Jabardasth : ‘జబర్దస్త్’ పుణ్యం.. దర్శకులుగా, హీరోలుగా మారింది వీరే!

Published : Nov 13, 2023, 09:55 PM ISTUpdated : Nov 14, 2023, 03:20 PM IST

కమెడియన్లుగా బుల్లితెరపై కడుపుబ్బా నవ్వించిన వారే.. దర్శకులుగా, హీరోలుగా మారి వెండితెరపై అదరగొడుతున్నారు. ముఖ్యంగా ‘జబర్దస్త్’ నుంచి వచ్చి బిగ్ స్క్రీన్ పై అలరిస్తున్న వారి గురించి తెలుసుకుంది. వారి మూవీ డిటేయిల్స్ చూద్దాం.  

PREV
18
Jabardasth : ‘జబర్దస్త్’ పుణ్యం.. దర్శకులుగా, హీరోలుగా మారింది వీరే!

నటుడు వేణు ఎల్దండి (Venu Yeldandu) ‘జబర్దస్త్’తో తెలుగు ప్రేక్షకులకు బాగా పాపులర్ అయ్యారు. అంతకు ముందే కమెడియన్ గా ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది. ‘జబర్దస్త్’ (Jabardasth)తో మరింత క్రేజ్ సొంతమైంది. ఆ షో మానేశాకా వేణు తీసిన చిత్రం ‘బలగం’ (Balagam). దిల్ రాజ్ నిర్మాతగా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దర్శకుడిగా వేణు ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందాయి. టాలీవుడ్ ప్రముఖులు వేణును ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం కమెడియన్ నుంచి దర్శకుడిగా కెరీర్ ను మలుచుకున్నారు. 

28

తెలుగులో ఎన్నో చిత్రాల్లో ధన్ రాజ్ (Dhan Raj) కామెడీ పాత్రల్లో అలరించారు. స్టార్ హీరోల సినిమాల్లో సందడి చేశారు. కమెడియన్ గా, హీరోగానూ పలు చిత్రాలు చేశారు. ఆయనకూ ‘జబర్దస్త్’తోనే మంచి గుర్తింపు దక్కిందని చెప్పాలి. ఆయన స్కిట్లతో ఆడియెన్స్ లో ఎంతగానో అలరించారు. వేణు తర్వాత.. ఈయన కూడా దర్శకుడిగా మారారు. రీసెంట్ గానే ధన్ రాజ్ డైరెక్టర్ గా సినిమా ప్రారంభమైంది. వినోదభరితమైన చిత్రాన్ని తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా నటిస్తుండగా.. కొడుకుగా ధనరాజ్ నటిస్తుండడం విశేషం, అజయ్ ఘోష్, కమెడియన్ పృథ్వీ, లావణ్య రెడ్డి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడిగా ధన్ రాజ్ ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.

38

‘జబర్దస్త్’ ద్వారా మంచి గుర్తింపు వచ్చిన వారిలో కిర్రాక్ ఆర్పీ (Kirrak RP) కూడా ఒకరు. క‌మెడియన్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఆర్‌పీ కూడా ద‌ర్శ‌కునిగా మారారు. జేడీ చక్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌లో ఆయ‌న ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలోనే ప్రారంభమైన ఈ చిత్రం నుంచి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. మున్ముందు పట్టాలెక్కించే అవకాశమూ లేకపోలేదు.  శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 

48

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రస్తుతం హీరోగా సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఈయనకూ ‘జబర్దస్త్’ వల్లే ఎంతో క్రేజ్ దక్కింది. సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఆయన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే నమ్మకం సాధించడం విశేషం. ఇక సుధీర్ హీరోగా ‘సాఫ్ట్ వేర్  సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’, ‘కాలింగ్ సహస్త్ర’, ‘గాలోడు’ వంటి సినిమాలు వచ్చాయి. Gaaloduతో మాస్ హిట్ అందుకున్నారు. నెక్ట్స్ ‘గోట్’ అనే సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.
 

58

బుల్లితెర కమల్ హాసన్ టైటిల్ ను గెటప్ శ్రీను (Getup Srinu)కు అందించింది ‘జబర్దస్త్’. ఈయన పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వేషధారణలతో కడుపుబ్బా నవ్వించిన శ్రీను ప్రతిభ ఏంటో టీవీ ఆడియెన్స్ కు బాగానే తెలుసు. అయితే ఇప్పుడు శ్రీను కూడా హీరోగా అలరించబోతున్నారు. గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). ఇప్పటికే టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 

68

‘జబర్దస్త్’, ‘ఎక్ట్స్ ట్రా జబర్దస్త్’ షోలతో ఎంతో కామెడి పంచిన షకలక శంకర్ (Shakalaka Shankar)  ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. బుల్లితెరపై అలరించినా ఆయన నటుడిగా, లీడ్ రోల్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘శంభో శంకర’, ‘కార్పోరేటర్’ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. మరిన్ని సినిమాలతో అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

78

కమెడియన్ గా ‘జబర్దస్త్’తో  రాకింగ్ రాకేష్ (Rocking Rakesh)కు మంచి గుర్తింపు దక్కింది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్  బాగా ఇష్టపడుతుంటారు. రాకింగ్ రాకేష్ హీరోగా కూడా ఓ సినిమా రాబోతోంది. KCR అనే టైటిల్ తో ఇటీవలెనే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

88

బుల్లితెరపై పంచుల వర్షం కురిపించే హైపర్ ఆది (Hyper Aadi)  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సినిమాల ఫంక్షన్ల ద్వారానే సెన్సేషన్ గా మారుతున్నారు. అయితే ఆది అటు దర్శకుడిగానూ, ఇటు హీరోగానూ సినిమాలను ప్రకటించలేదు. కానీ చాలా సినిమాలకు డైలాగ్స్ రాస్తూ బిగ్ స్క్రీన్ పై తన మార్క్ ను చూపిస్తున్నారు. మున్ముందూ ఈయన కూడా రైటర్ గానో, డైరెక్టర్ గానో మారే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

click me!

Recommended Stories