అవుతోందని, తన ప్రేమ ఓడిపోయింది అని అప్పూ మనసులో అనుకుంటుంది.
ఇక, బంటి కళ్యాణ్ గదిలో కూర్చొని ఉత్తరం రాయడం మొదలుపెడతాడు. ‘ మా అక్క మిమ్మల్ని ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమించింది. అది తాను గుర్తించేలోగా మీకు అనామికతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. అనామిక మిమ్మల్ని మీ కవితలు చూసి గుర్తించింది. కానీ మా అక్క మిమ్మల్ని, మిమ్మల్నిగానే ఇష్టపడింది. మీ నుంచి ఏ స్వార్థం లేకుండా ప్రేమించింది. అక్కని పెళ్లి చేసుకుంటే జీవితాంతం మీరు ఏమి చెప్పకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది’ అని బంటి ఉత్తరంలో రాస్తాడు. కళ్యాణ్ మాత్రం.. తనకు ఇంత ప్రేమ ఇచ్చిన అనామికను ఎలాంటి పరిస్థితులు వచ్చినా చెయ్యి వదలను అని అప్పూతో చెబుతూ ఉంటాడు. అనిమిక చాలా అదృష్టవంతురాలు అని అప్పూ అంటుంది. దానికి కళ్యాణ్ హ్యాపీగా ఫీలౌతాడు. సరిగ్గా వీళ్లు రూమ్ లోకి వచ్చే టైమ్ కి బంటి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కళ్యాన్.. పట్టు వస్త్రాలు మార్చుకుంటాడు.
బంటి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే.. కనకం ఎదురుపడుతుంది. అలా ఉత్తరం రాసిన విషయం మొత్తం కనకం కి చెబుతాడు. ఆ మాట కావ్య వినేస్తుంది. బంటి చెప్పింది విని కావ్య షాకౌతుంది. అప్పూ.. కళ్యాణ్ ని ప్రేమించిందా అని అడుగుతుంది. కనకం ఏదో కవర్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ, అసలు విషయం కావ్యకు అర్థమౌతుంది. కళ్యాన్ కేవలం స్నేహంగానే ఉన్నాడని, కానీ.. అప్పూ కళ్యాణ్ ని ప్రేమించిందని కావ్యకు పద్దూ చెబుతుంది. తనతో ఎందుకు చెప్పలేదు అని కావ్య అడుగుతుంది. నువ్వే అత్తారింట్లో అవమానాలు పడుతున్నావ్.. నీకెలా ఈ విషయాలు చెబుతాం అని కనకం అంటుంది. అప్పూ ప్రేమ విషయం తెలిసి కావ్య చాలా ఏడుస్తుంది.
‘అప్పూ ఇప్పటి వరకు దేనిమీద ఆశపడలేదు, ఇవ్వడం తప్ప.. తీసుకోవడం తెలీదు. దానికి మంచి జీవితం ఇవ్వాలని అనుకున్నాను. మంచిగా చదివించి, నచ్చిన వాడితో పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కానీ, ఇలా అయిపోయింది’ అని కావ్య ఏడుస్తుంది. కానీ.. ఇప్పుడు కళ్యాన్ కి పెళ్లి అయిపోతోంది కదా అని పద్దూ అంటే.. ఈ పెళ్లి జరగదని, అప్పూ ప్రేమ విషయం కళ్యాన్ కి తెలియాలని ఉత్తరం పెట్టాను అని బంటి చెబుతాడు. ఆ మాటకు బంటిని కావ్య కొట్టబోతుంది. అప్పూ అక్క కూడా తనను ఇందుకే కొట్టిందని, నువ్వు కూడా కొట్టు.. భరిస్తాను అంటాడు బంటి. కానీ, అప్పూ అక్కకి అన్యాయం జరిగితే తట్టుకోలేను అని అంటాడు.
కళ్యాన్.. అనామికను ప్రేమించాడని, ఈ విషయం తెలిసినా అప్పూమీద జాలి పడతారు తప్ప.. పెళ్లి ఆపరని కావ్య అంటుంది. ఆ లెటర్ సంగతి చూద్దాం అని, కళ్యాణ్ చూడకముందే దాచి పెడతామని పద్దూ.. కావ్యను తీసుకొని వెళ్తుంది. ఈ లోగా కళ్యాన్ కి అప్పూ.. పెళ్లి కొడుకులా ముస్తాబు చేస్తుంది. అదే సమయానికి కావ్య, పద్దూ, కనకం వస్తారు. ఏంటి.. ఇలా వచ్చారు అని అడిగితే.. రెడీ అయ్యారో లేదో చూద్దాం అని వచ్చాం అని చెబుతారు. కావ్య.. ఆ లెటర్ ని అక్కడి నుంచి తీసేసుకుంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి.. కళ్యాణ్ ని మండపానికి తీసుకువెళ్తుంది.
కళ్యాణ్ వెళ్లిన తర్వాత.. అప్పూని కావ్య, పద్దూలు ఓదారుస్తారు. నీ మనసు చాలా గొప్పదని మెచ్చుకుంటారు. ప్రేమించిన వాడిని నువ్వే పెళ్లి కొడుకులా తయారు చేశావ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ల మాటలను సీక్రెట్ గా రుద్రాణి వినేస్తుంది. ఈ విషయాన్ని ఎలా నిరూపించాలి అని రుద్రాణి అనుకుంటుండగా.. కావ్య ఆ లెటర్ పక్కన పడేస్తుంది. ఆ లెటర్ కాస్త రుద్రాణి కంట పడుతుంది. ఆ లెటర్ తో.. కావ్య కుటుంబం మొత్తాన్ని దుగ్గిరాల ఇంటికి దూరం చేయాలని రుద్రాణి ప్లాన్ వేస్తుంది.
మండపం పైకి వెళ్లడానికి అప్పూ నిరాకరిస్తుంది. కళ్యాణ్ తాళి కడుతుంటే చూడలేను అని అప్పూ అంటుంది. అయితే, కన్నీళ్లు వచ్చినా... ఆనంద భాష్పాలని చెప్పమని.. తాను ఇంతకాలం తన అత్తారింట్లో అలానే నెట్టుకువస్తున్నాను అని కావ్య చెబుతుంది. తర్వాత.. అందరూ మండపం పై కి వెళ్తారు. కావ్య డల్ గా ఉండటం చూసి ఏమైందని రాజ్ అడుగుతాడు. కానీ, కావ్య ఆ విషయం చెప్పదు. తర్వాత పద్దూ కూడా డల్ గా ఉండటం విక్కీ గమనిస్తాడు. అప్పూ విషయం ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది.
తర్వాత.. అనామికను మండపం పైకి తీసుకువెళ్తుంటారు. కూతురికి అనామిక తల్లి జాగ్రత్తలు చెబుతుంది. అప్పుడే సేటు వచ్చి వారికి అడ్డు నిలపడతాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అని పట్టుపడతాడు. పెళ్లి తర్వాత కూడా పైసలు రావు అని సేటు గొడవ చేస్తాడు. అదంతా కావ్య వినేస్తుంది. మీ అల్లుడిని డబ్బులు అడిగి ఇవ్వండి అని సేటు పట్టుపడతాడు. మరోవైపు పెళ్లి కూతురు ఇంకా రాలేదని ఎదురుచూస్తూ ఉంటారు.
కావ్య వచ్చి.. రాజ్ ని పక్కకు పిలిచి.. వారికి ఏదో డబ్బుల సమస్య వచ్చిందని.. సేటు వచ్చి వాళ్లను ఆపేస్తున్నాడని కావ్య విషయం రాజ్ కి చెబుతుంది. రాజ్ అక్కడకు వస్తాడు. రాజ్ ని చూసి వాళ్లు కంగారుపడతారు. విషయం దాచిపెట్టాలని చూస్తారు. కానీ.. ఆ డబ్బుల విషయం తనకు తెలుసు అని, ఆ డబ్బులు తాను ఇస్తానని రాజ్ చెబుతాడు. అనామిక మా అమ్మాయి అని, తమ కష్టాన్ని తీర్చే హక్కు తమకు ఉందని, రేపు తమ ఆఫీసుకు వచ్చి డబ్బులు తీసుకువెళ్లమని చెబుతాడు. ఆ సేటు సరేనని అంటాడు. అనామిక పేరెంట్స్ చాలా సంతోషిస్తారు. తన తమ్ముడి సంతోషం కోసం తాను ఈ పని చేశాను అని రాజ్ అంటాడు. ఇక, అనామికను కావ్య.. మండపానికి తీసుకొని వెళ్తుంది. తమ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు.. అనామిక తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు.
