Guppedantha Manasu Serial 19th Dec Episode:ఎండీ సీటులో కూర్చోవాలని ఆశపడ్డ శైలేంద్ర, చుక్కలు చూపించిన వసుధార..

Published : Dec 19, 2023, 08:23 AM IST

ప్లీజ్ మామ్.. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, నేను ఇంట్లో ఉంటే బాబాయ్ వచ్చి రచ్చ రచ్చ చేశాడని, తాను కాలేజీలో ఉంటేనే సేఫ్ గా ఉంటానని, తాను ఏం చేస్తానో అందరికీ తెలియాలి అంటాడు.

PREV
19
Guppedantha Manasu Serial 19th Dec Episode:ఎండీ సీటులో కూర్చోవాలని ఆశపడ్డ శైలేంద్ర, చుక్కలు చూపించిన వసుధార..
Guppedantha Manasu

Guppedantha Manasu Serial 19th Dec Episode: శైలేంద్ర సూటూబూటు వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. దేవయాణి వచ్చిఎక్కడికి రెడీ అవుతున్నావ్ అని అడుగుతుంది. ఇంకెక్కడికి మామ్.. నేను ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నానో అక్కడికే అంటాడు. అంటే అని దేవయాణి అడిగతే, తన కలల సామ్రాజ్యానికి అని చెబుతాడు. ఈరోజు డీబీఎస్టీ కాలేజీలో  బోర్డ్ మీటింగ్ ఉంది. అక్కడ పెంట చేయడానికి శైలేంద్ర రెడీ అవ్వడం విశేషం. అయితే, దేవయాణి.. అప్పుడే ఎందుకు నొప్పి తగ్గలేదు కదా, కొద్ది రోజులు రెస్టు తీసుకొని తర్వాత వెళ్లమని చెబుతుంది. కానీ,  శైలేంద్ర.. ఎంత నొప్పి అయినా సరే, తాను వెళ్లాల్సిందే అని పట్టుపడతాడు.కాలేజీకి వెళ్లిరావాలని , అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని, కాలేజీ పై తనకు ఉన్న శ్రద్ధ అందరికీ తెలియాలని చెబుతాడు.ఇప్పుడున్న పరిస్థితిలో వద్దు అని దేవయాణి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోడు. ప్లీజ్ మామ్.. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, నేను ఇంట్లో ఉంటే బాబాయ్ వచ్చి రచ్చ రచ్చ చేశాడని, తాను కాలేజీలో ఉంటేనే సేఫ్ గా ఉంటానని, తాను ఏం చేస్తానో అందరికీ తెలియాలి అంటాడు.

29
Guppedantha Manasu

ఆ మాట చెప్పడం పూర్తయ్యేలోగా ధరణి ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కాలేజీ కి వెళతారా అని అడుగుతుంది.‘ వెళతాడు, నా కొడుక్కి తన ఆరోగ్యం కంటే కాలేజీ పైనే శ్రద్ధ ఎక్కువ. కచ్చితంగా వెళతాడు’ అని దేవయాణి సపోర్ట్ గా నిలుస్తుంది. అయితే ధరణి వెంటనే ‘ అవునా అత్తయ్యగారు, అక్కడికి వెళ్లి ఆయన ఏ పని చేస్తారు? పర్లేదు చెప్పండి అత్తయ్యగారు’అని కౌంటర్ వేసినట్లు అడుగుతుంది. ‘ఏదో ఒక పని చేస్తాడు నీ కెందుకు?’ అని దేవయాణి అంటుంది. ‘అంటే, పనిమీద శ్రద్ధ అన్నారు కదా? ఆ పని ఏంటో తెలుసుకుందాం అని అడిగాను అంతే, అక్కడ ఆయన ఏ పని చూసుకుంటారు?’అని మళ్లీ అడుగుతుంది. ‘ ఫైల్స్ చూసుకుంటాడు. అక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి, అవన్నీ నీకు తెలీదు కదా? వాటిమీద సంతకాలు పెట్టుకుంటాడు, లేదంటే చింపి చెత్తకుండీలో వేసుకుంటాడు నీకెందుకు ’ అని దేవయాణి కవర్ చేయాలని చూస్తుంది. కానీ ధరణి వదలదు ‘ అయితే,మామయ్యగారికి చెప్పి, ఆ ఫైల్స్ ఏవో ఇక్కడికే తెప్పిస్తాను. ఆ మాత్రం దానికి ఆయన అక్కడి దాకా వెళ్లడం ఎందుకు? ఆ పెట్టే సంతకాలు ఏవో ఇక్కడే పెట్టమనండి, ఆ చింపే కాగితాలు ఏవో ఇక్కడే చింపమనండి. పర్లేదు నేను ఏమీ అనుకోను. ఆయన పక్కనే డస్ట్ బిన్ పెడతాను’అంటుంది. ఆ మాటలకు దేవయాణికి చిర్రెత్తుకొస్తుంది. ‘ధరణి నువ్వు రోజు రోజుకీ మారిపోతున్నావ్, భయం లేకుండా తయారౌతున్నావ్.. అని ఏదో అనబోతుంటే శైలేంద్ర ఆపేస్తాడు.

39
Guppedantha Manasu

‘ధరణి.. నేను కాలేజీకి వెళతాను, నన్ను వెళ్లనివ్వు.’ అని అడుగుతాడు. ‘ వద్దండి’అంటుంది.. ‘  ఎందుకు?’ అని మళ్లీ అడుగుతాడు. ‘ మీ ఆరోగ్యం కోసమే వద్దు అంటున్నాను’ అని చెబుతుంది. వెంటనే శైలేంద్ర ‘నాకు ఆరోగ్యం కంటే ఆత్మ గౌరవమే ముఖ్యం. అర్థం కాలేదా? రిషి ఎక్కడ ఉన్నాడో బాబాయ్ నన్ను నిలదీస్తున్నాడు. నాకు ఏమీ తెలీదు అన్నా నమ్మడం లేదు. దానంతటికీ కారణం నేనే అని అనుమానిస్తున్నాడు. ఈ రోజు బాబాయ్ అనుమానించినట్లే, రేపు పది మంది అనుమానిస్తే నేను తట్టుకోలేను.  అందుకే నేను కాలేజీకి వెళ్లి, రిషి గురించి సమాచారం తెలుసుకొని, తన కోసం వెతికే పనిలో ఉంటాను’అని చెబుతాడు. ధరణి మాత్రం మనసులో ‘ మీ నక్క బుద్ధి నాకు తెలుసండి, అక్కడికి వెళ్లినతర్వాత ఆ కాలేజీని ఎలా దక్కించుకోవాలా అని చూస్తారు’ అని అనుకుంటుంది. బయటకు మాత్రం శైలేంద్రతోపాటు తాను కూడా కాలేజీకి వస్తాను అని అడుగుతుంది. ముందు షాకైనా తర్వాత నువ్వు ఎందుకు అని దేవయాణి అడుగుతుంది. దానికి ధరణి.. ఆయనను ఒంటరిగా ఎలా పంపిస్తాం అసలే ఆరోగ్యం బాలేదు అందుకే, నేను తోడుగా వెళతాను అంటుంది. వెంటనే దేవయాణి.. ఆ మాత్రానికి నువ్వెందుకు నేను వెళతానులే అంటుంది. అప్పుడు ధరణి.. నేను వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటి  అత్తయ్యగారు అని అడుగుతుంది.

49
Guppedantha Manasu


‘ ఈరోజు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చింది నీ వల్ల కాదా? నువ్వు పక్కన ఉండగానే కదా వాళ్లు వచ్చి నా కొడుకుని పొడిచి వెళ్లారు. ఇప్పుడు కూడా వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే, నువ్వు ఆపగలవా లేదు కదా, అందుకే నేనే వెళతాను. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి పని,వంట పని చూస్కో చాలు’ అని దేవయాణి కోడలికి ఆర్డర్ వేస్తుంది. తర్వాత ధరణిని పక్కకు జరిపి, వాళ్లిద్దరూ కాలేజీకి వెళతారు. వాళ్లు వెళ్లగానే, ధరణి మనసులో.. ‘ ప్రమాదాలు సృష్టించేదే మీరు, మీకు ఏం ప్రమాదాలు జరుగుతాయి. అసలు రిషి ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడొస్తాడో వీళ్ల రాక్షసత్వానికి ముగింపు పడేది ఎప్పుడో. వీళ్లు దుర్మార్గాలకు ఒక ముగింపు వస్తే బాగుండు’ అని అనుకుంటూ ఉంటుంది.

59
Guppedantha Manasu

వసుధార కాలేజీ నోటీస్ బోర్డు దగ్గర నిలపడి ఉంటుంది. వెంటనే అనుపమ వచ్చి.. నోటీస్ బోర్డు చూస్తున్నావేంటి అని అడుగుతుంది. అప్పుడే మహేంద్ర కూడా వస్తాడు. ‘రిషి మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద వెళ్లినట్లు నోటీసు ఎందుకు ఇచ్చావ్ ?’ అని అనుపమ అడుగుతుంది. తప్పక ఇవ్వాల్సి వచ్చిందని, ఆ సీటు కోసం చాలా మంది కుట్రలు చేస్తున్నారని, రిషి మాట కాదనలేక తాను ఆ సీటులో కూర్చున్నానని, రిషి తనకు ఆ విషయంలో సపోర్ట్ గా ఉన్నారని కానీ, ఇప్పుడు రిషి తన పక్కన లేడని, ఆ కనిపించకుండా పోయేది ఏదో తాను పోయినా బాగుండని, ఆ ప్రమాదం ఏదో తనకు జరిగినా బాగుండు అని  బాధపడుతుంది. అనుపమ.. అలాంటి మాటలు మాట్లాడకూడదు అని సలహా ఇస్తుంది. రిషికి ఏమీ కాదు అని ధైర్యం చెబుతుంది. రిషి త్వరలోనే వస్తాడని తనకు సిక్స్త్ సెన్స్ చెబుతోందని, ధైర్యంగా ఉండమని చెబుతుంది. మహేంద్ర కూడా రిషి త్వరలోనే వచ్చేస్తాడని, మీ ప్రేమ చాలా గొప్పదని, ఆ ప్రేమే మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తుందని  చెబుతాడు.

69
Guppedantha Manasu

ఇక, శైలేంద్ర తల్లితో కలిసి కాలేజీకి చేరుకుంటాడు. ఈ కాలేజీని చూస్తుంటే నీకు ఏమనిపిస్తోంది మామ్ అని అడుగుతాడు. ఇక, వెంటనే ఇది ఒక కోట అని, ఆ కోటను నువ్వు ఏలాలని అనుకుంటున్నావ్ అని దేవయాణి చెబుతుంది. తల్లీ కొడుకులు ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారు. ఎప్పుడెప్పుడు ఎండీ సీటులో కూర్చుందామా అనిపిస్తోందని శైలేంద్ర అంటే.. రిషి కూడా లేడు కదా.. ఈరోజే కూర్చోమని, మనల్ని ఎవరు ఆపుతారు అని అంటుంది. వసుధార అడ్డుపడుతుందేమో అని శైలేంద్ర సందేహం వ్యక్తం చేస్తుంటే, దానికి నువ్వు బయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తీసుకొని వెళ్తుంది.

79
Guppedantha Manasu

డైరెక్ట్ గా ఎండీ రూమ్ లోకి తల్లీ కొడుకులు వెళతారు. ఆ ఎండీ సీటుని పట్టుకొని శైలేంద్ర తెగ మురిసిపోతుంటాడు. డీబీఎస్టీ ఎండీ శైలేంద్ర భూషణ్ అనే బోర్డు రావాలని, ఎండీ సీటు తనను అయస్కాంతంలా సాగుతుందని అంటాడు. పక్కన  ఇంకో ఛైర్ ఉందేంటి అని అడుగుతాడు. ఆ ఎండీ సీటు తన భర్త మాత్రమే కూర్చోవాలని, తాను పక్కన మరో కుర్చీ వేసుకుందని దేవయాణి చెబుతుంది. రిషి ఎండీ సీటులో కూర్చుంటే నేను పక్కన చాప మీద కూర్చోవాలా? ఎండీ సీటులో కుర్చోవడానికి రిషి మాత్రమే అర్హుడా? సమయం వచ్చినప్పుడు ఎవరైనా గద్దె దిగాల్సిందే. కొత్తవాళ్లు గద్దె ఎక్కాల్సిందే అంటాడు. వెంటనే దేవయాణి.. ఆలస్యం ఎందుకు ఆ కుర్చీలో కూర్చో..మనల్ని ఎవర్రా ఆపేది అంటుంది.

89
Guppedantha Manasu

శైలేంద్ర కూడా కూర్చోవడానికి రెడీ అయిపోతాడు. వెంటనే వసుధార వచ్చి ఆగు అని అరుస్తుంది. శైలేంద్ర కూర్చునేవాడు కూడా పైకి లేస్తాడు. వసు వచ్చి.. ఎండీ సీటును పక్కకు జరుపుతుంది. ఈ సీటులో మీరు కూర్చోవద్దు అని అంటుంది. ఎందుకు అని దేవయాణి అంటే.. అది రిషి సర్ సీటు అంటుంది. అలా అని ఎక్కడైనా రాసి ఉందా అని దేవయాణి అడిగితే.. అవునని, ఎండీ అయినా తానే అందులో కూర్చోవడం లేదని చెబుతుంది. నువ్వు కూర్చోవడం లేదు అంటే అది నీ వ్యక్తిగతం, నా కొడుకు ఎందుకు కూర్చోకూడదు అని అడుగుతుంది. అయితే, వసు అంతే పొగరుగా అది రిషి సర్ సీటు అని, రిజర్వ్ చేసి పెట్టాను అని చెబుతుంది. అందులో కూర్చోవాలంటే అర్హత ఉండాలి అంటుంది. దానికి దేవయాణి తన కొడుకు ఫారిన్ లో చదివి వచ్చాడని ఆ ఆర్హత సరిపోదా అని అడుగుతుంది. వసు ఆ అర్హత సరిపోదని, డిగ్రీ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదని, నాయకత్వ లక్షణాలు ఉండాలని, కనుసైగతో అందరినీ శాశించే అర్హత ఉండాలని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి  అందరూ గౌరవం ఇచ్చేలా ఉండాలని..అవన్నీ రిషి సర్ కి మాత్రమే ఉన్నాయి అంటుంది.

99
Guppedantha Manasu

వసుధార ఎంత చెప్పినా, రెండు నిమిషాలు ఆ సీటులో కూర్చుంటానని, పేషెంట్ ని కదా అని అడుగుతాడు. వసు మాత్రం అంగీకరించదు. కావాలంటే వీల్ చైర్ తెప్పిస్తానని, లేదంటే స్ట్రెచ్చర్ తెప్పించి హాస్పిటల్ కి పంపిస్తాను అంటుంది. అంతేకానీ... రిషి సర్ సీటులో కూర్చోవడానికి అర్హుడు కాదు అని తేల్చిచెప్పేస్తుంది. కనీసం సీటు మీద చెయ్యి కూడా వెయ్యనివ్వదు. దేవయాణికి కోపం వస్తుంది..  ఇది మా సామ్రాజ్యం.. మా ఇష్టం అని, నా కొడుకును అలా అంటావేంటి అని అంటుంది. దానికి వసు.. మీ కొడుకు అయితే, మీ ఇంట్లో కుర్చీ వేసి కూర్చోపెట్టుకోమ్మని చెబుతుంది. మీ రాచరికాలు మీ ఇంట్లో చూపించుకోండి.. ఇక్కడ కాదు అంటుంది.

దేవయాణి మాత్రం ఈ కాలేజీ మాదని, మేం కూడా బోర్డు మెంబర్స్ అనే విషయం మర్చిపోకు అని అంటే, వసు అంతే పొగరుగా.. ఆ సీటుకి దూరంగా జరగండి అంటుంది. ఆ కుర్చీ పట్టుకోవడానికి కూడా శైలేంద్ర పనికి రాడు అని తేల్చి చెప్పేస్తుంది. తల్లీ కొడుకులకు చాలా చక్కగా బుద్ధి చెబుతుంది. వసు అరుపులకు అటెండర్ భయపడి వస్తాడు. అతను చూస్తున్నా కూడా  వసు ఏ మాత్రం తగ్గకుండా.. మీ తాటాకు చప్పుళ్లకు నేను భయపడను అని.. అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. దేవయాణి వెళ్లకపోతే ఏం చేస్తావ్ అని రెట్టించి అడుగుతుంది. అయితే, వసు.. మెడ పట్టి బయటకు గెంటేస్తాను అంటుంది. దానికి దేవయాణి.. నువ్వు నా కొడుకును రెచ్చగొడుతున్నావ్ అంటే, రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మీ కొడుకు పశువా అని అడుగుతుంది. వెంటనే, అటెండర్ ని తిడుతుంది.. వీళ్లను లోపలికి ఎలా రానిచ్చావ్ అని  అరుస్తుంది. ముందు.. వీళ్లను బయటకు పంపు అని గట్టిగా అరుస్తుంది. మరోవైపు దేవయాణి.. మమ్మల్ని ఎవరు గెంటేస్తారు అని కదలకుండా నిల్చుకుంటుంది. వసు గట్టిగా గదమడంతో.. వాళ్లను బయటకు పంపడానికి అటెండర్ ముందుకు వస్తాడు. నిజంగానే అటెండర్ గెంటేస్తే.. పరువు పోతుందని భావించి.. తల్లీ కొడుకులు బయటకు వెళ్లిపోతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories