మొదట్లో శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉంటే అత్యధిక ఓటింగ్ శివాజీకి పడేది. తర్వాత స్థానంలో ప్రశాంత్ ఉండేవాడు. షో ముగింపు దశకు చేరుకుంటుండగా ప్రశాంత్ అందరికంటే అత్యధిక ఓట్లు సాధించేవాడు. మిగతా వాళ్ళతో అతనికి పోటీ లేకుండా పోయింది. ప్రశాంత్ శివాజీ శిష్యుడిగా హౌస్లో మెలిగాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ స్పై టీమ్ గా పేరుగాంచారు.