ఈలోగా.. ధాన్యలక్ష్మి ని రుద్రాణి పక్కకు పిలిచి.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని పక్కకు పిలుస్తుంది. కానీ ధాన్యలక్ష్మి పెద్దగా పట్టించుకోదు. ఈ లోగా అనామికను కావ్య తీసుకువస్తుంది. ధాన్యలక్ష్మి... వధూవరులకు పెట్టాల్సిన దుస్తుల కోసం వెళ్తుంటే.. మళ్లీ రుద్రాణి ఆపేస్తుంది. తర్వాత.. అప్పూ ప్రేమ గురించి బంటి రాసిన ఉత్తరం చూపిస్తుంది. నువ్వు నమ్మిన కావ్య.. నీ వెనక కట్ర చేస్తోందని, పెళ్లి ఆపాలని చూస్తుందని.. నువ్వు వచ్చి రచ్చ చెయ్యి అని ధాన్యలక్ష్మిని రుద్రాణి లాక్కొస్తుంది. ధాన్యలక్ష్మి కాస్త వెనక్కి తగ్గినా... రుద్రాణి ఊరుకోదు. ధాన్యలక్ష్మి బ్రెయిన్ వాష్ చేసి మరీ తీసుకువస్తుంది.
ఇద్దరూ కలిసి, అప్పూని స్టేజీ మీద నుంచి కిందకు పిలుస్తారు. ఈ పెళ్లి చేయడానికి వచ్చావా? ఆపడానికి వచ్చావా అని ధాన్యలక్ష్మి అప్పూని తిట్టడం మొదలుపెడుతుంది. తర్వాత కావ్య కుటుంబం మొత్తాన్ని కలిపి మరీ తిడుతుంది. ధాన్యలక్ష్మి మాటలకు కావ్య కూడా షాకౌతుంది. మీరు మా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అందరూ.. ధాన్యలక్ష్మికి నచ్చచెప్పాలని చూస్తారు. కానీ.. ధాన్యం వినదు. తన కొడుకు వెనక కుట్ర చేస్తున్నారని, అనామిక స్థానంలో అప్పూని కూర్చోపెట్టాలని చూస్తున్నారని అంటుంది. తన దగ్గర ఆధారం కూడా ఉందని బంటి రాసిన ఉత్తరం చూపిస్తుంది. ఆ ఉత్తరాన్ని కళ్యాణ్ కూడా చూస్తాడు. మూడో కూతురిని కూడా మన ఇంటి కోడలిని చేయాలని చూస్తుందని ఆరోపిస్తుంది. కనకం అలాంటిది ఏమీ లేదని, కావాలంటే.. తమ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని అంటుంది.
మధ్యలో రుద్రాణి దూరి రచ్చ చేయాలని చూస్తుంది. కానీ, కావ్య రుద్రాణిపై సీరియస్ అవుతుంది. ధాన్యలక్ష్మి అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానం ఉందని, మీరు జోక్యం చేసుకోవద్దు అని చెబుతుంది. స్వప్న..కూడా రుద్రాణి, రాహుల్ పై సీరియస్ అవుతుంది. మధ్యలో మూర్తి జోక్యం చేసుకొని.. మీ కొడుకు పెళ్లి ప్రశాంతంగా జరిపించండి అని, మేము వెళ్లిపోతాం అని చెబుతాడు.
కానీ, ధాన్యలక్ష్మి ఒప్పుకోదు.. ఏంటి ఈ నాటకం అని అడుగుతుంది. దానికి అప్పూ తన ప్రేమ విషయాన్ని అంగీకరిస్తుంది. ‘ ప్రేమిస్తే తప్పేంటి? ఎంత మగరాయుడిలా తిరిగినా నేను కూడా ఆడపిల్లనే. నాకు కూడా మనసు ఉంటుంది. ఆశలు ఉంటాయి. కోరికలు ఉంటాయి. కానీ, అందుకోసం నేనేమీ దిగజారలేదు. తనెప్పుడు అయితే అనామికను ప్రేమిస్తున్నాడని తెలిసిందో.. ఆక్షణమే నా మనసును చంపుకున్నాను. అంతే తప్ప.. ఈ పెళ్లికి అడ్డురాలేదు. కవి ఇష్టాన్ని గౌరవించాను. నా ఇంటి పరిస్థితులు అర్థం చేసుకొని, నా ప్రేమను మీరు తప్పు పడతారని, మా అక్కల కాపురాలకే సమస్యలు వస్తాయని, నా ప్రేమను నాలోపలే సమాధి చేసుకున్నా. ఇప్పుడు ఇది అడ్డు పెట్టుకొని పెళ్లిలో గొడవ చేసింది మీరు. నేను కాదు. ఎందుకు మా అమ్మమీద, అక్కల మీద బురద జల్లుతున్నారు.’ అని అప్పూ అడుగుతుంది.
నిజం బయటపడేసరికి.. ప్లేట్ పిరాయించిందని, కళ్యాన్ కి ఎగరేసుకుపోవాలని చూస్తున్నారని రుద్రాణి ఆరోపిస్తుంది. కావాలనే కుటుంబం మొత్తం ప్లాన్ వేసుకున్నారని రుద్రాణి ఆరోపించింది. మధ్యలో.. అప్పూ అందరి ముందు కళ్యాణ్ కి ఐలవ్ యూ చెప్పింది కదా అంటే.. అది నా పొరపాటు వల్లే జరిగిందని పద్దూ కూడా క్లారిటీ ఇస్తుంది. ఎవరు ఏం చెప్పినా ధాన్యలక్ష్మి నమ్మదు. కావ్యను కూడా అందరితో కలిసి తిడుతుంది. అయితే.. ధాన్యలక్ష్మి చేస్తున్న రచ్చను కళ్యాణ్ ఆపేస్తాడు.
ఈ విషయంలో ఎవరైనా మాట్లాడాలి అంటే తానే మాట్లాడాలి అని కళ్యాణ్ చెబుతాడు. ‘ అప్పూ పెరిగిన తీరు చూస్తే, నాకు ఒక అమ్మాయితో ఉన్న ఫీలింగే కలిగేది కాదు. కానీ ఏంతైనా ఆడపిల్ల కదా, నా స్నేహం, కేరింగ్ చూసి ప్రేమ అనుకొని భ్రమపడింది. నాకు తెలీకుండానే నేను అప్పూలో ఆశలు కలిగించాను. కానీ అది తెలుసుకోలేకపోయాను. అనామికను నన్ను కలపమని అప్పూని బతిమిలాడుకున్నాను. అప్పుడు కూడా తన మనసులో మాట నాకు చెప్పలేదు. అనామికతో నా పెళ్లి జరుగుతుందని తెలిసినా, తను పెదవి విప్పలేదు. ఇందులో తప్పు ఎవరిది నాదా అప్పూదా? నాదే కదా. ఒక ఆడపిల్ల మనసులో ఏముందో తెలుసుకోలేక, స్నేహం పేరిట వెంట తిరిగాను. నన్ను ప్రేమించిన అప్పూ.. నేను దూరమైపోతుంటే ఎంత నరకం అనుభవించిందో అందరికీ అర్థమై ఉంటుుంది. ఈ క్షణం వరకు తన ప్రేమ విషయం నాకు చెప్పలేదు. ఇంకా ఎందుకు అప్పూని దోషిని చేస్తున్నారు. ఇందులో ఏదైనా తప్పు ఉంటే.. అది నాదే’ అని కళ్యాణ్ అరుస్తాడు.
దానికి అప్పూ.. ‘ ఇందులో నీ తప్పు ఏముంది..? నేనేదో ఊహించుున్నా, ఆశలు పెంచుకున్నా. నేను నీకు కరెక్ట్ కాదనుకున్నా, దూరంగా ఉండాలని అనుకున్నా. అది నీకు తెలీక.. నువ్వు పెళ్లికి రావాలని పట్టుపడితేనే వచ్చాను. బంటిగాడు నా బాధ చూడలేక నీతోటి నిజం చెబుతానంటే ఇంట్లో పెట్టి తలుపేసి వచ్చాను. కానీ వాడు నాకు తెలీకుండా వచ్చాడు. నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నా. కానీ వాడు ఈ ఉత్తరం రాస్తాడని అనుకోలేదు. అది తెలిసి, అక్కవాళ్లు నీకు కనిపించకుండా బయటపడేశారు. ఇప్పుడు కనుక ఈ విషయం బయట పడకుండా ఉండి ఉంటే.. నేను చచ్చేవరకు కూడా నీకు తెలియనిచ్చేదాన్నే కాదు’ అని అప్పూ క్లారిటీ ఇస్తుంది.
ఇంత చేసినా కడా నువ్వు అప్పూని వెనకేసుకువస్తావా , అప్పూని నమ్ముతావా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వెంటనే ఇందిరా దేవి అందుకుంటుంది. కళ్యాణ్ మాత్రమే కాదు.. తామంతా కూడా అప్పూని నమ్ముతున్నాం అంటారు. ధాన్యలక్ష్మిని బాగా తిడతుంది. తర్వాత... ఘనంగా అనామిక, కళ్యాణ్ ల పెళ్లి జరుగుతుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది.