ఆ స్టార్ హీరో కంటే పల్లవి ప్రశాంత్ ఏం తక్కువ, కావొచ్చేమో... శివాజీ అలా అనేశాడు ఏంటి?

Published : Dec 31, 2023, 04:49 PM ISTUpdated : Dec 31, 2023, 05:30 PM IST

నటుడు శివాజీ తన శిష్యులను ఓ రేంజ్ లో పొగిడేశాడు. యావర్, పల్లవి ప్రశాంత్ మంచి నటులు. వాళ్లలో హీరో అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి అన్నాడు. పల్లవి ప్రశాంత్ ని అయితే ఓ స్టార్ హీరోతో పోల్చడం జరిగింది.   

PREV
17
ఆ స్టార్ హీరో కంటే పల్లవి ప్రశాంత్ ఏం తక్కువ, కావొచ్చేమో... శివాజీ అలా అనేశాడు ఏంటి?
Pallavi Prashanth


బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఈ సీజన్లో పోటీ ప్రధానంగా రెండు గ్రూప్స్ మధ్య జరిగింది. స్టార్ మా లో ఏళ్లుగా సీరియల్స్ లో నటిస్తున్న అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఫస్ట్ డే నుండి గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇది నచ్చని శివాజీ మరో గ్రూప్ ఫార్మ్ చేశాడు. 

27


షోలో చులకనగా చూడబడుతున్న పల్లవి ప్రశాంత్, యావర్ లను దగ్గరకు తీశాడు. వాళ్ళను ఎంకరేజ్ చేయడం, వారిద్దరూ బాగా రాణించడం శివాజీకి మంచిది అయ్యింది. ప్రేక్షకుల్లో అతనికి పాజిటివిటీ తెచ్చిపెట్టింది. 
 

37


శివాజీ చేతికి గాయం కాగా ప్రశాంత్, యావర్ సేవలు చేశారు. తనకంటూ ఒక గ్రూప్ మైంటైన్ చేస్తూ శివాజీ హౌస్లో తన ఆధిపత్యం కొనసాగించాడు. పనులు విషయంలో మిగతా కంటెస్టెంట్స్ మాదిరి శివాజీని గట్టిగా ప్రశ్నించేవారు కాదు. 
 

47

ఇక శివాజీ, ప్రశాంత్, యావర్ ల పేర్లలోని మొదటి అక్షరాలు కలిపి స్పై గ్రూప్ గా నామకరణం చేసుకున్నారు. వీరికి స్పా బ్యాచ్ పోటీ ఇచ్చేది. స్పై బ్యాచ్ బాండింగ్ జనాలకు నచ్చింది. వీరికి కామన్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ బ్యాచ్ సత్తా చాటింది. ఫైనల్ కి వెళ్లడంతో ప్రశాంత్ టైటిల్ కొట్టాడు. శివాజీ మూడో స్థానం, యావర్ నాలుగో స్థానంలో నిలిచాడు. 
 

57

 బిగ్ బాస్ షోతో మరోసారి శివాజీ వెలుగులోకి వచ్చాడు. ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన శిష్యులు యావర్, ప్రశాంత్ ల మీద ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యావర్ మంచి నటుడు. అతనిలో టాలెంట్ ఉందన్నాడు. 
 

67

ఇక ప్రశాంత్ గురించి మాట్లాడుతూ... ప్రశాంత్ వంటి నటులను కోలీవుడ్ లో చూస్తాం. చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఒక ధనుష్ అని చెప్పొచ్చు. ధనుష్ లాగ చేయగలిగే కెపాసిటీ  ప్రశాంత్ లో ఉంది. కానీ వాడిని మలిచేవాడు కావాలి. అలాంటి మలిచేవాడు దొరికితే పట్టుకుంటాడు ఆ అబ్బాయి. 
 

77
Actor Dhanush


 ధనుష్ అంత అని నేను అనను కానీ... ఎందుకు కాకూడదు. కోట్ల మంది అభిమానం పొంది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ధనుష్ అంత పెద్ద హీరో ప్రశాంత్ అవ్వచ్చేమో. ఎవరికీ తెలుసు?... అంటూ శివాజీ ప్రశాంత్ పై తన ప్రేమ చాటుకున్నాడు. 

click me!

Recommended Stories